newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ముంచుకొస్తున్న కోవిడ్ 19 ముప్పు.. కేంద్రం ముందుజాగ్రత్తలు

04-03-202004-03-2020 15:36:31 IST
2020-03-04T10:06:31.494Z04-03-2020 2020-03-04T10:06:28.675Z - - 20-04-2021

ముంచుకొస్తున్న కోవిడ్ 19 ముప్పు.. కేంద్రం ముందుజాగ్రత్తలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా కోవిడ్ 19 ముప్పు ముంచుకొస్తోందా? సాఫ్ట్ వేర్ సంస్థలు వణికిపోతున్నాయా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ లోని వివిధ సాఫ్ట్ వేర్ సంస్థలు, హైటెక్ సమీపంలోని మైండ్ స్పేస్, రహేజా పార్కు వంటి ప్రాంతాల్లో కరోనా భయం కనిపిస్తోంది. తాజాగా కోవిడ్ 19 కేసులకు సంబంధించి కేంద్రం ప్రకటన చేసింది. భారత్‌లో ఇప్పటివరకు 28 మందికి కోవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ అయిందని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు. 

దేశ రాజధాని ఢిల్లీలోని అన్ని ఆస్పత్రుల్లో కరోనా అనుమానితుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయనున్నారు. ‘ఢిల్లీలో ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అతడి కారణంగా ఆగ్రాలో ఉన్న అతడి కుటుంబ సభ్యులు ఆరుగురికి వైరస్‌ సోకింది. దేశంలో పర్యటిస్తున్న 21 మంది ఇటలీ జాతీయుల్లో 16 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. వారిని చావ్లాలో ఉన్న ఇండో- టిబెటన్‌ బోర్డర్‌ పోలీసు క్వారంటైన్‌కు తరలించాం’’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.  ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన 5,89,000 వేల మందికి ఎయిర్‌పోర్టుల్లో స్క్రీనింగ్‌ నిర్వహించారు.

దేశంలోని వివిధ ఎయిర్ పోర్టుల్లో ఇతర దేశాల నుంచి వచ్చే ప్రతీ ఒక్కరికి స్క్రీనింగ్‌ తప్పనిసరి చేసింది కేంద్రం. డిమాండ్ నేపథ్యంలో మాస్కుల ధర పెంచితే కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సాఫ్ట్ వేర్ సంస్థ వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాయి. ఢిల్లీ -1, తెలంగాణ- 1, ఆగ్రా- 6 కేసులు, కేరళ- 3, 16 మంది ఇటాలియన్‌ టూరిస్టులతో పాటు డ్రైవర్ కు కోవిడ్ 19 వైరస్ వ్యాపించినట్టు కేంద్రం గుర్తించింది.

ఇటు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న అనుమానితుడిని వైద్యులతో కలిసి బుధవారం ఉదయం కలెక్టర్‌ పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉంది.  కోవిడ్‌-19పై ప్రజలు ఆందోళ చెందాల్సిన అవసరం లేదన్నారు. 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   12 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   12 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   16 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   18 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   13 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   20 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   20 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   13 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   15 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle