newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మీ పనైపోయింది మమతాజీ.. 370ని వ్యతిరేకించడంపై జేపీ నడ్డా

28-09-201928-09-2019 10:38:12 IST
2019-09-28T05:08:12.128Z28-09-2019 2019-09-28T05:08:09.380Z - - 14-04-2021

మీ పనైపోయింది మమతాజీ.. 370ని వ్యతిరేకించడంపై జేపీ నడ్డా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కథ ముగిసిపోయిందని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా స్పష్టం చేశారు. కశ్మీర్‌కి స్వయం ప్రతిపత్తిని రద్దు చేసిన ఆర్టికల్ 370 తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమతకు జాతికంటే అధికారమే ముఖ్యమైపోయినట్లుందని ధ్వజమెత్తారు.

ఆర్టికల్ 370పై కలకత్తాలో జరిగిన ఒక సెమినార్ని ఉద్దేశించి ప్రసంగించిన బీజేపీ నేత.. జాతికి హితం కలిగించే కీలకమైన అంశాలపై మమతా బెనర్జీ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. కశ్మీర్‌కి స్వయం ప్రతిపత్తిని కలిగిస్తున్న ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా మొదట పోరాడింది శ్యామా ప్రసాద్ ముఖర్జీయేనని, పశ్చిమ బెంగాల్‌కి చెందిన ఈ గొప్ప వ్యక్తి మాకు స్ఫూర్తి కలిగిస్తూ వచ్చారని నడ్డా చెప్పారు.  ఆయన కలల్ని సాకారం చేసిన తర్వాతే మేం పశ్చిమబెంగాల్‌కి ఇవ్వాళ వచ్చామని నడ్డా చెప్పారు.

ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని లేకుండా చేశారంటూ జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, మెహబూబా వంటి వారు ప్రజలను పెడతోవ పట్టిస్తున్నారని నడ్డా చెప్పారు. ఇది దేశాన్ని పూర్తిగా తప్పుదోప పట్టించడమేనని, వాస్తవానికి ఆర్టికల 370 స్వయంప్రతిపత్తిని ఎన్నడూ ఇవ్వలేదని, అది తాత్కాలిక నిబంధనేనని చెప్పారు. ఆర్టికల్ 370 అనేది జమ్ము కశ్మీర్‌లో భారత రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడమేని విలీనం చేసుకునే క్రమంలో జమ్మూ కశ్మీర్‌ను భారతదేశంలో ఒక రాష్ట్రంగా పేర్కొన్నారని ఆయన చెప్పారు.

''పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం పని అయిపోయిందన్నదే ప్రజాభిప్రాయం. పశ్చిమ బెంగాల్‍‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యం. దేశం గొప్పదా లేక ఓటు బ్యాంకు రాజకీయాలు గొప్పవా అని నేను మమతను ప్రశ్నిస్తున్నాను. దేశ ప్రయోజనాల కంటే అధికారమే ముఖ్యమా అని ఆమె తేల్చుకోవాలి. దేశ సమగ్రతకు వీలు కల్పిస్తున్న చర్యలను ఆమె ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దేశం బలంగా ఉండి సమైక్యమవుతున్నప్పుడు, అల్పమనస్కులు అధికారంలో ఉండాలా లేక వైదొలగాలా అన్నది ప్రజలే నిర్ణయించాల''ని జేపీ నడ్డా పేర్కొన్నారు.

"ఒక విషయం చెబుతున్నాను. ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు నిచ్చే అవకాశాన్ని ఆమె కోల్పోయారు. కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత చర్చద్వారా యావద్దేశం భారత రాజ్యాంగ పరిధిలోకి వచ్చేసింద''ని బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్పష్టం చేశారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle