newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

మాయావతికి ఐటీ షాక్.. రూ 400 కోట్ల బినామీ ప్లాట్ సీజ్

19-07-201919-07-2019 10:02:51 IST
Updated On 19-07-2019 15:22:24 ISTUpdated On 19-07-20192019-07-19T04:32:51.783Z19-07-2019 2019-07-19T04:32:43.297Z - 2019-07-19T09:52:24.423Z - 19-07-2019

మాయావతికి ఐటీ  షాక్.. రూ 400 కోట్ల బినామీ ప్లాట్ సీజ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐటీ శాఖ బీఎస్పీ అధినేత్రి మాయావతికి షాక్ ఇచ్చింది. మాయావతి సోదరుడికి చెందిన రూ.400 కోట్ల విలువైన ప్లాట్‌ను ఆదాయపన్ను శాఖ(ఐటీ) అటాచ్‌ చేసింది. బినామీ నిరోధక చట్టాన్ని కేంద్రం వీరిపై ప్రయోగించింది.

దేశ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌)లోని నొయిడాలో ఏడెకరాల్లో బినామీ పేరుతో ఉన్న ఈ స్థలం అసలు యజమాని మాయా సోదరుడు ఆనంద్‌ కుమార్, అతని భార్యకు చెందినట్లుగా ఐటీ భావిస్తోంది. ఇటీవల బీఎస్‌పీ జాతీయ ఉపాధ్యక్షుడిగా మాయావతి తన సోదరుడు ఆనంద్ కుమార్ ని నియమించారు. దీనిపై స్వంత పార్టీనుంచే విమర్శలు వచ్చాయి.

ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఐటీ శాఖకు చెందిన బినామీ ప్రొహిబిషన్‌ యూనిట్‌ ఈ మేరకు అటాచ్‌మెంట్‌ ఉత్తర్వులు వెలువరించింది. నోయిడాలోని సెక్టర్‌ 94లో 28వేలకు పైగా చదరపు మీటర్లు అంటే సుమారు ఏడెకరాల వాణిజ్య భూమిలో ఫైవ్‌స్టార్‌ హోటల్, ఇతర నిర్మాణాలు చేపట్టాలని ఆనంద్‌కుమార్, అతని భార్య విచితర్‌ లత ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ భూమి వేరేవారి పేరుపై ఉంది. మార్కెట్లో రూ.400 కోట్ల వరకు విలువ కలిగి ఉంది. 

ఈ భూమి కొనుగోలుపై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆరు బినామీ కంపెనీలను సృష్టించి వాటి ద్వారా అక్రమ సంపాదనను హవాలా మార్గంలో మళ్లించినట్లు ఐటీ విభాగం అనుమానిస్తోంది. బినామీ చట్టం–1988ని మోదీ ప్రభుత్వం 2016 నుంచి అమలు చేస్తోంది.

ఈ చట్టం కింద దోషిగా తేలిన వారికి కనీసం ఏడేళ్ల జైలు శిక్షతోపాటు సదరు ఆస్తి మార్కెట్‌ విలువలో 25 శాతం మేర జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. దేశంలో బినామీ ప్రొహిబిషన్‌ చట్టం అమలు అధికారం ఐటీ విభాగానికి ఉంది.  ఈచట్టాన్ని కఠినంగా అమలుచేయాలని కేంద్రం నిర్ఱయించిన సంగతి తెలిసిందే. ఐటీ షాక్ కి మాయావతికి పెద్ద షాక్ అని భావిస్తున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle