newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

ముస్లింనేత చేరికపై కమలంలో కలవరం

30-06-201930-06-2019 09:30:25 IST
2019-06-30T04:00:25.828Z30-06-2019 2019-06-30T04:00:01.822Z - - 26-08-2019

ముస్లింనేత చేరికపై కమలంలో కలవరం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేర‌ళ బీజేపీలో ఇప్పుడు ఓ వ్య‌క్తి చేరిక కార్య‌క‌ర్త‌ల‌ను ఇబ్బంది పెడుతోంద‌ట‌. రాష్ట్రానికి చెందిన సంఘ్ ప‌రివార్ కార్య‌క‌ర్త‌లు కూడా ఆయ‌న చేరిక మీద మండిప‌డుతున్నార‌ట‌.

అయితే బీజేపీ మాత్రం కొంచెం ఓపిక ప‌ట్ట‌మంటూ అటు కార్య‌క‌ర్త‌ల‌ను, ఇటు సంఘ్ ప‌రివార్ నేత‌ల‌ను బుజ్జ‌గిస్తోంద‌ట‌. ఇంత‌కీ అత‌ను ఎవ‌రంటే కేర‌ళ‌కు చెందిన ముస్లిం నేత‌, కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు అబ్దుల్లా కుట్టి. ఈ మ‌ధ్య ఢిల్లీలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని క‌ల్సిన అబ్దుల్లా కుట్టి, లాంఛ‌నంగా బీజేపీలో చేరారు. 

సీపీఎం నుంచి రాజ‌కీయ జీవితం మొద‌లు పెట్టిన అబ్దుల్లా కుట్టి, ముస్లింల‌లో ప‌ట్టున్న నేత‌. ఆ పార్టీ నుంచి రెండుస్లారు ఎంపీగా గెలిచారు. అయితే 2004 ఎన్నిక‌ల్లో గెలిచిన ఆయ‌న 2006లో త‌మిళ‌నాడులోని వైతీశ్వ‌ర‌న్ కోవెల్ సిద్ధాంతుల ద‌గ్గ‌ర నాడీ జ్యోతిష్యం చెప్పించుకోవ‌డంతో ఆయ‌న్ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించారు సీపీఎం నేత‌లు.

వ్య‌క్తిగ‌తంగా, రాజ‌కీయంగా ముఖ్య నిర్ణ‌యం తీసుకునే ముందు నాడీ జ్యోతిష్యం చెప్పించుకోవ‌డం అబ్దుల్లా కుట్టికి అల‌వాటు. 

ఈ విష‌యం తెల్సినా కూడా సీపీఎం నేతలు పార్టీ నుంచి బ‌హిష్క‌రించ‌డంతో ఆయ‌న‌, కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి రెండుసార్లు ఎంఎల్ఏగా గెలుపొందారు. మొన్న‌టి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోవ‌డంతో, త‌న రాజ‌కీయ జీవితం మీద అబ్దుల్లా కుట్టికి బెంగ ప‌ట్టుకుంద‌ట‌. దీంతో ఆయ‌న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని పొగ‌డ‌టం మొద‌లు పెట్టారు. ఈ విష‌యం తెల్సుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయ‌న్ని పార్టీ నుంచి బ‌హిష్క‌రించింది. 

ఆ త‌ర్వాతే ఆయ‌న బీజేపీలో చేరారు. దీంతో కుట్టి చేరిక‌ను సంఘ్ ప‌రివార్ తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంద‌ట‌. ఎందుకంటే, కేర‌ళ‌లో ముస్లింల‌కు, ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య దాడులు, హ‌త్య‌లు జరుగుతున్నాయి. ఈ స‌మ‌యంలో ఓ ముస్లిం నేత బీజేపీలో చేర‌డం అంటే, కార్య‌కర్త‌ల మ‌నోభావాల‌ను దెబ్బ తీయ‌డ‌మే అంటున్నారు సంఘ్ ప‌రివార్ పెద్ద‌లు. 

అయితే బీజేపీ నేతలు మాత్రం కొన్నాళ్ల పాటు వేచి చూడాల‌నీ, అబ్దుల్లా కుట్టి పార్టీ నియ‌మాలు, సిద్ధాంతాలు, ఆదేశాల‌ను ఏ మేర‌కు పాటిస్తారో తెల్సుకున్న త‌ర్వాతే ఆయ‌న చేరిక‌ను ఆమోదిస్తామ‌ని చెబుతున్నారట‌. 

ఎందుకంటే కొద్ది రోజుల్లో మంజీశ్వ‌రం అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జ‌ర‌గ‌బోతోంది. 2016లో జ‌రిగిన కేర‌ళ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈ సీటు నుంచి ఇండియ‌న్ యూనియ‌న్ ముస్లిం లీగ్ నేత అబ్దుల్ ర‌జాక్ గెలిచారు. 

త‌న ప్ర‌త్య‌ర్థి కే. సురేంద్రన్ మీద కేవ‌లం 89 ఓట్ల‌తో మాత్ర‌మే ఆయ‌న మెజార్టీ సాధించారు. గ‌తేడాది ఆయ‌న చ‌నిపోవ‌డంతో, ఇప్పుడు ఉప ఎన్నిక వ‌చ్చింది. ఈ ఎన్నిక‌లో బీజేపీకి అనుకూలంగా ముస్లింలతో ఓట్లు వేయించాల‌ని అబ్దుల్లా కుట్టిని అమిత్ షా ఆదేశించార‌ట‌.

సొంతంగా అయినా బీజేపీ గెల‌వ‌డం ఖాయ‌మ‌నీ, అయితే ముస్లింల ఓట్లలో చీలిక తెచ్చి, బీజేపీ అభ్య‌ర్థికి భారీ మెజార్టీ తెప్పించాల‌న్న‌దే అమిత్ షా ఆదేశంలోని అంత‌రార్థం. అంటే ఈ ఉప ఎన్నిక‌ అబ్దుల్లాకు అగ్నిప‌రీక్ష వంటిది.

ఒక‌వేళ బీజేపీ ప‌రీక్ష‌లో అబ్దుల్లా కుట్టి నెగ్గితే, ముస్లింలు కూడా బీజేపీకి మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని ఆ పార్టీ ప్ర‌చారం చేసుకుంటుంది. అప్పుడు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఇర‌కాటంలో ప‌డ‌టంతో పాటు, ముస్లింలకు వ్య‌తిరేకమ‌న్న మ‌చ్చ పోతుంద‌నేది అమిత్ షా ఆలోచ‌న‌. అందుకే కుట్టి చేరిక విష‌యంలో కొన్నాళ్ల పాటు ఆగండ‌ని సంఘ్ ప‌రివార్ నేత‌ల‌ను అమిత్ షా బుజ్జ‌గిస్తున్నార‌ట‌.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle