మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు...
31-08-202031-08-2020 18:13:00 IST
Updated On 31-08-2020 19:17:57 ISTUpdated On 31-08-20202020-08-31T12:43:00.828Z31-08-2020 2020-08-31T12:42:56.150Z - 2020-08-31T13:47:57.600Z - 31-08-2020

మాజీ రాష్ట్రపతి, భారత రత్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఆర్మీ ఆస్పత్రిలో కన్నుమూశారు. కరోనా వైరస్ బారినపడిన ఆయన చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిశారు. కోవిడ్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో గతకొంత కాలంగా ఆర్మీ ఆస్పత్రిలోనే ఉంటున్నారు.ఆయన వయసు 84 సంవత్సరాలు. dఈ క్రమంలోనే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో ఆరోగ్యం విషమించి మృతిచెందినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాష్ట్రపతిగా, కేంద్రమంత్రిగా, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ప్రణబ్ భారత రాజకీయాల్లో తనదైన గుర్తింపు పొందారు. ఇవాళ ఉదయం నుంచి ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉందని ప్రకటించిన తర్వాత మరింత విషమించింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఆయన ఆరోగ్యాన్ని మరింత కుంగదీసింది. ‘నిన్నటి నుంచి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ‘సెప్టిక్ షాక్’లోకి వెళ్లారు. నిపుణులైన వైద్య బృందం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ప్రస్తుతం ప్రణబ్ డీప్ కోమాలో ఉన్నారు. వెంటిలేటర్ పైనే ఆయనకు చికిత్స అందిస్తున్నాం’ అంటూ ప్రకటనలో తెలిపారు. ఆయన సెప్టిక్ షాక్ లో వున్నారు. సాధారణంగా ‘సెప్టిక్ షాక్’కి గురయ్యే వ్యక్తుల్లో గుండె, మెదడు, కిడ్నీలు వంటి కీలక అవయవాలు దెబ్బతింటాయి. బీపీ తీవ్రంగా పడిపోతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు మూత్ర సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతాయి. ఒకరకంగా సెప్టిక్ షాక్‌లోకి వెళ్లడమంటే ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంటుంది. ఇన్ఫెక్షన్ బారినపడిన తర్వాత శరీరంలో బీపీ ఒక్కసారిగా పడిపోవడంతో ఈ ప్రమాదకర పరిస్థితి తలెత్తుతుంది. ఈ దశలో వున్న ప్రణబ్ కన్నుమూశారు. ఈనెల 10వ తేదీన ఆర్మీ ఆస్పత్రిలో చేరిన ప్రణబ్‌కు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించాక కూడా ఆయన డీప్ కోమాలోకి వెళ్లారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆకస్మిక మృతితో దేశం విషాదంలో మునిగిపోయింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు పలువురు రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
7 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
10 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
14 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
14 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
14 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
12 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
21-04-2021

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా