newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

‘మహా’ సంక్షోభానికి గడ్కరీయే సొల్యూషనా?

07-11-201907-11-2019 09:36:49 IST
Updated On 07-11-2019 09:36:41 ISTUpdated On 07-11-20192019-11-07T04:06:49.373Z07-11-2019 2019-11-07T04:04:56.675Z - 2019-11-07T04:06:41.559Z - 07-11-2019

‘మహా’ సంక్షోభానికి గడ్కరీయే సొల్యూషనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహారాష్ట్రలో తదుపరి సీఎం ఎవరు?

శరద్ పవార్ ప్రకటనతో ఆశలు గల్లంతేనా? 

నితిన్ గడ్కరీని సీఎంని చేస్తారా?

శివసేనను ఒప్పించడం ఈజీనా? 

మహా ప్రతిష్టంభనకు త్వరలో ముగింపు లభిస్తుందా?

అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మహారాష్ట్రలో గత పక్షం రోజులకు పైగా నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని తొలగించేందుకు ఆర్ఎస్ఎస్ మధ్యే మార్గాన్ని సూచించినట్టు తెలుస్తోంది. తాజా  పరిస్థితుల్లో కేంద్ర మంత్రి వర్గంలో ఉన్న నితిన్ గడ్కరీని ముంబైకి రప్పించాలరి,  ముఖ్య మంత్రిగా ఆయనకు బాధ్యతలు అప్పగించడమే సమస్య పరిష్కారానికి మార్గమని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్టు  రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.

శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే జీవించి ఉన్నప్పడు నితిన్ గడ్కరీకి మంచి అనుబంధం ఉంది. రాజకీయ వ్యవహారాలకు సంబంధించి గడ్కరీతో బాల్ థాకరే చర్చించేవారని బీజేపీ నేతలు చెబుతున్నారు. భాల్ థాకరే తోనూ, పార్టీతోనూ గడ్కరీ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు.

Image result for gadkari and Balthakare"

బాల్ థాకరే, అటల్ బిహారీ వాజ్ పేయితో నితిన్ గడ్కరీ (ఫైల్ ఫోటో)

కాబట్టి తమ ప్రతిపాదనకు శివసేన ప్రస్తుత నాయకత్వం కూడా అంగీకరించడం ఖాయమని సంఘ్ వర్గాలు అంటున్నాయి. గడ్కరీని సీఎంను చేస్తే శివసేన 50–50 ఫార్ములాపై పట్టు వీడవచ్చని బీజేపీ అంచనా వేస్తున్నారు. గతంలో సంకీర్ణ ప్రభుత్వంలో సమస్యలను గడ్కరీయే పరిష్కరించేవారు.

ఇప్పటికే ఫడ్నవీస్ ను బీజేఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో బీజేపీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. శనివారంతో మహారాష్ట్ర అసెంబ్లీ కాల పరిమితి ముగియనుంది. దీంతో రెండురోజుల్లో ఈ ప్రతిష్టంభనకు ఫుల్ స్టాప్ పడుతుందని అంతా భావిస్తున్నారు. 

కూటమి పాతదే అయినా నేత మాత్రం మారతారని, శివసేన-బీజేపీ మళ్ళీ కలిసి కూర్చుంటాయంటున్నారు. ఈనేపథ్యంలో గవర్నర్‌తో బీజేపీ నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతిపక్షంలో కూర్చుంటామని ఇప్పటికే కాంగ్రెస్‌– ఎన్సీపీ ప్రకటించడంతో బీజేపీ-శివసేన ప్రభుత్వం ఏర్పాటు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.

మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. గవర్నరు భగత్‌సింగ్‌ కోషియారిని కలిసే బీజేపీ నేతల్లో ఫడ్నవీస్‌ లేకపోవడం విశేషం. 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   14 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   19 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   19 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle