‘మహా’ బ్రేకింగ్ :డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా
26-11-201926-11-2019 14:59:50 IST
Updated On 26-11-2019 15:43:27 ISTUpdated On 26-11-20192019-11-26T09:29:50.617Z26-11-2019 2019-11-26T09:29:49.340Z - 2019-11-26T10:13:27.171Z - 26-11-2019

బుధవారం బలనిరూపణకు సిద్దమవుతున్న వేళ మహారాష్ట్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు. ప్రమాణస్వీకారం చేసిన మూడు రోజుల్లోనే తన పదవికి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం డైలీ సీరియల్ ఎపిసోడ్ ట్విస్ట్ లను తలపిస్తోంది. బుధవారం ఏం జరుగుతుందో తెలియక పోయినా డిప్యూటీ సీఎం రాజీనామా వ్యవహారం కాక రేపుతోంది. గత శనివారం రాత్రంతా కీలక పరిణామాలు జరిగాయి. శివసేన - ఎన్సీపీ - కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని అంతా భావించారు. కానీ ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలిపారు. దీంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ఈనెల 23వ తేదీ శనివారం రోజు ప్రమాణస్వీకారం చేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, శివసేన మండిపడ్డాయి. శరద్ పవార్ వెంటనే స్పందించి లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికైన అజిత్ పవార్ ను ఆ పదవినుంచి తొలగించారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు ప్రభుత్వ ఏర్పాటు అనైతికమని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసిన సంగతి తెలిసిందే. బుధవారం సాయంత్రం 5 గంటల లోగా బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. బలపరీక్ష వ్యూహం గురించి చర్చించేందుకు బీజేపీ నేతలు ఇవాళ రాత్రి 9 గంటలకు భేటీ కూడా అవుతున్న వేళ అజిత్ పవార్ రాజీనామా నిర్ణయం బీజేపీ నేతలను కలవరపరుస్తోంది. అజిత్ పవార్ తాజా రాజీనామా నిర్ణయంపై సాయంత్రం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
7 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
11 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
14 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
14 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
14 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
12 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
21-04-2021

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా