newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

మీనాక్షి లేఖి విజ‌యం నల్లేరుమీద బండినడకేనా?

10-05-201910-05-2019 08:00:04 IST
Updated On 29-06-2019 12:33:50 ISTUpdated On 29-06-20192019-05-10T02:30:04.361Z10-05-2019 2019-05-10T02:26:16.542Z - 2019-06-29T07:03:50.753Z - 29-06-2019

మీనాక్షి లేఖి విజ‌యం నల్లేరుమీద బండినడకేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యూఢిల్లీ పార్ల‌మెంట్ సీటు నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ మీనాక్షి లేఖి విజ‌యం దాదాపు ఖ‌రారు అయింద‌ట‌. ఎందుకంటే, ఆమె ప్ర‌త్య‌ర్థులు ఆశించిన స్థాయిలో ప్ర‌చారం చేయ‌క‌పోవ‌డం, స‌మ‌స్య‌లను ప్ర‌స్తావించ‌క‌పోవ‌డమే కూడా మీనాక్షి విజ‌యానికి కార‌ణం అవుతున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఈ సీటు నుంచి భారీ మెజార్టీతో గెలిచారు మీనాక్షి లేఖి. పార్లమెంటులో కూడా ప‌లు అంశాల్లో విప‌క్షాలను త‌న‌దైన శైలిలో ఏకి పారేశారు. 

ఈ ఎన్నిక‌ల్లో ఆమె మీద కాంగ్రెస్ అభ్య‌ర్థిగా అజ‌య్ మాకెన్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బ్రిజేష్ గోయ‌ల్ పోటీలో ఉన్నారు. 2004, 2009 ఎన్నిక‌ల్లో ఈ సీటు నుంచి గెలిచారు అజ‌య్ మాకెన్. మ‌రో విష‌యం ఏంటంటే, ఈ సీటు నుంచి మీనాక్షి లేఖిని బ‌రిలో దింప‌డం స్థానికి బీజేపీ నేత‌ల‌కు ఏమాత్రం ఇష్టం లేద‌ట‌. కానీ అమిత్ షా గ‌ట్టిగా వార్నింగ్ ఇవ్వ‌డంతో ఆమె త‌ర‌పున ప్ర‌చారం చేస్తున్నార‌ట‌. అంటే ఇది అజ‌య్ మాకెన్ కు ప్ల‌స్ పాయింట్. కానీ ఆయ‌న ప‌రిస్థితి ఇంత‌కంటే ఘోరంగా మారిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 

ఎందుకంటే, రెండుసార్లు ఎంపీగా ఉన్న స‌మ‌యంలో అజ‌య్ మాకెన్ త‌మ‌ను ఏమాత్రం ప‌ట్టించుకోలేద‌ని స్థానిక కాంగ్రెస్ నేత‌లు ఆయ‌న మీద గుర్రుగా ఉన్నార‌ట‌. వారిని దారిలోకి తేవ‌డంలో కాంగ్రెస్ పెద్ద‌లు విఫ‌లం అయ్యార‌ట‌. దీంతో ఆయ‌న ప్ర‌చారం కంటే, పార్టీ నేత‌ల‌ను బుజ్జ‌గించ‌డానికే స‌మ‌యం కేటాయించార‌ట‌. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ విష‌యానికొస్తే, ఆ పార్టీ నుంచి బ‌రిలో దిగిన బ్రిజేష్ గోయ‌ల్, ఆటో మొబైల్ స్పేర్ పార్టులు అమ్ముకునే వ్యాపారి. 

చాలా మందికి ఆయ‌న ఎవ‌రో తెలీద‌ట‌. కేవ‌లం కేజ్రీవాల్ పేరుతోనే ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయ‌డం ఆయ‌న‌కు మైన‌స్ పాయింట్లు అవుతున్నాయ‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక న్యూఢిల్లీ పార్ల‌మెంట్ సీటులో ప్ర‌ధాన ఓటర్లు అయిన‌, వ్యాపార వ‌ర్గం మీనాక్షి లేఖి వైపే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ మొత్తం బేరీజు వేసుకుంటే ఈ ఎన్నిక‌ల్లో కూడా మీనాక్షి లేఖి విజ‌యం ఖాయ‌మ‌ని బీజేపీ నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నార‌ట‌.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle