newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

మాట మార్చిన కమల్.. అన్ని మతాల్లో ఉగ్రవాదులున్నారట!

18-05-201918-05-2019 08:13:56 IST
Updated On 27-06-2019 16:14:32 ISTUpdated On 27-06-20192019-05-18T02:43:56.191Z18-05-2019 2019-05-18T02:42:24.994Z - 2019-06-27T10:44:32.814Z - 27-06-2019

మాట మార్చిన కమల్.. అన్ని మతాల్లో ఉగ్రవాదులున్నారట!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ఉగ్రవాది హిందూవేనని, మహాత్మా గాంధీని చంపిన నాధురామ్ గాడ్సే మొదటి టెర్రరిస్ట్ అని సంచలన వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో  తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు కమల్.

అన్ని మతాల్లోనూ ఉగ్రవాదులు ఉన్నారని ఆయన అన్నాడు. తన మాటలకు వస్తోన్న విమర్శల నేపథ్యంలో తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని.. కానీ అన్ని మతాల్లోనూ టెర్రరిస్ట్‌లు ఉన్నారంటూ కమల్ చెప్పుకొచ్చాడు. 

ఎవరూ తాము ఉత్తములని చెప్పుకోరని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఉన్నత విలువలతో కూడిన రాజకీయాలు ఇప్పుట్లో కనుమరుగయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు తాను మతసామరస్యం గురించి మాట్లాడానని.. హిందూ, ముస్లిం, క్రైస్తవుల నాయకులతో తాను భేటీ అవుతానని చెప్పాడు. ఇక తనపై చెప్పులు విసిరినా, కేసులు పెట్టినా, రాళ్లు విసిరినా పెద్దగా బాధపడనని చెప్పుకొచ్చాడు. 

మూడురోజుల క్రితం కరూరు జిల్లా అరవకురిచ్చి అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో ‘స్వతంత్ర భారతావనిలో తొలి తీవ్రవాది ఒక హిందువు, అతని పేరు నాథూరాం గాడ్సే. ఇతను మహాత్మాగాంధీని హత్యచేసిన వ్యక్తి. మహాత్మాగాంధీ మానసిక ముని మనుమడిగా న్యాయం కోరుతున్నానని అన్నారు.

హిందువులే తొలి తీవ్రవాదులని కమల్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ సహా అన్ని హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశాయి. పోలీసులు స్టేషన్లలో కేసులు పెట్టారు. కమల్‌ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఏకంగా తమిళ మంత్రి ఒకరు కమల్ నాలుక కోసేయాలన్నారు. ఎన్నికల వేళ కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తర్వాత వాటికి వివరణ ఇవ్వడం గందరగోళం సృష్టించింది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle