newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

మూకదాడులపై మోడీకి ప్రముఖుల లేఖాస్త్రం ..ఏం రాశారంటే?

25-07-201925-07-2019 13:10:45 IST
Updated On 25-07-2019 14:44:32 ISTUpdated On 25-07-20192019-07-25T07:40:45.450Z25-07-2019 2019-07-25T07:39:38.505Z - 2019-07-25T09:14:32.568Z - 25-07-2019

 మూకదాడులపై మోడీకి ప్రముఖుల లేఖాస్త్రం ..ఏం రాశారంటే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రెండవసారి మోడీ అధికారం చేపట్టాక బీజేపీ అధ్వర్యంలోని ఎన్డీయే సర్కార్ దూకుడు ఎక్కువైందని అంతా అంటున్నారు. విపక్షాల విమర్ళల సంగతి ఎలా వున్నా.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం ఇంచుమించు అదే అభిప్రాయం వ్యక్తం చేయడం చర్చనీయాంశం అవుతోంది.

Image result for Celebs write to PM Modi over incidents of lynching

దేశ వ్యాప్తంగా దళితులు, మైనారిటీలపై హింసాత్మక ఘటనలు పెచ్చు మీరుతున్నాయి. జై శ్రీరాం నినాదం ఇప్పుడు దేశంలో హింసాత్మకంగా మారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ‘‘ఈపరిస్థితికి తాము చింతిస్తున్నాం.ఈ ఘటనలను ఖండిస్తున్నాం’’ అంటూ వివిధ రంగాలకు చెందిన 49 మంది ప్రముఖులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాయడంపై చర్చ జరుగుతోంది. 

‘అధిక వర్గాలకు జై శ్రీరాం పవిత్రమైనది.. దానిని అపవిత్రం చేయడం మానేయండి. దళితులు, క్రైస్తవులు, ముస్లింలపై జరుగుతున్న అమానుష ఘటనలను, ఊచకోతలను వెంటనే అరికట్టాలని వారు కోరారు. అధిక వర్గాలు పవిత్రంగా భావించే ‘జై శ్రీరాం’ను అపవిత్రం చేయకండి అని ఆ లేఖలో పేర్కొన్నారు.

దళితులు, ముస్లింలపై జరుగుతున్న ఊచకోతలను అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘అసమ్మతి లేని ప్రజాస్వామ్యం ఉండదు. అలాగని ప్రజలను దేశ వ్యతిరేకులుగా, అర్బన్‌ నక్సల్‌గా ముద్ర వేయకూడదని, అసమ్మతిని కారణంగా చూపి ప్రజలకే శిక్షలు వేయకూడదని వారు పేర్కొన్నారు. 

ఈ లేఖ పై చారిత్రకవేత్త రామచంద్ర గుహ, సామాజిక వేత్తలు డాక్టర్‌ బినాయక్‌ సేన్‌, ఆశిష్‌ నంద్యా , సినిమా సెలబ్రిటీలు అదూర్‌ గోపాలకృష్ణ, మణిరత్నం, అనురాగ్‌ కశ్యప్‌లు, అపర్ణ సేన్, కొంకణా సేన్‌ శర్మలతో పాటు మొత్తం 49 మంది ప్రముఖులు  లేఖపై సంతకాలు చేశారు.

దక్షిణాదికి సంబంధించి ఇద్దరు ప్రముఖులు ఈ లేఖపై సంతకాలు చేశారు. వారే దర్శకుడు మణిరత్నం, తమిళనటుడు సూర్య. గతంలో అవార్డ్ వాప్సీ ఉద్యమం నడిచింది. ఈ ఉద్యమంపై బీజేపీ మద్దతుదారులు మండిపడ్డారు. అలాంటి వాళ్లంతా పాకిస్తాన్ వెళ్లిపోవాలంటూ బీజేపీలోని కొంతమంది వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle