newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మాయదారి మిడతలు.. లక్ష ఎకరాల పంట హంఫట్!

28-05-202028-05-2020 07:59:49 IST
Updated On 28-05-2020 09:23:09 ISTUpdated On 28-05-20202020-05-28T02:29:49.589Z28-05-2020 2020-05-28T02:29:28.362Z - 2020-05-28T03:53:09.566Z - 28-05-2020

మాయదారి మిడతలు.. లక్ష ఎకరాల పంట హంఫట్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో రైతు ఆరుగాలం శ్రమించి, రాత్రి.. పగలు తేడాలేకుండా పండించిన పంటకు వంద చిక్కులు అడ్డంకిగా మారుతున్నాయి. భూమిలో విత్తనం వేసిన దగ్గర నుండి ఇప్పుడు ఏదైనా ఖర్చుతో కూడుకున్న పనే. రైతు చుట్టూనే కోట్ల వ్యాపారం జరుగుతున్నా ఆ రైతుకు మాత్రం పండిన పంట అమ్ముకొనే వరకు ఋణం ఎంతో ఆ దేవుడికి కూడా తెలియదంటే అతిశయోక్తి కాదేమో. అన్నీ కలిసొచ్చి పంట అమ్మినా వందకు తొంబై శాతం రైతులకు మిగిలేది నష్టాలే.

ప్రభుత్వాలు రైతులను ఆదుకుంటామని దశాబ్దాలుగా చెప్తున్నా.. మరొకొన్ని దశాబ్దాలుగా ఇదే మాట చెప్తూనే ఉంటారని కూడా దేశంలో ప్రజలకు తెలిసిందే. అదీ మన దేశంలో వ్యవసాయం పరిస్థితి. అసలే అరకొర దిగుబడులతో నెట్టుకొస్తున్న మన దేశ రైతుల పాలిట కరోనా మహమ్మారి లాక్ డౌన్ శాపంగా మారి సంక్షోభంలో పడితే ఇప్పుడు ఇది చాలదన్నట్లుగా మిడతల దండు ఒకటి గుదిబండగా మారుతుందని ఆందోళనను వినిపిస్తున్నాయి.

ఈ మిడతల దండు గురించి.. అవి సృష్టించే అరాచకాల గురించి.. ఒక్కసారి వాటి భారిన పడితే పంట పొలం నామరూపాల్లేకుండా పోతుందని.. చాలా ఏళ్ళుగా వింటున్నాం. గతంలో రాజస్తాన్‌, గుజరాత్‌, పంజాబ్, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రలోని కొన్నిప్రాంతాల్లో ఈ మిడతల దండు ప్రవేశించినట్లు తెలుస్తున్నా.. 1974 అనంతరం వీటి దాడి గురించి పెద్దగా ఎక్కడా వినిపించలేదు.

అయితే, గత ఏడాది మన శత్రుదేశమైన పాకిస్థాన్ నుండి రాజస్థాన్ లోకి అడుగుపెట్టినట్లుగా అప్పుడే దుమారం రేగింది. ఇక ఈ ఏడాది ఈ దండు అంతటితో ఆగకుండా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లోకి కూడా ప్రవేశించాయి. మహారాష్ట్రతో సరిహద్దు రాష్ట్రమైన తెలంగాణ, అక్కడ నుండి ఆంధ్రా భూభాగంలోకి కూడా ఈ ఏడాది ప్రవేశించే అవకాశం ఉందని ఇక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఈ మిడతల దండు ఒక్క రోజులో 35 వేల మందికి సరిపోయే ఆహార ధాన్యాలను స్వాహా చేస్తోందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎఒ) వెల్లడించింది. ఇప్పటికే పాకిస్తాన్‌, తూర్పు ఆఫ్రికాల నుండి వచ్చిన మిడతల దండుతో సుమారు లక్ష ఎకరాలలోని కాటన్‌, వేసవిలో వేసే ధాన్యాలు, కూరగాయలను నాశనం చేస్తున్నాయని వ్యవసాయ పరిశోధనా సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ త్రిలోచన్‌ మొహాపాత్ర తెలిపారు.

ఇప్పటికే ఆయా రాష్ట్రాలలో 700 ట్రాక్టర్లు, 75 ఫైర్‌ ఇంజన్‌లు , మరో 50 వాహనాలతో మందులు స్ప్రే చేస్తున్నామని, డ్రోన్‌లను కూడా వినియోగిస్తున్నట్లు త్రిలోచన్‌ చెప్పారు. ముఖ్యంగా రాజస్తాన్‌లో వీటి ప్రభావం అధికంగా ఉందని పేర్కొన్నారు. ఒక్క మందుల స్ప్రే చేయడంతో పాటు వీటిని ఎదుర్కొనేందుకు మరేదైనా మార్గాలను కూడా అన్వేషిస్తున్నామని ఆయన తెలిపారు.

కాగా, ఇప్పటికే ఈ మిడతలు ఆవహించిన రాష్ట్రాలలో రైతులు వీటిని చూస్తేనే వణికిపోతున్నారు. ఇవి పంటలను నాశనం చేయడంతో పాటు ఇవి వస్తున్నాయంటే ముందుగానే వచ్చే శబ్దం రైతుల గుండెలు ఆగేలా చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అధికమైన పెట్టుబడులకు తోడు వీటిని ఎదుర్కొనేందుకు మందులు, ఇతర వస్తువుల కొనుగోలు కూడా తమకి భారమవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

కాగా, ఈ మిడతల దండు దాడి వెనుక కారణాలను కూడా కొందరు పర్యావరణ వేత్తలు నిశితంగా దర్యాప్తులు మొదలుపెడుతున్నారు. గతంలో 1974కి ముందే ఈ మిడతలు పంటల మీద దాడి చేసిన గుర్తులున్నా తరువాత పెద్దగా ప్రభావం చూపలేదని.. అయితే ప్రస్తుతం రేడియేషన్ ప్రభావంతో వాటిని ఆహారంగా తీసుకొనే కొన్ని పక్షులు కనుమరుగవడంతో మళ్ళీ వాటి విజృంభణ కొనసాగుతుందని కొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా రైతు మాత్రం వీటి మూలంగా భారీ మూల్యాన్ని చెల్లించే పరిస్థితి నెలకొంది.

 

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   11 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   15 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   12 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   14 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   19 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   18 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   21 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   17 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle