‘మహా’ ఎన్నికల్లో బీజేపీ ప్రచారాస్త్రం కాశ్మీర్..
23-09-201923-09-2019 13:55:41 IST
2019-09-23T08:25:41.966Z23-09-2019 2019-09-23T08:25:34.433Z - - 23-04-2021

‘మహా’ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు స్పష్టంగా కనిపిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలే అయినా బీజేపీ రాష్ట్ర సమస్యలపై కాకుండా తనకు అచ్చివచ్చిన ‘దేశభక్తి’ నినాదాన్నే ప్రచారంలో ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నది. మహా సందేశ్ యాత్ర పేరిట మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ రథయాత్రలోనూ, ఆ తరువాత ఆ రథయాత్ర ముగింపు సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగించిన భారీ ర్యాలీలోనూ కూడా ఆ నేతలు కాశ్మీర్ అంశాన్నే ప్రధానంగా ప్రస్తావించారు. ఇక ఆ తరువాత ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా కాశ్మీర్ నే ప్రధానంగా ప్రస్తావించారు. కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దును ఆయన దేశ భక్తి తో కూడిన అంశంగా అభివర్ణించడమే కాకుండా...అసలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏర్పడేందుకు అప్పటి ప్రధాని జవహర్లాన్ నెహ్రూయే కారణమని తేల్చేశారు. మహారాష్ట్రలో విపక్షాలు ఇంకా తమ ప్రచార కార్యక్రమాలను, ప్రచారాంశాలనూ ఖరారు చేసుకోవడంలో తలమునకలై ఉంటే...ఎన్నికల అంశం ఏమిటన్నది బీజేపీ నిర్ధారించేసింది. ప్రచారంలో దూసుకుపోతూ...విపక్షాలకు కాశ్మీర్ ను ప్రస్తావించక తప్పని అనివార్యతను కల్పించింది. కాశ్మీర్ వినా మిగిలిన రాష్ట్రాలన్నీ భారత్ లో విలీనం కాగా ఒక్క కాశ్మీర్ సమస్యాత్మకంగా మారడానికి కారణం నెహ్రూయే అన్న పాత వాదనను వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకు వచ్చి ‘మహా’ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ను డిఫెన్స్ లోనికి నెట్టివేశారు. ఇక ఒకే దేశం, ఒకే ప్రధాని, ఒకే రాజ్యాంగం అన్న నినాదంతో ‘మహా’ ఎన్నికలకు దేశ భక్తికి ముడిపెట్టేశారు. కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 వల్ల రాష్ట్ర అభివృద్ధి మాట అటుంచి దేశంలో ఉగ్రవాదం మాత్రమే అభివృద్ధి చెందిందన్న అమిత్ షా ఆ అర్టికల్ రద్దు ద్వారా మోడీ సర్కార్ రాష్ట్ర అభివృద్ధికి బాటలు పరిచిందన్నారు. ఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీల కంటే ముందుగా ప్రారంభించడం ద్వారా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రాష్ట్ర సమస్యలను పక్కన పెట్టి విపక్షాలు కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించక తప్పని పరిస్థితిని కల్పించింది. బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకుని ఉంటుంది. అది ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేయకుండా ఆ అంశాన్ని కాకుండా కాశ్మీర్, పీవోకే, ట్రిపుల్ తలాక్ వంటి జాతీయ అంశాలను తెరమీదకు తీసుకురావడం ద్వారా విపక్షాలకు చెక్ పెట్టాలన్నదే బీజేపీ ఎత్తుగడగా భావించాల్సి ఉంటుంది. కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ చట్టం వంటి వాటి విషయంలో విపక్షాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నందున ఈ అంశాల విషయంలో ఆ పార్టీలు బీజేపీ ప్రచారాన్ని సమర్ధంగా ఎదుర్కొనేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందనడంలో సందేహం లేదు. కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దును కాంగ్రెస్ సమర్ధంగా తిప్పికొట్టలేకపోయిన సంగతి తెలిసిందే. ఆ పార్టీలో కొందరు సీనియర్లు కూడా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఆర్టికల్ 370 రద్దును స్వాగతించారు. ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో అదే ప్రధాన ప్రచార అంశంగా మార్చివేయడం ద్వారా కాంగ్రెస్ లోని వైరుధ్యాలను జనం ముందు మరోసారి ఎండగట్టడానికి బీజేపీకి అవకాశం చిక్కింది. అందుకే బీజేపీ ప్రచార వ్యూహంలో చిక్కుకుని తిప్పలు పడకుండా ఉండడమెలా అన్న మధన కాంగ్రెస్, ఎన్సీపీలలో కనిపిస్తున్నది. పొత్తుల చర్చలు, ప్రచార వ్యూహం ఖరారులలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో విపక్షాలను పడేయడం ద్వారా ‘మహా’ సమరంలో సునాయాస విజయం అందుకోవాలన్నదే బీజేపీ ఎత్తుగడగా భావించాల్సి ఉంటుంది.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
3 hours ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
4 hours ago

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు
43 minutes ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
3 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
5 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
6 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
6 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
a day ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
22-04-2021

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021
ఇంకా