మీనాక్షి లేఖికి బంపర్ మెజారిటీ ఖాయమా?
21-05-201921-05-2019 07:15:56 IST
Updated On 27-06-2019 13:42:31 ISTUpdated On 27-06-20192019-05-21T01:45:56.536Z21-05-2019 2019-05-21T01:45:36.195Z - 2019-06-27T08:12:31.828Z - 27-06-2019

ఎంతో రాజకీయ నేపథ్యం ఉన్న న్యూఢిల్లీ పార్లమెంట్ సీటు నుంచి ఈసారి కూడా సిట్టింగ్ ఎంపీ మీనాక్షి లేఖి విజయం ఖాయమట. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగిన మీనాక్షి లేఖి, తన ప్రత్యర్థి ఆశిష్ ఖేతాన్ మీద 1,52,708 ఓట్లతో గెలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి లక్షా 82 వేల ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. 2004, 2009 పార్లమెంటరీ ఎన్నికల్లో ఈ సీటు నుంచి గెలిచిన అజయ్ మాకెన్, ఈసారి కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బ్రిజేష్ గోయల్ పోటీ చేశారు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మీద విమర్శలు గుప్పించారు. అటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా మీనాక్షి లేఖి మీద ఆరోపణలు చేశారు. న్యూఢిల్లీ పార్లమెంట్ సీటు పరిధిలో ఆమె ఏ పనులూ చేయలేదన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అజయ్ మాకెన్ కూడా తన ప్రచారంలో ఊదరగొట్టారు. అయితే 2004 నుంచి 2014 దాకా అంటే ఆ పదేళ్ల కాలంలో న్యూఢిల్లీ ఎంపీ సీటు పరిధిలో అజయ్ మాకెన్ ఏం చేశారని ప్రశ్నించారు మీనాక్షి లేఖి. ఇక దాదాపు 32 కోట్ల రూపాయల ఎంపీ నిధులతో న్యూఢిల్లీ ఎంపీ సీటు పరిధిలో మీనాక్షి లేఖి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారట. స్వచ్చ భారత్ అభియాన్ పథకంతో పాటు, యువతకు స్కిల్ ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు, టెలీకం నెట్ వర్క్ విస్తరణ వంటి పలు అభివృద్ధి పనులు చేయడంలో ఆమె విజయం సాధించినట్లు స్థానిక మీడియాలో వచ్చిన వార్తలు మీనాక్షి లేఖికి ప్లస్ పాయింట్ అయ్యాయి. అంతేకాదు, న్యూఢిల్లీ, ఢిల్లీ క్యాంటిన్, సరాయ్ రొహిల్లా రైల్వే స్టేషన్ల అభివృద్ధి, ఈ మూడు స్టేషన్ల మధ్య ఎక్కువగా లింక్ రైళ్లను ఏర్పాటు చేసి, ఉద్యోగుల ఇబ్బందులు తొలగించి, ప్రయాణ కాలాన్ని తగ్గించారని కూడా చాలా మంది చెబుతున్నమాట. అంతేకాదు, జాతీయవాదం, దేశభద్రత, అభివృద్ది వేరన్న కాంగ్రెస్, ఆప్ ప్రచారాన్ని చాలా మంది తిరస్కరించారట. జాతీయవాదం, దేశభద్రత లేకుండా అభివృద్ధి ఎలా జరుగుతుందన్న మీనాక్షి లేఖి ప్రచారానికి చాలా మంది ఆకర్షితులు అయ్యారని తేలింది. ఇక ఎగ్జిట్ పోల్స్ కూడా మీనాక్షి లేఖి విజయం ఖాయమని తేల్చాయి. బంపర్ మెజార్టీ వచ్చే అవకాశం ఉన్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి.

ఏపీలో స్కూల్స్ బంద్
14 hours ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
13 hours ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
18 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
19 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
15 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
21 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
a day ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
14 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
16 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
a day ago
ఇంకా