newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

‘మహా’ ఎన్నికలు...సర్వేలన్నీ కమలానికే అనుకూలం..!

12-10-201912-10-2019 12:32:34 IST
2019-10-12T07:02:34.087Z12-10-2019 2019-10-12T06:05:25.513Z - - 22-04-2021

‘మహా’ ఎన్నికలు...సర్వేలన్నీ కమలానికే అనుకూలం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ... శివసేనతో కలిసి మరోసారి పగ్గాలు చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయనే అన్ని సర్వేలూ వెల్లడిస్తున్నాయి. కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తరవాత దేశవ్యాప్తంగా బిజెపికి పెరిగిన ఇమేజే ఇందుకుకారణమని కూడా విశ్లేషిస్తున్నాయి. ప్రధాని వెూడీ, హోం మంత్రి అమిత్‌షాల జోడీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో విజయం పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నది. వారి ధీమాకు ఈ సర్వేలు మరింత బలం చేకూరుస్తున్నాయి. 

శివసేనతో పొత్తుకు ముందూ, తరువాతా కూడా ఇరు పార్టీల మధ్యా క్షేత్ర స్థాయిలో సమన్వయం కుదిరిందని చెప్పడానికి వీల్లేని పరిస్థితులున్నా...ఎన్నికలపై ఆ పొత్తు లుకలుకల ప్రభావం ఇసుమంతైనా ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు ప్రభావం బీజేపీకి అనూహ్యమైన సానుకూలతను తెచ్చిపెట్టిందని...ఆ ప్రభావం  మహారాష్ట్రలో కూడా ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.  అన్నిటికీ మించి కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా ఉండటం కూడా ‘మహా’ ఎన్నికలలో బీజేపీ విజయం నల్లేరు మీద బండి నడకగా మారుతుందన్న అంచనాలకు కారణంగా చెప్పవచ్చు.

కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం ఇప్పుడున్నంత బలహీనంగా ఆ పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేదు. సార్వత్రిక ఎన్నికల తరువాత పార్టీ అధ్యక్ష పగ్గాలను రాహుల్ గాంధీ వదిలేయడం...పార్టీ కేడర్ మనోస్థైర్యాన్ని ఘోరంగా దెబ్బతీసింది. నెలల తరబడి కొత్త నాయకుడి ఎంపిక విషయంలో చర్చలు సాగడం...చివరికి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఇవేమీ కూడా కేడర్ లో ఉత్సాహాన్నీ, విశ్వాసాన్ని నింపడానికి ఏ మాత్రం ఉపకరించ లేదు.

మహారాష్ట్రలో శరద్ పవార్ ‘పవర్’ గతంలో ఉన్నట్లుగా లేదనడానికి స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. పార్టీలో వలసలు, వయోభారం కారణంగా ఆయన పట్టు మహారాష్ట్రలో బాగా తగ్గిపోయింది. అలాగే కాంగ్రెస్ కూడా వలసలతో బలహీనంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీల పొత్తూ ఏమంత ఆశాజనకంగా లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇక ఎన్నికల ప్రచారంలో కూడా బీజేపీ- శివసేన కూటమి దూసుకుపోతుంటే...ప్రచార వ్యూహాల ఖరారులోనే కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి తలమునకలై ఉంది.

కాంగ్రెస్ ప్రచార బాధ్యతలను తలకెత్తుకోవడానికి కూడా ఆ పార్టీలో నాయకులు కరవైన పరిస్థితి. విపక్ష కూటమిలోని ఈ బలహీనతే బీజేపీ-శివసేన కూటమికి కలిసి వచ్చింది.  అందుకు తగ్గట్టుగానే ఎన్సీపీ నుంచి వలసలు, శరద్ పవార్ మహారాష్ట్ర సహకార బ్యాంకు కుంభకోణంలో ఆరోపణలు, కేసులు ఎదుర్కొంటుండటం కూడా ఆ పార్టీకి గట్టి పట్టు ఉన్న పశ్చిమ మహారాష్ట్రలో కూడా బలహీన పడింది. ఇక రాహుల్ వారసుడి ఎంపికలో జరిగిన జాప్యం కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారింది.

అంత మాత్రాన బీజేపీ- శివసేన కూటమిలో పరిస్థితి ‘ఆల్ ఈజ్ వెల్’ అన్నట్లుగా ఉందని చెప్పడానికి లేదు. ఈ పొత్తు శివసేన పార్టీలో ముసలానికి కారణమైంది. కూటమి సీట్ల సర్దుబాటు శివసేనకు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టింది. శివసేనకు చెందిన పలువురు కార్పొరేటర్లు పార్టీకి గుడ్ బై చెప్పారు. వారితో పాటు వందల మంది కార్యకర్తలు కూడా తమ రాజీనామా లేఖలను ఏకంగా పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాక్రేకు పంపించారు. 

అయితే ఈ అసంతృప్తి అంతా ఒక్క తూర్పు కళ్యాణ్ నియోజకవర్గానికే పరిమితమైనట్లు కనిపిస్తున్నది. కానీ ఈ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవకాశం ఉందన్న ఆందోళన శివసేన వర్గాల్లో వ్యక్తమౌతున్నది. అన్నిటికీ మించి మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఈ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తున్నది. ఇది కూడా శివసేన- బీజేపీ కూటమికి ఒకింత నష్టం కలిగించే అంశంగానే చూడాల్సి ఉంటుంది. అయితే ఆర్టికల్ 370 రద్దుతో వ్యక్తమైన ప్రజా సానుకూలత ముందు మిగిలిన విషయాలేవీ నిలవవని బీజేపీ బలంగా నమ్ముతోంది.

 

Bjp, winning, confident, Maharashtra, elections

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   7 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   10 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   13 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   13 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   14 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   11 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle