మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం
13-08-202013-08-2020 13:15:09 IST
Updated On 13-08-2020 13:44:13 ISTUpdated On 13-08-20202020-08-13T07:45:09.007Z13-08-2020 2020-08-13T07:45:00.685Z - 2020-08-13T08:14:13.271Z - 13-08-2020

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు.ఢిల్లీలోని ఆర్మీకి చెందిన రిసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజీత్ ముఖర్జీ ట్విటర్ ద్వారా స్పందించారు. బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తన తండ్రి ఆరోగ్యం ప్రస్తుతానికి హీమోడైనమికల్లీ స్టేబుల్‌గా వున్నారని చెప్పారు. ప్రస్తుతం ఆయన కోమాలో వున్నారని ఆర్మీ ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఆరోగ్యపరిస్థితిలో ఎలాంటి మార్పులేదని, చికిత్స కొనసాగుతోందన్నారు.తనతండ్రి ఆరోగ్యంపై వస్తున్న వార్తలు అబద్ధమని ప్రణబ్ కూతురు శర్మిష్ట ముఖర్జీ తెలిపారు. ఆస్పత్రినుంచి ఎలాంటి సమాచారం వస్తుందోనని తాను ఎదురుచూస్తున్నానన్నారు. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆయన చికిత్స పొందుతున్న ఆర్మీ ఆస్పత్రి వర్గాలు ఇప్పటికే హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిని నిపుణుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోంది, ఇక, మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ఈనెల 10న ప్రణబ్‌కు శస్త్రచికిత్స కూడా జరిగింది. ప్రణబ్ ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు కొడుకు వెల్లడించారు. త్వరలో కోలుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన కోసం మీ ప్రార్థనలకు కొనసాగించండి అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు.

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
10 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
15 hours ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
12 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
16 hours ago

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
14 hours ago

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత
19 hours ago

లక్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడినట్లే- రఘురామ
18 hours ago

తిరుపతిలో ఇవాళ అమ్మవారి కటాక్షమే పార్టీలకు ఇంపార్టెంట్
20 hours ago

షర్మిల పక్కనే విజయమ్మ.. లాభమా నష్టమా
17 hours ago

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
21 hours ago
ఇంకా