newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ముగిసిన తొలివిడత... జార్ఖండ్‌లో అక్కడక్కడా ఉద్రిక్తత

01-12-201901-12-2019 08:15:43 IST
2019-12-01T02:45:43.067Z01-12-2019 2019-12-01T02:38:11.203Z - - 12-04-2021

ముగిసిన తొలివిడత... జార్ఖండ్‌లో అక్కడక్కడా ఉద్రిక్తత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జార్ఖండ్ రాష్ట్రంలో తొలివిడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్  ముగిసింది. శనివారం సాయంత్రం 3 గంటలకు ముగిసిన పోలింగ్ లో 62.87 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

పలు ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్‌ సందర్భంగా బిష్ణుపుర్‌ జిల్లాలోని ఓ కల్వర్టరు వద్ద మావోయిస్టులు బాంబు దాడి జరిపారని పోలీసులు తెలిపారు. ఎన్నికల్లో ప్రముఖులు ఆరోగ్య శాఖ మంత్రి రామ్‌ చంద్ర, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు రామేశ్వర్‌ ఓరాన్ బరిలో ఉన్నారు.  

మావోయిస్టుల దుశ్చర్యలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని వెల్లడించారు. దల్తోగంజ్‌ శాసనసభ నియోజకవర్గ పరిధిలో రెండు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. కాంగ్రెస్‌ అభ్యర్ధి కేఎన్  త్రిపాఠీ తుపాకీతో పోలింగ్‌ కేంద్రంలోకి వచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆయనను అడ్డుకొని తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.

81 స్థానాలు గల ఝార్ఖండ్‌ శాసనసభకు మొత్తం అయిదు విడతల్లో పోలింగ్‌ జరగనుంది.  చివరి విడత డిసెంబర్‌ 20న జరగనుండగా.. ఎన్నికల ఫలితాలు డిసెంబర్‌ 23న వెలువడతాయి.

తుపాకీతో హల్ చల్ చేసిన కాంగ్రెస్ నేత కెఎన్ త్రిపాఠీ 

కోసియారాలో కాంగ్రెస్‌ అభ్యర్థి కేఎన్‌ త్రిపాఠి ఆయుధాలతో పోలింగ్‌ బూత్‌లో ప్రవేశించాలని చూడగా పోలీసులు అడ్డుకొని అతని నుంచి ఓ పిస్టల్, మూడు కాట్రిడ్జ్‌లను సీజ్‌ చేశామని పలమౌ డిప్యూటీ కమిషనర్, రిటర్నింగ్‌ ఆఫీసర్‌ శాంతను అగ్రహారి తెలిపారు.  రెండవ విడత ఎన్నికలు ఈనెల 7వ తేదీన జరుగుతాయి. 5వ తేదీతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle