newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మహా పొత్తు- మెట్టు దిగిన శివసేన..

02-10-201902-10-2019 12:26:08 IST
Updated On 02-10-2019 12:26:21 ISTUpdated On 02-10-20192019-10-02T06:56:08.491Z02-10-2019 2019-10-02T06:56:06.985Z - 2019-10-02T06:56:21.040Z - 02-10-2019

మహా పొత్తు- మెట్టు దిగిన శివసేన..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహా అసెంబ్లీ ఎన్నికలలో శివసేన- బీజేపీ పొత్తు ఖరారైంది. సగం సీట్ల కోసం మొదటి నుంచీ పట్టుపడుతూ వస్తున్న శివసేన చివరికి కొంచం తక్కువైనా ఫరావలేదని సద్దుకుంది. మొత్తం రాష్ట్రంలో 228 అసెంబ్లీ స్థానాలు ఉండగా శివసేనకు 124 స్థానాలు కేటాయించేందుకు బీజేపీ అంగీకరించింది. శివసేన వైపు నుంచి చూస్తే ఆ పార్టీ కోరిన దాని కంటే  ఓ 20 స్థానాలు  తక్కువయ్యాయి. అదే సమయంలో బీజేపీ వైపు నుంచి చూస్తే శివసేనకు 124 స్థానాలు కేటాయించడం ద్వారా చాలా ఉదారంగా వ్యవహరించిందనే చెప్పాలి.

ఇందుకు కారణం మహారాష్ట్రలో ఇరు పార్టీలూ కూడా  పరస్పరం సహకరించుకునే ధోరణితో సాగకపోతే...ఇరు పార్టీలకూ ఇబ్బందే అన్న కారణంగానే ఎన్నికల పోత్తు విషయంలో ఇరు పార్టీలూ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాయి. గతానికి భిన్నంగా ఈ సారి మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్ఎన్ఎస్) కూడా ఎన్నికల బరిలోకి ఒంటరిగా దిగనుండటంతో బీజేపీ, శివసేనలు ఒకింత జాగ్రత్త పడ్డాయనే చెప్పాలి.

రాష్ట్రంలో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న బీజేపీ కలిసి వచ్చే ఏ పార్టీనీ కాదనకుండా చేర్చుకుంటున్నది. శివసేన కాకుండా ఇతర చిన్న పార్టీలను కూడా చేర్చుకుని ఎన్డీయే కూటమిని బలోపేతం చేసే లక్ష్యంతో అడుగులు వేస్తున్నది. అందుకే బీజేపీ ఎక్కువ బెట్టు చేయకుండా శివసేనకు 124 స్థానాలను కేటాయించేంది. ఇక ఇతర భాగస్వామ్య పార్టీలకూ టికెట్లు కేటాయించింది. ఇప్పటికే బీజేపీ నూట పాతిక స్థానాలలో అభ్యర్థులను ప్రకటించేసింది.

ఇక శివసేన కాకుండా ఇతర భాగస్వామ్య పార్టీలైన రిపబ్లికన్ పార్టీ, రాష్ట్రీయ సమాజ్ పక్ష్, శివ సంఘ సంఘటన, రాయల్ క్రాంతి పార్టీలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో ఈ పార్టీలన్నీ వేరువేరుగా పోటీ చేశాయి. ఇప్పుడు అన్నిటినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సఫలీకృతులయ్యారనే చెప్పాలి. మరో వైపు కాంగ్రెస్, ఎన్సీపీ కూడా పెద్దగా ఇబ్బందులు లేకుండానే పొత్తు, స్థానాల కేటాయింపులను ఖరారు చేసుకున్నాయి. ఇరు పార్టీలూ మహాఎన్నికలలో చెరో 128స్థానాలలోనూ పోటీ చేస్తుండగా... సమాజ్‌ వాదీ, స్వాభిమానీ షెట్కరీ సంఘటన్‌, సీపీఐలు  మిగిలిన స్థానాలలో రంగంలో ఉంటాయి.

ఈ సారి బీజేపీ విజయం సాధించాలన్న కృత నిశ్చయంలో ఏ మాత్రం ఉదాశీనతు తావీయడంలేదు. ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలోనే ముగ్గురు సిట్టింగ్ మంత్రుల పేర్లు గల్లంతు కావడమే ఇందుకు నిదర్శనం. అలాగే 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే బీజేపీ  చెక్ పెట్టింది. ఇదేళ్ల కాలంలో మెరుగైన పనితీరు కనబరచలేదన్న కారణంగా సిట్టింగ్ మంత్రులకు టికెట్ ఇవ్వక పోవడం బీజేపీ లో ఇదే మొదలు అని చెప్పవచ్చు.

సిట్టింగ్ లకు సీటు నిరాకరించే విషయంలో కూడా బీజేపీ ఎటువంటి మీనమేషాలూ లెక్కించలేదు. అంచనాలకు తగినట్లుగా పని తీరు కనబరచకుంటే ఉపేక్షించేది లేదని గత కొంత కాలంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెబుతూనే వస్తున్నారు. ఇప్పుడు సిట్టింగ్ లలో కొందరిని పోటీకి దూరంగా ఉంచడం ద్వారా తనవి కేవలం మాటలే కాదని నిరూపించారు.

ఇక శివసేన విషయానికి వస్తే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసినట్లు ఈ సారి తెగేదాకా లాగకుండా ...సంయమనం పాటింది. ఒక మెట్టుదిగి వచ్చింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఒంటరి పోరు ఆ పార్టీని బీజేపీతో సాధ్యమైనంత త్వరగా పొత్తు ఖరారు చేసుకునేలా తొందరపెట్టిందని చెప్పాలి. ఏది ఏమైనా ఈ సారి ఎన్నికలలో ఎమ్ఎన్ఎస్ ప్రభావం కచ్చితంగా శివసేన, బీజేపీ కూటమిపై ఉంటుంది. అయితే అది ఏ మేరకు ఉంటుందన్న దానిపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి.

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   12 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   13 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   13 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   17 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   18 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   16 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   19 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   19 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   14 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle