newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ముందు గొయ్యి... వెనుక నుయ్యిలా అకాలీల పరిస్థితి!

20-09-202020-09-2020 09:25:11 IST
Updated On 20-09-2020 11:06:51 ISTUpdated On 20-09-20202020-09-20T03:55:11.423Z20-09-2020 2020-09-20T03:55:08.297Z - 2020-09-20T05:36:51.468Z - 20-09-2020

ముందు గొయ్యి... వెనుక నుయ్యిలా అకాలీల పరిస్థితి!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్ర ప్రబుత్వం తీసుకువచ్చిన మూడు బిల్లుల పట్ల రైతుల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకత అకాలీల పరిస్థితిని అగమ్య గోచరంగా మార్చేసింది. పంజాబ్ లో రైతుల దన్నే అకాలీలకు బలం. అటువంటి రైతులే తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతుండటంతో అనివార్యంగా అకాలీదళ్ ఎన్డీయే నుంచి బయటకు రాకతప్పని పరిస్దితిలో ఉంది. రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం వల్ల పార్టీ ఎదుర్కొనే ఇబ్బందులకు కొంతలో కొంత  కేంద్రంలో ఎన్డీయేలో భాగస్వామ్యపక్షంగా ఉండటం ద్వారా తీరుతుందని శిరోమణి అకాలీదళ్ భావిస్తున్నది. కానీ కేంద్రం తీసుకు వచ్చిన వ్యవసాయ బిల్లుల కారణంగా రైతుల మద్దతు కోల్పోయి రాష్ట్రంలో రాజకీయ ఉనికికే ముప్పు ఏర్పడే పరిస్థితి రావడంతో వ్యూహాత్మకంగా ఆ పార్టీ ఎంపీ హర్ సిమ్రత్ కౌర్ రాజీనామా చేశారు.

ఆమె ఎంత వేగంగా రాజీనామా చేశారో...అంతే వేగంగా ఆమె రాజీనామా ఆమోదం పొందింది. దీంతో అకాలీల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడగా మారినట్లైంది. ఎందు కంటే రైతు సంఘాల నాయకులు, రైతులు కూడా అకాలీదళ్ రాజీనామాను డ్రామాగానే అభివర్ణిస్తున్నారు. హర్ సిమ్రత్ కౌర్ రాజీనామాను స్వాగతిస్తామంటూనే...పుణ్యకాలం కాస్తా గడిచాకా ఆమె చేసిన రాజీనామా వల్ల ప్రయోజనం శూన్యమంటూ పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమకు ఎన్డీయే పట్ల వ్యతిరేకత ఏమీ లేదనీ, అయితే కేంద్రం తీసుకువచ్చిన బిల్లులు రైతాంగ వ్యతిరేకంగా ఉన్నందునే రాజీనామా చేశామని పేర్కొన్న కౌర్...శిరోమణి అకాలీదళ్ ఇప్పటికీ ఎన్డీయే భాగస్వామ్య పక్షమేనని ప్రకటించడం ద్వారా కేంద్రంతో సంబంధాలు పూర్తిగా తెగకుండా జాగ్రత్త పడ్డారనే భావించాల్సి వచ్చింది.

రాష్ట్రంలో రెండు దఫాలు అధికారంలో ఉన్న శిరోమణి అకాలీ దళ్   కేంద్రంతో సత్సంబంధాలనూ, రైతుల మద్దతునూ కాపాడుకోవాలన్న ప్రయత్నాలలో భాగమే కౌర్ రాజీనామా...ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా కొనసాగింపు అని భావించాల్సి ఉంటుంది. మొత్తం మీద అకాలీదళ్ పరిస్థితి ముందు గొయ్యి వెనుక నుయ్యిలా తయారైంది.  అటు ఎన్డీయేలో కొనసాగి రైతుల ఆగ్రహానికి గురై రాజకీయ అస్ధిత్వాన్ని ఫణంగా పెట్టలేక..ఇటు తెగదెంపులు చేసుకుని రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కూడా అధికార పక్షాలకు వ్యతిరేకంగా మనలేక సతమతమౌతున్నది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   13 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   9 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   11 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   16 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   18 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   19 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle