మహా ఎన్నికల సందడి- ఎన్సీపీ, కాంగ్రెస్ సీట్ల సర్దు ‘పాట్లు’.!
12-09-201912-09-2019 16:53:42 IST
2019-09-12T11:23:42.988Z12-09-2019 2019-09-12T11:23:17.587Z - - 11-04-2021

సార్వత్రిక ఎన్నికల సందడి ముగిసి కేంద్రంలో కొత్త సర్కార్ (మోడీ సర్కార్) కొలువుదీరి వంద రోజులు పూర్తయ్యిందో లేదో...కీలకమైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఘట్టం తెరమీదకు వచ్చింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం నుంచి ఇంకా తేరుకోని కాంగ్రెస్ మహా ఎన్నికల సమరాన్ని ఎలా ఎదుర్కొనాలని మల్లగుల్లాలు పడుతోంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా, ఆ పదవిని అధిష్టించడానికి దానికి ముళ్ల కిరీటంతో పోలుస్తూ ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో అనివార్యంగా తాత్కాలిక అధ్యక్షురాలిగా మళ్లీ సోనియా గాంధీయే పార్టీ పగ్గాలు అందుకున్నారు. మహా ఎన్నికలను సమర్ధంగా ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహ రచన చేసేందుకు సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ భావసారూప్యత ఉన్న పార్టీలకు స్నేహ హస్తం చాచుతోంది. ఆ నేపథ్యంలోనే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)తో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ భేటీ అయ్యారు. ఢిల్లీలో సోనియాగాంధీని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కలిశారు. వీరి భేటీలో ఇరు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటుకు ఉన్న అవకాశాలపైనే చర్చ జరిగింది. మహా ఎన్నికలలో ఇరు పార్టీలూ పొత్తు పెట్టుకుని పోటీలోకి దిగుతాయన్నది ఇప్పటికే ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. తాజా భేటీ అంతా సీట్ల సర్దుబాటు చర్చలకే పరిమితమైందని కూడా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ భేటీలో ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్న విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కేవలం ఎన్సీపీతోనే కాకుండా ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలతో కలిసి ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలకు ఎన్ని స్థానాలు కేటాయించాలన్న విషయంలో విస్తృత స్థాయి చర్చలవసరమని కాంగ్రెస్ భావిస్తున్నది. మహా రాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమిని దీటుగా ఎదుర్కొనేందుకు విపక్షాల ఐక్యత అవసరమని, కీలకమని కాంగ్రెస్-ఎన్సీపీలు భావిస్తున్నాయి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ-శివసేన కూటమి రాష్ట్రంలోని 48 లోక్ సభ స్ధానాలకు గాను 41 స్థానాలను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అసెంబ్లీ ఎన్నికలలో ఆ కూటమికి గట్టి పోటీ ఇవ్వాలన్నా, కూటమిని రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉంచాలన్నా భావసారూప్యత కలిగిన పార్టీల మధ్య పొత్తు అవసరమని కాంగ్రెస్, ఎన్సీపీలు భావిస్తున్నాయి. అందుకే వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలను కలుపుకుని కూటమి ఏర్పాటుతో ముందుకు సాగాలని సోనియా, శరద్ పవార్ భేటీలో నిర్ణయించారు. పొత్తులపై చర్చలు ఒక కొలిక్కి రావాలంటే రానున్న రోజులలో మరిన్ని సార్లు భేటీ కావాలన్న నిర్ణయానికి వచ్చారు. మహా అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెలలో జరిగే అవకాశం ఉంది. పార్టీ వర్గాల ప్రకారం, అక్టోబర్‌లో జరుగుతాయని భావిస్తున్న ఎన్నికలలో ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు గురించి పవార్ విస్తృతంగా మాట్లాడారని, కానీ అంతిమ నిర్ణయం తీసుకునే ముందు కొన్ని రోజులు చర్చలు కొనసాగుతాయి. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో 48 లోక్ సభ స్థానాలలో 41 గెలుచుకున్న బిజెపి-శివసేన కూటమిని కూల్చేందుకు ఎన్సీపి, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు సంకీర్ణంగా ఉండడం ముఖ్యం. లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఒకటే స్థానాన్ని దక్కించుకోగా, ఎన్సీపి నాలుగు సీట్లను గెలుచుకుంది. గత కొన్ని వారాలుగా ఎన్సీపి, కాంగ్రెస్ నాయకులు సీట్ల సర్దుబాటు విషయమై అనేకసార్లు సమావేశమై చర్చించారు. రెండు పార్టీలు తమకు ప్రజా మద్దతు ఉన్న ప్రాంతాలను దృష్టిలో పెట్టుకునే బేరసారాలు సాగించారు. జులై నెలలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధిపతి రాజ్‌థాక్రే ఢిల్లీలో సోనియా గాంధీని కలవడంతో, ఎంఎన్ఎస్ కాంగ్రెస్‌తో కలవనుందనే పుకార్లు షికార్లు చేశాయి. అయితే, కాంగ్రెస్ మాత్రం ఆ విషయం పట్ల కొంత అభ్యంతరాలను వ్యక్తం చేసింది. బిజెపిలో చేరేందుకు కొందరు ప్రముఖులు కాంగ్రెస్ పార్టీని వీడిన విషయం తెలిసిందే. అటు కాంగ్రెస్ నుంచి, ఇటు ఎన్సీపీ నుంచి కూడా కొందరు సీనియర్ నాయకులు బిజెపి లేక శివసేనలో చేరడంతో, ఎన్నికలకు ముందు ప్రతిపక్ష కూటమి ఆత్మవిశ్వాసం కొద్దిగా దెబ్బతిన్న మాట వాస్తవం. ఇదిలా ఉండగా, 'ఎన్కౌంటర్ స్పెషలిస్టు'గా పేరు పొందిన ప్రదీప్ శర్మ ముంబై పొరుగు జిల్లా అయిన పాల్ఘడ్‌లోని నలాసోపరా నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఆయన రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం ఆవెూదించడంతో ఆయన ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. శర్మ రాజీనామాను ఆవెూదించినట్టు హోంశాఖ అధికారులు వెల్లడించారు. కాగా, సంబంధిత అన్ని పత్రాలూ చేతికి వచ్చిన తర్వాతే శర్మ పోటీ గురించి మాట్లాడతారని తెలుస్తోంది. అతడు శివసేనలో చేరి, నలసోపరా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలకుగాను ఇద్దరు చొప్పున సంభావ్య అభ్యర్ధులను బిజెపి గుర్తించినట్టు తెలుస్తోంది. ''అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసేందుకు జాబితాను పార్టీ కేంద్ర కమిటీకి పంపుతాం,'' అని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తెలిపారు. దాదాపు ఏడుగంటలపాటు సాగిన కోర్ కమిటీ సమావేశానంతరం మాట్లాడుతూ, ''ఎన్నికలు అక్టోబర్ 15-20 మధ్య జరుగుతాయని భావిస్తున్నాం. దానికి అనుగుణంగానే అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాం. సమావేశంలో ఏర్పాట్లను సవిూక్షించుకున్నాం,'' అని పాటిల్ చెప్పారు. ఇదిలా ఉంటే.. ఎన్సీపీ నేత ఎంపి ఉదయన్‌రాజే భోస్లే సీఎం ఫడ్నవీస్ ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల వేడి రాజుకున్న సమయంలో ఎన్సీపీ టిక్కెట్టుపై 'సతారా' నుంచి పోటీ చేసిన ఉదయన్‌రాజే భోస్లే మంగళవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను కలవడం కలకలం రేపుతోంది. ఛత్రపతి శివాజీ వంశానికి చెందిన భోస్లే బిజెపిలో చేరే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
14 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
10 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
13 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
17 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
20 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
21 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా