newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మాయావతి, అఖిలేష్‌ హయాంలో భారీ స్కాం... !

30-06-201930-06-2019 09:52:35 IST
Updated On 03-07-2019 13:02:00 ISTUpdated On 03-07-20192019-06-30T04:22:35.185Z30-06-2019 2019-06-30T04:22:16.704Z - 2019-07-03T07:32:00.045Z - 03-07-2019

మాయావతి, అఖిలేష్‌ హయాంలో భారీ స్కాం... !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాయావ‌తి, అఖిలేష్ హ‌యాంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కో ఆప‌రేటివ్ బ్యాంకుల్లో భారీగా కుంభ‌కోణం జ‌రిగిన‌ట్లు తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. యూపీలోని మొత్తం 50 కో ఆప‌రేటివ్ బ్యాంకుల్లో 40 బ్యాంకుల్లో భారీగా న‌గ‌దు తారుమారు అయిన‌ట్లు తేలింది.

నకిలీ ధృవ‌ప‌త్రాలతో రుణాలు ఇవ్వ‌డం, త‌ప్పుడు లెక్క‌లు చూపించి ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో న‌గ‌దు నొక్కేసిన సంఘ‌ట‌న‌లు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయ‌ట‌. 

‌‌ఈ కుంభ‌కో‌ణంలో కొంద‌రు బ్యాంక్ అధికారుల చేతివాటం కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మురాదాబాద్ జిల్లాలోని 46 బ్యాంకులు అవినీతి అడ్డాగా మారాయ‌ట‌. అలీఘ‌డ్ జిల్లా స‌హ‌కారీ బ్యాంక్ 19 బ్రాంచీల్లో బినామీ పేర్ల‌తో 9 కోట్ల 50 ల‌క్ష‌ల రూపాయ‌లు అప్పులు ఇచ్చిన‌ట్లు అధికారులు గుర్తించారు.

ఇప్ప‌టికే 157 సేవింగ్ ఖాతాల‌ను అధికారులు సీజ్ చేసిన‌ట్లు తెలుస్తోంది.  మాయావ‌తి యూపీ సీఎంగా ఉన్నప్పుడు అంటే 2011లో ఈ బ్యాంకుల కుంభ‌కోణం మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. 

2010 నుంచీ 2015 దాకా 1961 మంది రైతుల‌కు త‌ప్పుడు ప‌త్రాల‌తో కో ఆప‌రేటివ్ బ్యాంకులు రుణాలు ఇచ్చాయ‌ట‌. కొంద‌రు అధికారులు క‌మీష‌న్ల‌కు ఆశ‌ప‌డి ఈ రుణాలు ఇచ్చిన‌ట్లు తేలింది. ఈ ఏడాది మే 7వ తేదీన కో ఆప‌రేటివ్ బ్యాంకుల కుభ‌కోణం మీద యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ఓ క‌మిటీ వేయ‌డంతో ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఫ‌తేపూర్ జిల్లా కో ఆప‌రేటివ్ బ్యాంక్ 25 శాఖ‌ల్లోని 6 శాఖ‌ల్లో 84 కోట్ల రూపాయ‌ల అవినీతి జ‌రిగింద‌ట‌. 

అలాగే బిజ‌నూర్ జిల్లా స‌హ‌కారీ బ్యాంక్ 42 శాఖ‌ల్లో 10 శాఖ‌ల్లో భారీగా అవినీతి జ‌రిగింద‌ట‌. వీటితో పాటు ఆగ్రా జిల్లా కో ఆప‌రేటివ్ బ్యాంక్, అలహాబాద్ జిల్లా కో ఆప‌రేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బాందా జిల్లా కో ఆప‌రేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ఫైజాబాద్ జిల్లా కో ఆప‌రేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కాన్పూర్ స‌హ‌కారీ బ్యాండ్ లిమిటెడ్ అవినీతి జ‌రిగిన‌ట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర కో ఆప‌రేటివ్ బ్యాంక్ లిమిటెడ్ శాఖ‌ల్లో కూడా భారీగా న‌గ‌దు త‌ప్పుదారి పట్టింద‌ట‌. 

అలాగే అల‌హాబాద్ గ్రామీణ బ్యాంక్, యూపీ గ్రామీణ బ్యాంక్, గ్రామీణ బ్యాంక్ ఆఫ్ ఆర్వావ‌త్, కాశి- గోమ‌తి సంయుత్ గ్రామీణ బ్యాంక్, పార్థం బ్యాంక్, పూర్వాంచ‌ల్ బ్యాంక్, స‌ర్వ యూపీ గ్రామీణ్ బ్యాంక్ అవినీతి, త‌ప్పుడు ప‌త్రాల‌తో రుణాలు ఇచ్చిన‌ట్లు తేలింది. ఈ ర‌కంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా 275 గ్రామీణ బ్యాంకుల్లో కుంభ‌కోణం జ‌రిగిన‌ట్లు అధికారులు చెబుతున్నారు.

రైతుల‌కు ఆర్థిక సాయం చేసే నేష‌న‌ల్ బ్యాంక్ ఫ‌ర్ అగ్రిక‌ల్చ‌ర్ డెవ‌ల్మెంట్ సంస్థ‌లో కూడా త‌ప్పుడు ప‌త్రాల‌తో రుణాలు తీసుకున్న‌ట్లు తేలింద‌నీ, ఈ విష‌యాన్ని నాబార్డ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ జీ.జీ. మెమ‌న్ ముంగిట నివేదిక స‌మ‌ర్పించిన‌ట్లు యూపీ కో ఆప‌రేటివ్ డిపార్ట్ మెంట్ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఎం.వీ.ఎస్. రామిరెడ్డి చెబుతున్నారు.

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   14 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   13 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   18 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   19 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   15 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   a day ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   a day ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   14 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   16 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   a day ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle