newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

‘మహా’ ప్రచారంలో మోడీ ఓవర్ స్పీడ్!

14-10-201914-10-2019 15:06:39 IST
Updated On 14-10-2019 17:19:14 ISTUpdated On 14-10-20192019-10-14T09:36:39.743Z14-10-2019 2019-10-14T09:36:31.830Z - 2019-10-14T11:49:14.515Z - 14-10-2019

‘మహా’ ప్రచారంలో మోడీ ఓవర్ స్పీడ్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహారాష్ట్రలో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ దూకుడుగా ప్రచారం చేస్తున్నది. ప్రధాని నరేంద్రమోడీ నిన్న రాష్ట్రంలో సుడిగాలి పర్యనట జరిపి పలు ర్యాలీలలో ప్రసంగించారు. ప్రచారంలో స్పీడ్ పెంచే క్రమంలో ఆయన ఓవర్ స్పీడ్ అయ్యారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అన్న విషయం మరచి ఆయన జాతీయ అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టడమే కాకుండా వాటిపైనే విపక్షాలకు సవాళ్లు విసిరారు. దమ్ముండే ట్రిపుల్ తలాక్ ను మళ్లీ ప్రవేశపెట్టండి, ఆర్టికల్ 370 రద్దును వెనక్కు తీసుకుంటామని చెప్పండి అంటూ నిలదీశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తిరగదోడాలంటే...మళ్లీ కేంద్రంలో ఎన్డీయేతర ప్రభుత్వం అధికారంలోకి రావాలి. అంతే కానీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోనికి వచ్చినంత మాత్రాన ఏ బీజేపీయేతర సర్కార్ కూడా మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తిరుగదోడలేదు. 

మహారాష్ట్రలో అయినా, హర్యానాలో అయినా బీజేపీ స్థానిక అంశాలను ప్రస్తావించి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఆ రెండు రాష్ట్రాలలో కూడా బీజేపీ మళ్లీ అధికారంలోనికి రావాలంటే...ఆ పార్టీకి జాతీయ అంశాలే దిక్కు. అందుకే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రధానంగా జాతీయ పౌరసత్వ నమోదు, ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దులనే నమ్ముకుంది. ఈ మూడు నిర్ణయాలకూ జాతీయ స్థాయిలో ‘మెజారిటీ’ మద్దతు లభించిందని ఆ పార్టీ నమ్ముతోంది. అందుకే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్రమోడీ తమ ప్రచారంలో విపక్షాలను ఇరుకున పెట్టే వ్యూహంగా ఆ అంశాలనే తెరపైకి తీసుకువస్తున్నారు.

ఈ మూడు అంశాల విషయంలో విపక్షాలలో కూడా భిన్నాభిప్రాయాలు ఉండటం బీజేపీకి బాగా కలిసి వస్తున్నది.  బీజేపీ జాతీయ అంశాలను అస్త్రాలుగా ప్రయోగిస్తుండటంతో విపక్షాలకు ముఖ్యంగా కాంగ్రెస్చ ఎన్సీపీలకు కూడా తమ ప్రచారంలో జాతీయ అంశాలను ప్రస్తావించక తప్పని పరిస్థితి ఏర్పడింది. మహాలో అధికారంలో ఉన్న బీజేపీ తన వ్యూహంతో ప్రజావ్యతిరేక ప్రభావం ఎన్నికలపై పడకుండా జాగ్రత్త పడుతుంటే...విపక్షాలు మాత్రం వ్యూహ చతురత లేక బీజేపీ ఉచ్చులో పడి ఆ పార్టీకే మేలు జరిగేలా ప్రచార రంగంలో వ్యవహరిస్తున్నారు.

రాహుల్ గాంధీ నిరుద్యోగ సమస్యను ప్రస్తావిస్తూ చంద్రయాన్ ను విమర్శించడం కచ్చితంగా కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి ప్రతికూంగా ప్రభావం చూపే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణుల్లోనే ఆందోళన వ్యక్తమౌతున్నది. దేశం యావత్తూ చంద్రయాన్ ప్రయోగాలను స్వాగతించింది, ఇస్రో ఘనతకు ఫిదా అయ్యింది. ఇప్పుడు  ఉద్యోగాలడుతుంటే చందమామను చూపిస్తున్నారంటూ రాహుల్ గాంధీ చంద్రయాన్ ను తక్కువ చేసి చూపేలా మాట్లాడటం  కాంగ్రెస్ కు మేలు చేస్తుందని భావించలేం.

అదే సమయంలో బీజేపీ చంద్రయాన్ ను ఓన్ చేసుకుని భారత ప్రతిష్టను ఇనుమడింప చేసిన ఘనతను తన ఖాతాలో వేసుకుంటుంటే...విపక్షం...అందుకు భిన్నంగా వ్యవహరించి దెబ్బతింటున్న పరిస్థితి కనిపిస్తున్నది. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర సమస్యలు ప్రధాన అజెండాగా పార్టీలు ప్రచార వ్యూహాన్ని రూపొందించుకుంటాయి. ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్ వైఫల్యాలను విపక్షాలు ఎండగడితే...ప్రభుత్వ విజయాలను అధికార పార్టీ ఏకరవు పెడుతుంది.

అయితే మహా ఎన్నికల ప్రచారంలో స్థానిక అంశాలు, సమస్యల ప్రస్తావనే లేకుండా చేయడంలో బీజేపీ విజయం సాధించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లూ కూడా మిత్రపక్షం, ప్రభుత్వంలో భాగస్వామి అయిన శివసేనతో విభేదాలతో పాలనా వ్యవహారాలను దాదాపుగా పక్కన పెట్టేసిన ఫడ్నవీస్ సర్కార్ కు ఎదురు గాలి వీస్తున్నది.

ఇదే విషయాన్ని కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి, ఇతర పార్టీలూ బలంగా ప్రజలలో నాటుకునేలా ప్రచారం చేయాల్సి ఉండగా అందుకు భిన్నంగా ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ వంటి అంశాలనే ప్రస్తావిస్తూ పరోక్షంగా బీజేపీకి సహకరిస్తున్నారన్నది పరిశీలకుల విశ్లేషణ. ఇక ఎన్నికలకు వారం రోజులే ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా విపక్షాల తమ ప్రచారాన్ని స్థానిక సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై కేంద్రీకృతం చేయకుంటే మూల్యం చెల్లిచుకోక తప్పదన్నది పరిశీలకుల అభిప్రాయం.

 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   4 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   5 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   5 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   9 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   10 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   8 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   11 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   11 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   6 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   13 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle