newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మూడు రోజులుగా తిండి లేదు.. ఫుట్‌బాల్‌లా ఆడుకున్నారు.. వలస కూలీల వ్యధలు

09-05-202009-05-2020 10:05:31 IST
Updated On 09-05-2020 10:57:01 ISTUpdated On 09-05-20202020-05-09T04:35:31.335Z09-05-2020 2020-05-09T04:34:59.518Z - 2020-05-09T05:27:01.831Z - 09-05-2020

మూడు రోజులుగా తిండి లేదు.. ఫుట్‌బాల్‌లా ఆడుకున్నారు.. వలస కూలీల వ్యధలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తూ స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో వలస కార్మికులు ఇంటి బాట పట్టారు. శ్రామిక్‌ రైళ్లలో పలువురు సొంత రాష్ట్రాలకు వెళ్తుండగా.. మరికొందరు కాలినడకను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అహ్మదాబాద్‌ నుంచి కర్ణాటక సరిహద్దుకు చేరుకున్న వలస కార్మికులకు చేదు అనుభవం ఎదురైంది. అధికారులు అడ్డుకోవడంతో కర్ణాటక- మహారాష్ట్ర సరిహద్దులో తిండీతిప్పలు లేకుండా 72 గంటల పాటు పడిగాపులు కాయాల్సి వచ్చింది. 

ప్రతిపక్ష నేత సిద్దారామయ్య సహా ఇతర నాయకులు జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు శుక్రవారం ఉదయం 2 గంటలకు కర్ణాటకలో ప్రవేశించేందుకు పోలీసులు వారికి అనుమతినిచ్చారు. వివరాల్లోకి వెళితే, కర్ణాటకలోని బాగల్‌కోటెకు చెందిన 30 మంది రెండు నెలలుగా అహ్మదాబాద్‌లో చిక్కుకుపోయారు. అక్కడే 20 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మే 4న లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన క్రమంలో సొంతూరికి వెళ్లేందుకు అహ్మదాబాద్‌ ప్రభుత్వ యంత్రాంగం వారికి అనుమతినిచ్చిది. 

ఈ క్రమంలో వారు మంగళవారం రాత్రి నాటికి కర్ణాటక సరిహద్దులోని నిప్పనికి చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. గుజరాత్‌ ప్రభుత్వం ఇచ్చిన అనుమతి పత్రాలు చూపించినప్పటికీ రాష్ట్రంలో ప్రవేశించిందేకు అనుమతి నిరాకరించారు. యాప్‌లో అప్లై చేసుకున్నప్పటికీ దానిని హోల్డ్‌లో పెట్టేశారు. దీంతో గత మూడు రోజులుగా వారు అక్కడే ఉండిపోయారు.

ఈ విషయం గురించి బాధితుడు యూసఫ్‌ ముధోల్‌ మాట్లాడుతూ.. ‘‘వాళ్లు మమ్మల్ని క్రిమినల్స్‌లా చూస్తున్నారు. శరణార్థులకు కూడా ఇలాంటి కష్టాలు ఉండవు. మా పోలీసులే మమ్మల్ని లోపల అడుగుపెట్టనీయడం లేదు. మహారాష్ట్ర లేదా గుజరాత్‌కి వెళ్లిపొమ్మని చెబుతున్నారు. అక్కడి పోలీసులేమో కన్నడిగులు కర్ణాటకకు వెళ్లాలని చెప్తున్నారు. మూడురోజులుగా ఫుట్‌బాల్‌లా మమ్మల్ని ఆడుకుంటున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. మంచి నీళ్లు, ఆహారం దొరకక నానా అవస్థలు పడుతున్నామని ఉద్వేగానికి గురయ్యాడు. 

కాగా కర్ణాటక- గోవా సరిహద్దులో కూడా ఇలాంటి ఘటనలే చోటుచేసుకోవడంతో యడ్డీ సర్కారుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన సీఎం యడియూరప్ప ఇటువంటి ఘటనలు పునరావృతం కావని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ, గుజరాత్‌, మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఉధృతంగా ఉండటంతో.. అక్కడి నుంచి వచ్చే వాళ్లను రాష్ట్రంలోకి అనుమతించకూడదని సీఎస్‌ ఆదేశించారని ఓ ప్రభుత్వ అధికారి పేర్కొనడం గమనార్హం.

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు స్వస్థలాలకు పయనమైన వేళ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతున్నందున వలస కార్మికులకు అక్కడే ఉండాల్సిందిగా కోరుతూ రైళ్లను రద్దు చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప ప్రాపర్టీ బిల్డర్స్‌తో సమావేశమైన అనంతరం ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు. 

‘‘ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో కోవిడ్‌-19 వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రెడ్‌ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో వ్యాపారాలు, భవన నిర్మాణ కార్యకలాపాలు, పరిశ్రమలు తిరిగి ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో వలస కార్మికుల ప్రయాణాలు అనవసరం అని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. అదే విధంగా ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి 3500 బస్సులు, రైళ్లలో దాదాపు లక్ష మందిని స్వస్థలాలకు పంపించామని యడియూరప్ప తెలిపారు. ఉపాధి కార్యకలాపాలు ప్రారంభమవుతున్నందున రాష్ట్రంలోనే ఉండిపోవాలని వలస కార్మికులకు విజ్ఞప్తి చేశారు. 

ఇక ఈ విషయం గురించి వలస కార్మికుల తరలింపు ఇన్‌చార్జి, నోడల్‌ ఆఫీసర్‌ మంజునాథ్‌ ప్రసాద్‌ రైల్వేశాఖకు మంగళవారం లేఖ రాశారు. బుధవారం కర్ణాటక నుంచి బయల్దేరే రైళ్లను రద్దు చేయాల్సిందిగా అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దాదాపు 10 వేల మంది కార్మికులు బిహార్‌ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం రైళ్లను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. 

ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం నిర్మాణ సంస్థలతో భేటీ అయిన సీఎం యడియూరప్ప.. మెట్రో, బీఐఏఎల్‌, ఇతర ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నందున వారిని ఇక్కడే నిలిచిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఉపాధి పనులు ప్రారంభం అవుతాయి కాబట్టి రైళ్లను రద్దు చేయాలని రైల్వే శాఖకు లేఖ రాశాం’’ అని పేర్కొన్నారు. 

కాగా వలస కార్మికుల తరలింపునకై రాష్ట్రం నుంచి రెండు ప్రత్యేక రైళ్లను నడపాల్సిందిగా ప్రభుత్వం రైల్వే శాఖను కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఏడు గంటలకు రెండు శ్రామిక్‌ రైళ్లు చిక్‌బన్వారా నుంచి లక్నో, మాలూర్‌ నుంచి బార్‌కకానా(జార్ఖండ్‌)కు బయల్దేరాయి. దాదాపు 2400 మంది ప్రయాణికులు తమ స్వస్థలాలకు చేర్చనున్నాయి. 

 

నా రూటే సెప‌రేటు

నా రూటే సెప‌రేటు

   4 minutes ago


బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   14 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   19 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle