newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

‘మహా’, హర్యానా ఫలితాలు బీజేపీకి ఒక హెచ్చరికేనా?

25-10-201925-10-2019 15:26:11 IST
2019-10-25T09:56:11.458Z25-10-2019 2019-10-25T09:56:07.114Z - - 17-04-2021

‘మహా’, హర్యానా ఫలితాలు బీజేపీకి ఒక హెచ్చరికేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి ఏ మంత సంతోషం కలిగించేవిగా లేవు. రెండు రాష్ట్రాలలోనూ కూడా ఎకైక అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ...అదేమీ నల్లేరు మీద బండి నడకగా రాలేదు. అలాగే గతంలో ఈ రెండు రాష్ట్రాలలో ఆ పార్టీ సాధించిన ఫలితాలతో చూస్తే బీజేపీ ఈ సారి బాగా నష్టపోయిందనే చెప్పాలి. సీట్ల పరంగానే కాకుండా, ఓట్ల శాతం విషయంలో కూడా బీజేపీకి ఈ ఎన్నికలు ఒకింత హెచ్చరికనే చేశాయని చెప్పాలి.

బీజేపీ ఈ సారి ఎన్నికలలో పూర్తిగా ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ వంటి భావోద్వేగ పూరిత అంశాలపైనే ఆధారపడింది. ఇవే తమకు తిరుగులేని విజయాన్ని అందిస్తాయని పూర్తిగా నమ్మింది. అయితే కేవలం ఆ రెండు అంశాలే ప్రజలను ఇంకే ఇతర సమస్యలనూ పట్టించుకోకుండా చేస్తాయన్నది కేవలం భ్రమే అన్న విషయం కమలనాథులకు ఈ ఫలితాలతో అవగతం అయ్యి ఉంటుంది. జీఎస్టీ, మాంద్యం అంశాలు ప్రజలపై తీవ్ర ప్రభావమే చూపాయి. ఈ రెండు అంశాలు ప్రభుత్వంపై ప్రజలలో ఏదో మేరకు వ్యతిరేకత గూడుకట్టుకోవడానికి దోహదపడ్డాయి.

ప్రాంతీయ అంశాలు, ప్రాంతీయ సమస్యలపై ప్రజల దృష్టి మళ్లకుండా కేవలం జాతీయ అంశాలపైనే ఈ రెండు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేసిన బీజేపీ...కొంత వరకూ సఫలీకృతమైంది. అయితే బీజేపీ జాతీయ అంశాలంటే కేవలం ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, పాకిస్థాన్ ను ప్రపంచ దేశాలలో ఏకాకిని చేయడం వంటివే అని భావించింది. కానీ జాతీయ స్థాయిలో ప్రజల జీవన ప్రమాణాలపైనా, ఆర్థిక పరిస్థితిపైనా ప్రభావం చూపిన జీఎస్టీ, మాంద్యం వంటి వాటిని కూడా జనం సీరియస్ గానే పట్టించుకున్నారని మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.

నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు, ఉపాధి పథకాల అమలులో లోపాలు, వైఫల్యాలు వంటివి సామాన్యుల బతుకును భారంగా మార్చేశాయి. జాతీయ స్థాయిలో కేంద్రం విధానాల కారణంగానే ఈ సమస్యలు తలెత్తాయి. ఇవే సమస్యలు ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజాగ్రహంగా ఎన్నికలలో ప్రతిఫలించాయి.  అయితే ఆ ప్రజాగ్రహం హర్యానా, మహారాష్ట్రలలో బీజేపీకి హెచ్చరికగానే ఉంది. ఈ హెచ్చరికను పరిగణనలోనికి తీసుకోకుంటే ముందు ముందు బీజేపీ  భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశాలు లేకపోలేదు.

ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే...ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ  ఏదో మొక్కుబడి ప్రచారంతో మమ అనిపించిందే తప్ప...విజయ కాంక్షతో గట్టిగా ప్రచారం చేయలేదు. గత సార్వత్రిక ఎన్నికలలో పరాజయం తరువాత పార్టీ సారథ్య పగ్గాలను వదిలేసిన  రాహుల్ గాంధీ ప్రచార సారథిగా ఈ రెండు రాష్ట్రాలలోనూ పర్యటించినా...పెద్దగా ప్రభావం చూపే ప్రసంగాలేవీ చేయలేదు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తరువాత వచ్చిన తొలి ఎన్నికలే అయినా సోనియా గాంధీ ఇక్కడ కనీసం ఒక్కటంటే ఒక్క ఎన్నికల ప్రచార సభలో కూడా పాల్గొనలేదు.

ఇక స్థానిక నాయకత్వం అంతర్గత విభేదాలతో ప్రచార పర్వమంతా నామమాత్రంగానే సాగింది. అయితే ఫలితాల తరువాత కాంగ్రెస్ లో కచ్చితంగా పశ్చాత్తాపం కలిగే ఉంటుంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల నాటికీ, ఇప్పటికీ పార్టీ పట్ల ప్రజాదరణ పెరిగిందనడానికి ఈ ఎన్నికలు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చాయి. ప్రచారం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉండేవని పరిశీలకులు సైతం తమ విశ్లేషణల్లో చెబుతున్నారు.  విజయం పట్ల అపనమ్మకంతో ముందే కాడి వదిలేయకుండా ఉంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉండి...దేశ వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నిండేది.

 

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   11 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   15 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   12 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   14 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   19 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   18 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   21 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   17 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle