newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మూడు వారాలు.. మూడు నెల‌లు అవుతుందా..?

28-03-202028-03-2020 08:12:54 IST
Updated On 28-03-2020 11:09:41 ISTUpdated On 28-03-20202020-03-28T02:42:54.946Z28-03-2020 2020-03-28T02:42:51.028Z - 2020-03-28T05:39:41.246Z - 28-03-2020

మూడు వారాలు.. మూడు నెల‌లు అవుతుందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో క‌రోనా వైర‌స్‌ను మొద‌టి ద‌శ‌లోనే నివారించేందుకు గానూ మొత్తం దేశాన్ని మూడు వారాల పాటు లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది కేంద్ర ప్ర‌భుత్వం. జ‌నాభా ఎక్కువ‌గా ఉండే, వైద్య స‌దుపాయాలు త‌క్కువ‌గా ఉండే మ‌న దేశంలో క‌రోనా వైర‌స్ ఏ మాత్రం అదుపు త‌ప్పినా పెను ప్ర‌మాదం సంభ‌వించే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్ ఒక్క‌టే ఏకైక మార్గంగా భావించిన ప్ర‌భుత్వం ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. 21 రోజుల లాక్‌డౌన్ ద్వారా క‌రోనా వైర‌స్ వ్యాప్తిని పూర్తిగా నివారించ‌వ‌చ్చ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది.

అయితే కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా తీసుకుంటున్న నిర్ణ‌యాలు మాత్రం కొంత విరుద్ధంగా ఉన్నాయి. మూడు వారాల వ‌ర‌కు లాక్‌డౌన్ ప్ర‌క‌టించినా మూడు నెల‌ల వ్యూహంతో కేంద్ర ప్ర‌భుత్వం అడుగులు వేస్తోంది. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టించింది.

లాక్‌డౌన్ కార‌ణంగా ప‌నులు కోల్పోతున్న వారిని ఆదుకునే ఉద్దేశ్యంతో మూడు నెల‌ల కోసం కొంత ఆదుకునే చ‌ర్య‌లు తీసుకుంటోంది. ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ యోజ‌న ప‌థ‌కం పేరుతో దేశంలోని పేద‌ల‌కు మూడు నెల‌ల పాటు ఉచితంగా రేష‌న్ అందజేయ‌నున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు.

వృద్ధులు, వితంతులు, దివ్యాంగుల‌కు కూడా మూడు నెల‌ల్లో రూ.వెయ్యి చొప్పున అంద‌జేయ‌నున్న‌ట్లు తెలిపారు. మ‌రోవైపు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మూడు నెల‌ల పాటు దేశ ప్ర‌జ‌ల‌కు ఊర‌ట‌నిచ్చే నిర్ణ‌యాలు తీసుకుంది. ట‌ర్మ్ లోన్ల‌పై ఈఎంఐలపై మూడు నెల‌ల మార‌టోరియం విధించింది. మూడు నెల‌ల పాటు ఈఎంఐలు క‌ట్ట‌కుండా మ‌ధ్య‌త‌ర‌గ‌తి, పేద‌ల‌కు ఊర‌ట‌ను క‌లిగించింది. ఇలా కేంద్రం, ఆర్‌బీఐ కూడా మూడు నెల‌ల పాటు దేశ ప్ర‌జ‌ల‌ను ఆదుకునేలా చ‌ర్య‌లు ప్రారంభించాయి.

దీంతో లాక్‌డౌన్‌ను మూడు వారాల నుంచి మూడు నెల‌ల‌కు పెంచుతారా అనే అనుమానాలు ప్ర‌జ‌ల్లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి. క‌రోనా వైర‌స్ పుట్టిన చైనాలోని కొన్ని ప్రాంతాల‌ను మూడు నెల‌ల పాటు పూర్తిగా లాక్‌డౌన్‌లో ఉంచింది. చైనా త‌ర్వాత క‌రోనా వైర‌స్ వేగంగా విజృంభించిన ఇట‌లీ కూడా నెల రోజులుకు పైగా లాక్‌డౌన్‌లోనే ఉంటోంది. మ‌న దేశంలో ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న లాక్‌డౌన్ కీల‌కంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కైతే చాలా దేశాల‌తో పోల్చుకుంటే కరోనా వైర‌స్ వ్యాప్తి భార‌త్‌లో త‌క్కువ‌గానే ఉంది. మ‌న ప్ర‌భుత్వాలు కూడా క‌రోనాపై వేగంగానే అప్ర‌మ‌త్త‌మై త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాయి.

అయితే, ఈ 21 రోజులు లాక్‌డౌన్ స‌రిగ్గా అమ‌లైతే క‌రోనా వ్యాప్తి చాలా మేర‌కు అదుపులోకి రావాలి. ఇదే ప్ర‌భుత్వ ఆలోచ‌న కూడా. ఈ 21 రోజుల్లో క‌రోనా వైర‌స్ బారిన ప‌డిన వారిని గుర్తించి, ఇత‌రుల నుంచి వారిని వేరు చేసి చికిత్స ఇవ్వ‌డం ద్వారా వారి నుంచి ఇత‌రుల‌కు వ్యాపించ‌కుండా చూడాల‌నుకుంటోంది ప్ర‌భుత్వం. మూడు వారాల్లో ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌నే దానిపై ఒక క్లారిటీ వ‌స్తుంది. త‌క్కువ కేసులు న‌మోదై ప‌రిస్థితి అదుపులో ఉంటే లాక్‌డౌన్ ఎత్తివేసే అవ‌కాశాలే ఉన్నాయి.

ఒక‌వేళ ఇంకా ఆపాయం ఉంది అనుకుంటే లాక్‌డౌన్ పెంచ‌వ‌చ్చు. అయితే, 21 రోజులే లాక్‌డౌన్ ఉన్నా క‌రోనా ప్ర‌భావం మాత్రం పేద‌ల‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌పై క‌నీసం మూడు నెల‌లు ఉండే అవ‌కాశం ఉంద‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అందులో భాగంగానే మూడు నెల‌ల పాటు వారిని ఆదుకునేందుకే కేంద్రం, ఆర్బీఐ మూడు నెల‌ల చ‌ర్య‌లు తీసుకుంటోంది. అయితే, మూడు వారాల్లోనే మ‌న దేశంలో క‌రోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోకి రావాల‌ని కోరుకుందాం.

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   12 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle