మహా సంక్షోభం ముగింపునకు వచ్చినట్టేనా?
21-11-201921-11-2019 09:32:43 IST
2019-11-21T04:02:43.650Z21-11-2019 2019-11-21T04:02:27.526Z - - 17-04-2021

ఎన్నికలు ముగిసినా సరైన మెజారిటీ రాకపోవడంతో ఇటు బీజేపీ, అటు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం లభించలేదు. అనిశ్చితి నేపథ్యంలో గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడం చకచకా జరిగిపోయాయి. రాష్ట్రపతి పాలన అనంతరం ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన-ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నాలు చేశాయి. అయితే అవి కూడా ఫలప్రదం కాలేదు. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో వీరి భేటీకి విశేష ప్రాధాన్యం ఏర్పడింది. గంటపాటు వీరు సమావేశం అయ్యారు. ఈ భేటీలో రైతు సమస్యలపైనే చర్చించారని చెబుతున్నప్పటికీ.. ఎన్సీపీపై మోదీ ప్రశంసలు కురిపించిన తరవాత ఈ భేటీ చోటుచేసుకోవడం అనేక రాజకీయ ఊహాగానాలకు తావిస్తోంది. త్వరలో బీజేపీ, ఎన్సీపీలు జతకట్టి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయన్న ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. అయితే అవన్నీ ఊహాగానాలే అని తేలిపోయింది. మోడీతో భేటీ అనంతరం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై శివసేనకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అంగీకరించడంతో క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇంచుమించు ఖరారైంది, కాంగ్రెస్, ఎన్సీపీ సీనియర్ నేతలు ఢిల్లీలోని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో 4గంటలకుపైగా చర్చలు జరిపారు. త్వరలో మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ తర్వాత ప్రకటించడంతో ఉత్కంఠకు తెరపడే అవకాశాలున్నాయి. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ కూడా చెప్పారు. బీజేపీతో సేన తెగతెంపులయ్యాక ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందన్న వార్తలు రావడం మొదలయ్యాక ఇలాంటి ప్రకటన విడుదలైంది. ప్రభుత్వ ఏర్పాటుపై శుక్రవారం ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది. సీఎం పీఠంపై శివసేన, ఎన్సీపీ చెరో రెండున్నరేళ్లు వుండాలని నిర్ణయించాయి. బీజేపీ-శివసేన విషయంలో సీఎం పీఠం పంపకంలోనే విభేదాలు రావడం తెలిసిందే. ముఖ్యమంత్రి పీఠాన్ని ముందుగా శివసేన, ఆ తరువాత ఎన్సీపీ చెరో రెండున్నరేళ్లు పంచుకుంటాయి. కాంగ్రెస్‌కు ఐదేళ్ల పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఒప్పందం కుదిరింది. కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య జరిగిన చర్చల్లో కాంగ్రెస్ తరఫున మల్లిఖార్జున్ ఖర్గే, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్, బాలా సాహెబ్ తోరట్ తదితరులు.. ఎన్సీపీ నుంచి నవాబ్ మాలిక్, సుప్రియా సూలె, జయంత్‌పాటిల్, అజిత్ పవార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై అడ్డంకులు దాదాపు తొలగినట్లేనని, అతి త్వరలోనే శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ ప్రకటించడంతో సస్పెన్స్ కు తెరపడింది.

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్
42 minutes ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!
an hour ago

తిరుపతిలో కొనసాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్
4 hours ago

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెపరేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేనట్లే
2 hours ago

సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని అక్కా
5 hours ago

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
19 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
a day ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
20 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
16-04-2021

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
a day ago
ఇంకా