newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ముదిరిన విభేదాలు- ‘మహా’ సంకటం మరింత జఠిలం

29-10-201929-10-2019 15:45:03 IST
2019-10-29T10:15:03.163Z29-10-2019 2019-10-29T10:14:57.850Z - - 11-04-2021

ముదిరిన విభేదాలు- ‘మహా’ సంకటం మరింత జఠిలం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహారాష్ట్ర లో కూటమి విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో శివసేన, బీజేపీల మధ్య ఇప్పట్లో సయోధ్య కుదిరే అవకాశాలు కనిపించడం లేదు. అలా అని ప్రత్యామ్నాయాలు వెతికే అవకాశం కూడా రెండు పార్టీలకూ లేకుండా పోయింది. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభన ఇప్పట్లో తొలగేలా కనిపించడం లేదు. సోమవారం నాడు అటు బీజేపీ, ఇటు శివసేన వేర్వేరుగా గవర్నర్ ను కలిశాయి. ఈ సందర్భంగా ఇరు పార్టీలూ కూడా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపైనే చర్చించినట్లు సమాచారం. కాగా ఇరు పార్టీల మధ్య చర్చలకు ఒక మార్గం కొసం చేస్తున్న ప్రయత్నాలకు అడుగడుగునా విఘాదాలు ఏర్పడుతున్నాయి.

ఇందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, శివసేన సీనియర్ నాయకుడు, ఆ పార్టీ అధికార పత్రిక సామ్నా సంపాదకుడు అయిన సంజయ్ రావత్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. సంజయ్ రావత్  మొదటి నుంచీ బీజేపీ పట్ల ఒకింత విమర్శనాత్మకంగానే వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పటి దాకా సంయమనం పాటిస్తూ వచ్చిన దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తెగినా ఫరవాలేదన్న ధోరణిలో చేసిన వ్యాఖ్యలు విభేదాలు ముదిరాయనడానికి నిలువెత్తు నిదర్శనంగా మారాయి. వచ్చే ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రిని అంటూ ఫడ్నవీస్ ఈ రోజు చేసిన ప్రకటన ‘మహా’ రాజకీయాలను ఒక్క సారిగా వేడెక్కించింది.

శివసేనతో కయ్యానికి కాలు దువ్వుతున్న చందంగా ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీ తాడో పేడో తేల్చేసుకోవడానికి నిర్ణయించుకుందని తేటతెల్లం చేశాయి. శివసేనతో కలిసి ముఖ్యమంత్రి పదవిని పంచుకునే ప్రశక్తే లేదంటూ ఫడ్నవీస్ కుండబద్దలు కొట్టడంతో ఇక ఈ విషయంలో బేరసారాలకు తావు లేకుండా పోయింది. శివసేన ప్రతిపాదిస్తున్న 50-50 ఫార్ములాను ఆయన కొట్టి పారేశారు. అధిష్టానం ఇందుకు సుతరామూ అంగీకరించడం లేదని తేల్చి పారేశారు.

ఇక్కడి వరకూ సరే కానీ ఆ తరువాత మహారాష్ట్ర బీజేపీ నేతల వ్యాఖ్యలే కప్పగంతుల రాజకీయాలకు తెరలేపేవిగా ఉన్నాయి. రాష్ట్రంలో శివసేన నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలలో 45 మంది సీఎం ఫడ్నవీస్ తో టచ్ లో ఉన్నారంటూ బీజేపీ ఎంపీ సంజయ్ కాకడే చేసిన వ్యాఖ్య సంచలనం సృష్టించింది. ఫడ్నవీస్ ఒక్క సారి ఆమోదం తెలిపితే చాలు శివసేన నుంచి కనీసం 45 మంది ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరుతారని ఆయన చేసిన ప్రకటన చీలిక రాజకీయాలను ప్రోత్సహించేదిగా ఉందనడంలో సందేహం లేదు.

కానీ గత సార్వత్రిక ఎన్నికల సమయంలో స్వయంగా ప్రధాని మోడీయే పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఇటువంటి వ్యాఖ్యలు చేసి బీజేపీలో కొత్త సంప్రదాయానికి తెరతీయడంతో ఇప్పుడు మహారాష్ట్రలో ఆ పార్టీ ఎంపీ సంజయ్ కాకడే ప్రకటన ఏమంత ఆశ్చర్యం కలిగించదు.  తెగదెంపులకు మేం సిద్ధం అని బీజేపీ స్పష్టత ఇచ్చిన తరువాత ఇక తేల్చుకోవలసింది శివసేనే. ఇప్పుడు శివసేన ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపైనే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ఎలా ముందుకు సాగుతుందన్న విషయం తేలుతుంది.

50-50 ఫార్ములా ప్రకారం గట్టిగా పట్టుబడితే ముందుగా కాకపోయినా చివరి రెండున్నరేళ్లయినా   సీఎం పదవి దక్కుతుందన్న భావనతో ఉన్న శివసేనకు ఫడ్నవీస్ తానే వచ్చే ఐదేళ్లూ సీఎంగా ఉంటానంటూ చేసిన ప్రకటన ఒక విధంగా షాక్ అని చెప్పాలి. అయితే ఫడ్నవీస్ ఈ ప్రకటన చేయడానికి ముందు శివసేన సీనియర్ నాయకుడు ( ఆయన ఇప్పుడు పార్టీ అధికార ప్రతినిథి కాదు) తాము 50-50 ఫార్ములాకే కట్టుబడి ఉన్నామనీ, బీజేపీ మొండికేస్తే తమ ముందు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయనీ ప్రకటన చేశారు. బీజేపీ ఆడినట్లల్లా  ఆడడానికి హర్యానాలోలా మహారాష్ట్రలో ‘దుష్యంత్’ లు లేరని పేర్కొన్నారు. దీంతో శివసేన ఉద్దేశాలేమిటన్నది స్పష్టంగా బయటపడ్డాయని పరిశీలకులు అంటున్నారు.

కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం బీజేపీకి లేదు...కానీ శివసనే ఈ రెండు పార్టీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేని పరిస్థితి మహారాష్ట్రలో ఉంది. సంజయ్ రావత్ వ్యాఖ్యల వెనుక అర్ధం అదే.  బీజేపీపై ఒత్తిడి తీసుకువచ్చి 50-50 ఫార్ములాకు ఒప్పించడమే శివసనే వ్యూహం. అయితే ఈ వ్యూహం ఉచ్చులో పడేందుకు బీజేపీ ఏ మాత్రం సిద్ధంగా లేదని ఫడ్నవీస్ ప్రకటన తేటతెల్లం చేసింది. ఇప్పుడు బంతి శివసేన కోర్టులో ఉంది. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్-ఎన్సీపీ కూటమితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాయిస్ ను ఎంచుకుంటుందా? అన్నది ఆసక్తి కరంగా మారింది.  .బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడమే ఏకైక లక్ష్యంగా ఉన్న కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి శివసేనకు సీఎం పదవి వదులుకుని మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందనడంలో సందేహం లేదు

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle