newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ముందుకు సాగని ‘మహా’ ప్రయత్నాలు .. శివసేన మొండిపట్టు

29-10-201929-10-2019 08:36:40 IST
2019-10-29T03:06:40.006Z29-10-2019 2019-10-29T03:06:33.189Z - - 11-04-2021

ముందుకు సాగని ‘మహా’ ప్రయత్నాలు .. శివసేన మొండిపట్టు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. మరి మహా రాష్ట్ర సంగతేంటి? బీజేపీ-శివసేన మధ్య ఇంకా చర్చలు కొలిక్కిరాలేదు. దీంతో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే వుంది. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి సంపూర్ణ మెజారిటీ సాధించింది. కానీ సీఎం పదవి విషయంలో రెండుపార్టీల మధ్య అవగాహన రాలేదు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ గవర్నర్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ జరిగిందని తెలుస్తోంది. శివసేన తరఫున సీనియర్‌ నాయకులు దివాకర్‌ రౌటే కూడా గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కొష్యారీతో వేరేగా భేటీ కావడంతో రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ, శివసేన మధ్య అధికారం సగం సగం అధికారం పంచుకోవడంలో పీటముడి ఇంకా వీడలేదు. మెజారిటీకి దగ్గరగా బీజేపీ ఆగిపోవడంతో శివసేన డిమాండ్లను ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. 

బీజేపీ బాస్, హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగితే తప్ప ఈ సస్పెన్స్ వీడేలా కనిపించడం లేదు. దీంతో బుధవారం ముంబైకి అమిత్‌ షా రానున్నారు. రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారాన్ని సమంగా పంచుకోవాలనే శివసేన డిమాండ్‌కు బీజేపీ ఎంతవరకు అంగీకరిస్తుందనేది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. బీజేపీ ఒత్తిడితో  శివసేన అధికార పీఠాన్ని వదిలేస్తుందా? అనేది బీజేపీ-శివసేన నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అధికారం పంచుకోవడం తప్పదని శివసేన నేత సంజయ్ రావత్ పట్టుబడుతున్నారు.

సీఎం పీఠంపై కన్నేసిన శివసేన నేతలు ఆదిత్య థాకరేను తెరమీదకు తెస్తున్నారు. ఈసారి ఐదేళ్ళు బీజేపీకి అవకాశం ఇవ్వడం కుదరదని తెగేసి చెబుతున్నారు. శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రావత్‌ తాజాగా సీఎం పీఠంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని అన్నారు. ఎన్నికల అనంతరం శివసేన -కాంగ్రెస్‌ కూటమితో కలిసి అధికారాన్ని పంచుకోవచ్చునని ఊహాగానాలు గుప్పుమన్నాయి. ఈ ఊహాగానాలను కొట్టిపారేశారు శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రావత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  గతంలో మాదిరిగా ఈసారి సీఎం పదవిని పూర్తిగా బీజేపీకి ఇవ్వడం కుదరదన్నారు. 

శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే, పార్టీ నేత సంజయ్‌ రౌత్‌ 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ-శివసేన మధ్య జరిగిన అవగాహనను గుర్తుచేస్తున్నారు. అధికారాన్ని చెరి సగం పంచుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు.  కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత రామ్‌దాస్ అథావలే చేసిన కామెంట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

అధికారాన్ని చెరి రెండున్నరేళ్లు పాలించాలనే ఫార్ములాను బీజేపీ ఒప్పుకోకపోవచ్చని ఆయన అన్నారు. దీంతో ముఖ్యమంత్రిగా బీజేపీ వ్యక్తే ఉంటారనే విషయంలో ఎలాంటి రాజీ లేదనే సంకేతాలు మాత్రం ఇస్తోంది.

తమ మిత్రపక్షంగా శివసేన సంకీర్ణ ధర్మం పాటించాలని, ప్రభుత్వంలో చేరి ఆదిత్య ఠాక్రే కు డిప్యూటీ సీఎం పదవిని తీసుకుని ...సీఎం ఫడ్నవిస్‌ వద్ద రాజకీయాలు నేర్చుకోవాలంటోంది. అథవాలే కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. ఆదిత్య థాకరేను డిప్యూటీ సీఎం చేయాలని, శివసేన దీన్ని అంగీకరించాలని  సలహా ఇచ్చారు. ఆదిత్య థాకరేను ఐదేళ్ల పాటు డిప్యూటీ సీఎంగా కొనసాగించాలని కూడా ఆయన సూచించారు. అమిత్ షా వచ్చి ఏం చక్కబెడతారోనని అంతా ఎదురుచూస్తున్నారు. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   14 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   10 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   12 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   17 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   19 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   20 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle