newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

‘మహా’ సంగ్రామంలో కాంగ్రెస్ భవిష్యత్తేంటి?

06-10-201906-10-2019 13:31:16 IST
2019-10-06T08:01:16.319Z06-10-2019 2019-10-06T08:00:40.233Z - - 12-04-2021

‘మహా’ సంగ్రామంలో కాంగ్రెస్ భవిష్యత్తేంటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశమంతా కాషాయమయం అవుతోంది. రెండవసారి అధికారంలోకి వచ్చాక బీజేపీ మరిన్ని రాష్ట్రాలకు విస్తరించాలని తెగ ఆరాటపడుతోంది. మహారాష్ట్రలో మళ్ళీ విజయఢంకా మోగించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా శివసేన-బీజేపీ కూటమి తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ఇటు కాంగ్రెస్ సైతం ఏ అవకాశాన్నీ వదులుకోదలుచుకోవడం లేదు.

మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ యువతకు గాలం వేసింది.  తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు నెలకు రూ. 5,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించింది. రాష్ట్రంలోని సంస్థల్లో 80 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకే ఇస్తామని హామీ ఇచ్చింది.

ఉన్నత విద్య చదివే యువతకు, ఇతర దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేవారికి స్కాలర్‌షిప్‌లు ఇస్తామని ప్రకటించింది.దివ్యాంగులైన యువత ఉన్నత విద్యకు అయ్యే మొత్తం తామే భరిస్తామని కాంగ్రెస్ ప్రకటించడంతో బీజేపీ కూడా ఇలాంటి హామీల వైపు ఫోకస్ పెడుతోంది. 

‘మేలుకో మహారాష్ట్ర.. రేపటి కోసం ఇప్పుడే పనిచేయి’ అన్న ప్లాట్‌ఫాం కింద మూడు కోట్ల మంది యువత పాల్గొన్నారని, వారి ఆలోచన ప్రతిబింబమే తాము ప్రకటించిన యూత్‌ కాంగ్రెస్‌ మేనిఫెస్టో అని యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సత్యజీత్‌ తంబే అంటున్నారు. అంతేకాదు, యువత లక్ష్యంగా విద్యార్థులకు ఉచిత బస్‌ సౌకర్యం వంటివి కల్పిస్తామని హామీ ఇచ్చారు. లైఫ్‌స్టైల్‌ మేనేజ్‌మెంట్, సివిక్స్‌ వంటి సబ్జెక్టులను విద్యలో భాగం చేస్తామన్నారు.

ఇదిలా ఉంటే... ఎన్నికలకు మొత్తం 5534 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, శివసేన అభ్యర్థి ఏక్‌నాథ్‌ షిండే, ఎన్‌సిపి నేత అజిత్‌ పవార్‌ నామినేషన్లు వేశారు. ఈ ఎన్నికలలో బీజేపీ-కాంగ్రెస్ మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle