newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మారటోరియం మరో మూడునెలలు .. ఆర్బీఐ కీలక నిర్ఱయం

05-05-202005-05-2020 11:08:17 IST
Updated On 05-05-2020 12:15:00 ISTUpdated On 05-05-20202020-05-05T05:38:17.179Z05-05-2020 2020-05-05T05:37:59.206Z - 2020-05-05T06:45:00.878Z - 05-05-2020

మారటోరియం మరో మూడునెలలు .. ఆర్బీఐ కీలక నిర్ఱయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశ ఆర్థికవ్యవస్థను అతలాకుతలం చేసింది కరోనా వైరస్. చిన్న, మధ్యతరగతి, పేద కుటుంబాల జీవితాలు ఛిద్రం అయిపోయాయి. చేతిలో డబ్బుల్లేవ్. చేసిన పనికి సగం జీతం. కొందరికి పనిలేదు. స్టే హోం స్టే సేఫ్ అంటూ ఇంట్లోనే బందీలుగా మారారు జనం. ఆకలితో అలమటించేవారు మరికొందరు. దీంతో లోన్లు తీసుకుని కట్టలేనివారికి కేంద్రం ఒక అవకాశం ఇచ్చింది. మూడునెలల పాటు మారటోరియం విధించింది. 

లాక్ డౌన్ మరోసారి పొడిగించిన నేపథ్యంలో రుణాల వాయిదాలపై విధించిన మారటోరియంను కూడా మరో 3 నెలలు పొడిగించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) భావిస్తున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ కొనసాగింపు కారణంగా ఇటు వ్యక్తులు, అటు సంస్థలకు ఆదాయాలొచ్చే మార్గాలు లేనందున మారటోరియంను పొడిగించాలంటూ ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ సహా వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో ఆ విఙ్ఞప్తులపై ఆర్‌బీఐ పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

లాక్‌డౌన్‌ మొదలైన సమయంలో మూడు నెలల పాటు వాయిదాల చెల్లింపులపై మారటోరియం విధిస్తూ మార్చి 27న ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. దీని గడువు ఈ నెల31తో ముగియనుంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో మారటోరియంను పొడిగించడమే మంచిదని బ్యాంకింగ్, ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మార్చి, ఏప్రిల్‌, మే నెలల ఈఎంఐలపై మారటోరియం తీసుకునే వీలును రుణగ్రహీతలకు కల్పించాలని బ్యాంకింగ్‌, బ్యాంకింగ్ ఇతర సంస్థలకు ఆర్బీఐ సూచించింది. 

కష్టకాలంలో ఇటు రుణగ్రహీతలకు, అటు బ్యాంకులకు ఇది ఊరట ఇవ్వగలదని అంటున్నారు. అయితే మారటోరియం వల్ల మనకు తాత్కాలిక ఉపశమనమే కానీ భవిష్యత్తులో అంతా కట్టాల్సిందే. పైగా వడ్డీలతో సహా. ఇది కేవలం మారటోరియం మాత్రమే. ఈ మూడు నెలల గడువు తర్వాత ఈఎంఐలను చెల్లించాలి. ఇది కేవలం తాత్కాలిక నిలుపుదల మాత్రమే.

మన డబ్బును మనమే చెల్లించాలి. మన ఈఎంఐ భారం కానీ, వడ్డీ కానీ, ప్రిన్సిపుల్ కానీ ఏ మాత్రం తగ్గదు. అది యధావిధిగా ఉంటుంది. మారిటోరియాన్నీ మరో మూడు నెలలు పొడిగించాలనే డిమాండ్‌ సర్వత్రా వినిపిస్తోంది. ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) ఇప్పటికే ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. మారటోరియం పెంచితే జూన్‌, జూలై, ఆగస్టు నెలల ఈఎంఐలను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మొత్తాలను బ్యాంకులు తర్వాత వసూలు చేసుకుంటాయి.దీంతో ఆరునెలల ఈఎంఐలు పెరుగుతాయి. వీటికి వడ్డీలు అదనం. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   12 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   9 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   11 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   15 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   18 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   19 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle