newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మహా ఎన్నికల సందడి ప్రారంభం..!

21-09-201921-09-2019 16:04:20 IST
2019-09-21T10:34:20.662Z21-09-2019 2019-09-21T10:34:07.439Z - - 11-04-2021

మహా ఎన్నికల సందడి ప్రారంభం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి మూడు మాసాలు పూర్తయ్యాయో లేదో...దేశంలో మరోసారి ఎన్నికల హంగామా ప్రారంభమైంది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలలకు వచ్చే నెల 21న ఎన్నికలు జరగనున్నాయి. రెండు రాష్ట్రాలూ కూడా రాజకీయంగా బీజేపీకి ఎంత ప్రధానమే, విపక్షాలకు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ కు అంతే కీలకమైనవి.

కాగా మహారాష్ట్ర ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్  రెండూ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో నభూతో అన్న రీతిలో విజయం సాధించిన బీజేపీ ఆ విజయ పరంపరను కొనసాగించాలన్న పట్టుదలతో ఉంటే...ఓటమికి బదులు తీర్చుకుని ప్రతిష్ట నిలుపుకోవాలన్న తాపత్రయంలో కాంగ్రెస్ ఉంది. అందుకే మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలకు ముందు నుంచే కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల సన్నాహాలకు సిద్ధమైపోయాయి. పొత్తు చర్చలు, ప్రచారాలకు శ్రీకారం చుట్టేశాయి.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అయితే జనాదేశ్ యాత్ర పేరిట ఇప్పటికే ఒక సారి ప్రచార రథంపై రాష్ట్రాన్ని చుట్టేసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేశారు. ఆ యాత్ర ముగింపు సందర్భంగా రాష్ట్రంలో జరిగిన ఒక భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించి ఎన్నికల శంఖారావం పూరించేశారు.

మరో వైపు కాంగ్రెస్ పోటీ- పొత్తుల విషయంలో మల్లగుల్లాలు పడుతూనే ఉంది. పార్టీకి శాశ్వత అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో ముందు వెనుకలాడుతున్న కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా మాజీ చీఫ్ సోనియాగాంధీకే పగ్గాలు అప్పచెప్పింది కూడా మహా ఎన్నికల సంగ్రామానికి పార్టీని సన్నద్ధం చేయడం కోసమే. ఆ పనిని సోనియా ఇప్పటికే మొదలు పెట్టేశారు. ఎన్సీపీతో ఇప్పటికే ఒక విడత పొత్తు చర్చలు జరిపేసారు.

కలిసి పోటీ చేయాలన్న నిర్ణయానికి ఇరు పార్టీలూ ఇప్పటికే వచ్చేశాయి. అయితే సీట్ల సర్దుబాటు వ్యవహారం విషయంలో మాత్రం ఇంకా ముందడుగు పడలేదు. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు అన్న విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోవడానికి కారణం...కాంగ్రెస్, ఎన్సీపీలు మాత్రమే కలిస్తే ఎన్నికల పోరులో బీజేపీకి గట్టి పోటి ఇవ్వడం కష్టసాధ్యమన్న అనుమానాలు వెంటాడుతుండటమే.

భావసారూప్యత ఉన్న ఇతర పార్టీలను కూడా కలుపుకుపోవాలని ఇరు పార్టీలూ స్థూలంగా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశాయి. బీజేపీ యేతర పార్టీల పొత్తు మహారాష్ట్రలో ఒక లాంఛనమే. రాష్ట్రంలో బలంగా ఉన్న బీజేపీని దీటుగా ఎదుర్కోవాలంటే...బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకతాటిపైకి రాక తప్పదు. సరే విపక్షాల భావన ఇలా ఉంది. అయితే మరో వైపు బీజేపీకి కూడా రాష్ట్రంలో అంతా సవ్యంగా ఉన్నదని భావించే పరిస్థితులు లేవు. ఇటీవలి పార్లమెంటు ఎన్నికలలో అత్యధిక లోక్ సభ స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ అప్పట్లో ఒక మెట్టు దిగి మరీ శివసేనతో పొత్తను నిలుపుకుంది.

సీట్ల సర్దుబాటు విషయంలో శివసేన డిమాండ్ కు తలొగ్గింది. స్వయంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు రంగంలోనికి దిగి మరీ పొత్తును ఖరారు చేశారు.శివసేనతో పొత్తు కుదరకపోతే ఎన్నికలలో నష్టపోవడం ఖాయమన్న భావన అప్పట్లో పార్టీలో బలంగా కనిపించింది. సరే ఇప్పుడు పరిస్థితుల్లో ఏమైనా మార్పు వచ్చిందా అంటే వెంటనే సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది.

ఈ నేపథ్యంలోనే ఈ సారి కూడా శివసేనతో కలిసి ముందుకు సాగాలన్న అభిప్రాయంతో ఉన్న కమలం పార్టీకి శివసేన చుక్కలు చూపే విధంగా డిమాండ్లను తెరమీదకు తీసుకువస్తున్నది. రాష్ట్రంలో సగం స్థానాలను కేటాయించకుంటే ఒంటరి పోరుకు సిద్ధంగా ఉన్నామంటూ శివసేన బహిరంగ ప్రకటనలు చేస్తున్నది.  ఆ ప్రకటనలో స్థానాల కోసం డిమాండ్ కంటే బీజేపీని బ్లాక్ మెయిల్ చేసే ధోరణే ఎక్కువగా కనిపిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు.

శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయాలు కూడా పొత్తు పొసగాలంటే శివసేనకు సగం స్థానాలు కేటాయించాల్సిందే అన్న ధోరణిలోనే ఉంటున్నాయి. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా సామ్నా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో సంపాదకీయాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా పొత్తు పొసిగితే సరే లేకుంటే...విమర్శల వాగ్బాణాలే అన్న ధోరణి శివసేనలో కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో పొత్తు రాజకీయాలు దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.

ఇక హర్యానాలో కూడా అధికారంలో బీజేపీయే ఉంది. హర్యానాలోని 90 స్థానాలలో ప్రస్తుతం బీజేపీకి 47 , కాంగ్రెస్ 17 స్థానాలలో ఉన్నాయి. రాష్ట్రంలో శిరోమణి అకాలీదళ్, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఉంది. శిరోమణి అకాలీదల్ కు ప్రస్తుత అసెంబ్లీలో 1 సభ్యుడు ఉన్నాడు. ఇక కాంగ్రెస్ కూటమి పార్టీలలో 17 కాంగ్రెస్, ఇఎన్ఎల్డి (ఇండియన్ నేషనల్ లోక్ దళ్) 7 ఉన్నాయి.  ఈ నేపథ్యంలో  మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో దేశంలో రాజకీయ సందడి ఆరంభం అయినట్టే.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   12 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   9 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   11 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   15 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   18 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   19 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle