newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మాఫియాతో సీఎం కుమారుడికి లింక్.. కంగనా సంచలన వ్యాఖ్య

15-09-202015-09-2020 10:14:30 IST
2020-09-15T04:44:30.197Z15-09-2020 2020-09-15T04:44:28.417Z - - 20-04-2021

మాఫియాతో సీఎం కుమారుడికి లింక్.. కంగనా సంచలన వ్యాఖ్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మూవీ మాఫియా, సుశాంత్‌ రాజ్‌పుత్‌ హంతకులు, వారికి చెందిన డ్రగ్‌ రాకెట్‌ ముఠాల గుట్టును తాను బయటపెట్టడం మహారాష్ట్ర సీఎంకు సమస్యగా మారిందని, ఎందుకంటే ఈ మూడింటితో ఆయన కుమారుడు ఆదిత్య చెట్టాపట్టాలేసుకుంటూ తిరుగుతారని కంగన ధ్వజమెత్తారు. ఈ వ్యవహారాలను బయటపెట్టడమే తాను చేసిన అతిపెద్దనేరమని, అందుకే తనపై కక్షగట్టినట్లు శివసేన ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కంగనా తాజా ప్రకటనతో ఆమెకు, అధికార శివసేన పార్టీ మధ్య వివాదం మరింత ముదిరింది. 

మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ చేసిన ట్వీట్‌కు సంబంధించి వచ్చిన పత్రికా కథనంపై స్పందిస్తూ కంగన ఈ ఆరోపణలు చేశారు. వీరి గుట్టు బయటపెట్టినందుకే తనపై కక్షకట్టారని చెబుతూ ‘‘చూద్దాం! ఎవరి ఆట ఎవరు కట్టిస్తారో’’ అని ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. ఒక మహిళను అవమానించి, భయపెట్టి వారి ఇమేజీని వారే పాడుచేసుకుంటున్నారని దుయ్యబట్టారు. జూన్‌లో నటుడు సుశాంత్‌ ఆత్మహత్య తర్వాత నుంచి ఆమె బాలీవుడ్‌ను తీవ్రంగా విమర్శిస్తూవస్తోంది. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, బయట నుంచి వచ్చిన వాళ్ల ఎదుగుదల చూసి ఓర్వలేని సినీ పరిశ్రమ చేసిన ప్రణాళికాయుత హత్యని ఆమె ఆరోపించారు.

సోమవారం కంగన ముంబైని వీడి స్వరాష్ట్రం హిమాచల్‌కు చేరుకున్నారు.‘నిరంతర దాడులు, తన ఆఫీస్‌ కూల్చివేత, చుట్టూ బాడీగార్డుల రక్షణ పెట్టుకోవాల్సిరావడం చూస్తే నేను ముంబైని పీఓకేతో పోల్చడం కరెక్టేననిపిస్తోంది’ అని ట్వీట్‌ చేశారు. అయితే ముంబైని పీఓకేతో తాను పోల్చడం కరెక్టేనంటూ కంగన చేసిన తాజా వ్యాఖ్యలపై శివసేన ఎంఎల్‌ఏ ప్రతాప్‌ సర్నాయక్‌ మండిపడ్డారు. ఎంత యత్నించినా కుక్కతోక వంకరేనన్న మాటలకర్ధం తెలిసిందని పరోక్షంగా కంగనపై విమర్శలు చేశారు. 

ముంబై మరీ అంత చెడ్డనగరమనిపిస్తే, పీఓకేలాగా కనిపిస్తే కంగన నగరం వదిలి తనకు సరైన చోటుకు పోవచ్చని శివసేన మంత్రి అనీల్‌ సూచించారు. ముంబై గురించి చెడుగా మాట్లాడితే పార్టీ  చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కాగా బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌, శివసేన మధ్య తలెత్తిన రగడ ఇప్పట్లో చల్లారేలా కనపడటం లేదు. ఇరు వర్గాలు మాటల తూటాలతో పరస్పరం దాడికి దిగుతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో పాటు కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై కంగన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. 

తాజాగా మరోసారి సోనియాపై కంగనా విమర్శలు ఎక్కుపెట్టారు. స్వస్థలానికి చేరుకున్న అనంతరం.. ‘‘ఈ ఏడాది ఢిల్లీ గుండె కోతకు గురైంది. అక్కడ రక్తం ప్రవహించింది. సోనియా సేన ముంబైలో ఆజాద్‌ కశ్మీర్‌ అని నినాదాలు చేస్తోంది, ఈ రోజు స్వేచ్చ ఉందని భావించగలిగే విషయం అంటే గొంతెత్తడం ఒకటే, నాకు మీ గొంతు ఇవ్వండి, లేదంటే స్వేచ్ఛ అంటే రక్తం చిందించడమే అవుతుంది’ అంటూ ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. గతేడాది దేశ రాజధాని ఢిల్లీలోని జేఎన్‌యూలో చోటుచేసుకున్న ఘర్షణలను వ్యతిరేకిస్తూ ముంబైలో.. ‘ఫ్రీ కశ్మీర్‌’ ప్లకార్డులు ప్రదర్శించడాన్ని ఈ సందర్భంగా కంగనా ప్రస్తావించారు. 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   14 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   14 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   18 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   19 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   15 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   a day ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   a day ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   14 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   16 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle