newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మహిళా లెక్చరర్‌‌పై పెట్రోల్ దాడి.. ఉన్మాది ఘాతుకం

04-02-202004-02-2020 08:20:13 IST
Updated On 04-02-2020 08:20:10 ISTUpdated On 04-02-20202020-02-04T02:50:13.208Z04-02-2020 2020-02-04T02:48:24.593Z - 2020-02-04T02:50:10.224Z - 04-02-2020

మహిళా లెక్చరర్‌‌పై పెట్రోల్ దాడి.. ఉన్మాది ఘాతుకం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, చిన్నారులపై దాడులు ఆగడం లేదు. మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. పట్టపగలే మహిళా లెక్చరర్ పై పెట్రోల్ దాడి చేశాడు. తనను ప్రేమించడం లేదన్న అక్కసుతో మహిళా లెక్చరర్‌‌పై పెట్రోలు పోసి నిప్పంటించాడు.

Image result for petrol attack women lecturer"

ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. నందోరి చౌక్‌లో నడిరోడ్డుపైనే అతడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు మంటలు ఆర్పి బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. బాధితురాలి వివరాలు సేకరించి, ఆమె పేరు అంకితగా, నిందితుడిని వికేశ్‌గా గుర్తించారు. 

ఈ దారుణ ఘటన అనంతరం నిందితుడు సంఘటనా స్థలం నుంచి పారిపోయాడు. రంగంలోకి దిగిన పోలీసులు వికేష్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనను మహారాష్ట్ర ప్రభుత్వం ఖండించింది. దీనిపై విచారణకు ఆదేశించింది. 

ఇద్దరూ వివాహితులే... 

బాధితురాలు అంకిత, వికేశ్ ఒకే గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.  వీరిద్దరి మధ్య పరిచయం ఉందని, వికేష్ ప్రవర్తన నచ్చక రెండేళ్ల నుంచి అతడిని దూరం పెడుతూ వచ్చింది అంకిత. ఈ క్రమంలో వీరిద్దరికి వేర్వేరుగా వివాహం అయింది. కానీ వికేశ్, అంకితను వదలడంలేదు. కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న అంకితను రోజూ ఫాలో అయ్యేవాడు.

సోమవారం కూడా కాలేజ్ వద్ద కాపుకాసిన వికేశ్‌, అంకితతో గొడవ పడ్డాడు. ఆవేశంలో తను తెచ్చుకున్న పెట్రోలును ఆమెపై చల్లి నిప్పంటించాడు. చుట్టుపక్కలవారు గమనించేలోగా బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్.. సతర్వం విచారణ జరిపి, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. ప్రేమ పేరుతో పెట్రోల్ దాడులు చేయడం కలకలం రేపుతోంది. తెలంగాణలో గత ఏడాది ఓ మహిళా ఎమ్మార్వో పై రైతు దాడిచేసి పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆమె సజీవ దహనం అయింది. ఈ దాడిలో నిందితుడితో పాటు మరో ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   14 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   10 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   12 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   17 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   19 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   21 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle