newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

‘మహా’ సర్కార్ కూలిపోవడం ఖాయం: గడ్కరీ

06-01-202006-01-2020 09:04:19 IST
Updated On 06-01-2020 12:26:47 ISTUpdated On 06-01-20202020-01-06T03:34:19.018Z06-01-2020 2020-01-06T03:34:01.139Z - 2020-01-06T06:56:47.672Z - 06-01-2020

‘మహా’ సర్కార్ కూలిపోవడం ఖాయం: గడ్కరీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి సారధ్యంలో ఉద్దవ్ థాక్రే సీఎంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటైనప్పటినుంచీ బీజేపీ నేతలు ఈ కూటమి మనుగడపై సెటైర్లు వేస్తూనే వున్నారు. తాజాగా మ‌హా కూట‌మిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది. అదో అపవిత్ర కూటమని, త్వరలో కూలిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. 1

బీజేపీని అధికారానికి దూరం చేయడానికి కూటమిగా ఏర్పడిన మూడు పార్టీల మధ్య సైద్ధాంతిక సారూప్యతలు లేవని, విభేదాలు కనిపిస్తున్నాయని కేంద్రమంత్రి గ‌డ్క‌రీ అన్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులను వెళ్లగొట్టాలంటూ అప్పట్లో శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే అన్నారని గుర్తు చేసిన గ‌డ్క‌రీ ఇప్పుడు మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం సీఏఏను ఎందుకు వ్యతిరేకిస్తోందని దుమ్మెత్తి పోశారు.

మరాఠా, హిందుత్వ అస్థిత్వాన్ని వీడితే శివసేన తమ కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని నితిన్ గడ్కరీ హెచ్చరించారు. ఇదిలా ఉంటే..  మహా వికాస్ అఘాడీ పేరుతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో పదవులు పంపకం రచ్చరేపుతోంది.  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించిన శరద్ పవార్ మంత్రి పదవులు, శాఖల కేటాయింపులోనూ తన ఆధిపత్యం కొనసాగించారు.

ప్రభుత్వం ఏర్పడిన దాదాపు నెలరోజుల తర్వాత ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంత్రులకు శాఖలను కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ కేటాయింపుల్లో కూడా శరద్ పవార్ చక్రం తిప్పారు. ఇప్పటికే అజిత్ పవార్ కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలకమైన ఆర్ధిక శాఖ కూడా దక్కింది. మరో ముఖ్యనేత అనిల్ దేశ్‌ముఖ్‌కు హోం శాఖ ఇచ్చారు. జయంత్ పాటిల్‌కు ఇరిగేషన్, ఛగన్ భుజ్‌బల్‌కు ఆహారం, పౌర సరఫరాలు, దిలీప్ వాల్సే పాటిల్‌కు ఎక్సైజ్, ధనంజయ్ ముండేకు సామాజిక న్యాయం శాఖలు దక్కాయి.

మరో భాగస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్‌కు రెవెన్యూ, ఇంధన శాఖలతో పాటు కీలకమైన ప్రజాపనుల శాఖ దక్కింది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ బాలాసాహెబ్ థోరట్‌కు రెవెన్యూ శాఖ దక్కింది. అశోక్ చవాన్‌కు ప్రజాపనుల శాఖ దక్కింది. శివసేన నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆదిత్య థాకరేకు పర్యావరణం, పర్యాటక శాఖ కేటాయించారు.

ఏక్‌నాథ్ షిండేకు పట్టణాభివృద్ధి శాఖ,సంజయ్ రాథోడ్‌కు అటవీ శాఖ, ఉదయ్ సామంత్‌కు ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ, దాదా భుసెకు వ్యవసాయం, సందీప్ భుమ్రేకు ఉపాధి హామీ, గులాబ్‌రావ్ పటేల్ వాటర్ సప్లై, శంకర్‌రావు గడఖ్‌కు ఇరిగేషన్ శాఖ కేటాయించారు. కీలక శాఖలను ఎన్సీపీకే కేటాయించడంపై కాంగ్రెస్ మంత్రులు కొందరు తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle