‘మహా’లో పట్టు నిలిచేనా? హర్యానాలో హవా సాగేనా?
18-10-201918-10-2019 16:58:39 IST
2019-10-18T11:28:39.668Z18-10-2019 2019-10-18T11:28:09.542Z - - 20-04-2021

నాలుగు నెలల కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ప్రభంజనం వీచింది. అయితే పార్టీగా బీజేపీ గెలిచిందనడం కంటే వ్యక్తిగత ఛరిష్మాతో మోడీ పార్టీకి అపూర్వ విజయాన్ని సాధించి పెట్టారని చెప్పాలి. ఆ ఎన్నికలలో బీజేపీ ప్రభంజనం ముందు విపక్ష పార్టీలూ, వాటి ఐక్యత, పొత్తులు సోదిలోకి లేకుండా పోయాయి. ఇప్పుడు నాలుగు నెలల తరువాత కీలకమైన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాలలో కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వాలే. ఐదేళ్ల పాలనలో ఏమైనా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నా...మోడీ ఛరిష్మా ముందు అదేమంత ప్రభావం చూపదన్న విశ్వాసంతో కమలం ఉంది. ఈ నాలుగు నెలలలోనూ విపక్షాలు ఇసుమంతైనా పుంజుకున్న దాఖలాలు కనిపించడం లేదు. నాటి పరాజయ భారం నుంచి తేరుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అయినా మహారాష్ట్ర, హర్యానాలో శక్తియుక్తులన్నీ కూడగట్టుకుని కాంగ్రెస్ పోరాటం చేస్తున్నది. ఇక ఆర్థిక మాంద్యం దెబ్బ అధికార పార్టీకి పడే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. రెండు రాష్ట్రాలలో పట్టు నిలుపుకోవాలని కమల నాథులు భావిస్తుంటే....రెండు రాష్ట్రాలలో పాగా వేసి గత సార్వత్రిక ఎన్నికల పరాభవ భారం నుంచి తేరుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. అయితే బీజేపీకి ఉన్నంత సానుకూలత కాంగ్రెస్ కు కానీ ఇతర విపక్షాలకు కానీ కనిపించడం లేదు. ఇదే బీజేపీ ప్రచారంలో దూసుకుపోతున్నట్లు కనిపించడానికి కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. రేపటితో ఎన్నికల ప్రచార గడువు ముగుస్తుంది. 21న ఎన్నికలు జరుగుతాయి. 24న ఫలితాలు వెలువడుతాయి. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 18 రాష్ట్రాల పరిథిలోని 64 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు ఇదే తేదీన జరుగుతున్నాయి. హర్యానా, మహారాష్ట్రల్లో కమలం విజయం నల్లేరు మీద బండినడకేనన్న సర్వేలను సందేహించాల్సిన అవసరం లేదు. అయితే కాంగ్రెస్, విపక్షాలు ఏ మేరకు పోటీ ఇస్తాయన్నదే అందరిలోనూ ఆసక్తిని పెంచేస్తున్నది. కాంగ్రెస్ నాయకత్వ సంక్షోభం, ఆ పార్టీకి మిత్రపక్షమైన ఎన్సీపీ కేసుల చిక్కులతో ఇబ్బందులు ఎదుర్కొనడంతో మహారాష్ట్రలో ఆ కూటమి ప్రచారం పెద్ద ప్రభావమంతంగా లేదు. ఇక హర్యానా విషయానికి వస్తే అక్కడ సీనియర్లు, జూనియర్లు అన్న విభేదాలతో కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతున్నది. ప్రచారం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతోంది. ఇక ఆర్టికల్ 370 రద్దు...విపక్షాల ప్రచార జోరుకు బ్రేక్ వేసింది. ఇతర సమస్యలు, అంశాలూ అన్ని పక్కకు వెళ్లిపోయాయి. ఆర్టికల్ 370 రద్దు కేంద్రంగా బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తుండటం బీజేపీయేతర పక్షాలను ఇరుకున పెడుతున్నది. ఎందుకంటే గత ఐదేళ్లుగా రెండు రాష్ట్రాలలోనూ అధికారంలో ఉన్నది బీజేపీయే. ఆ బీజేపీ ప్రభుత్వాల పనితీరు, వైఫల్యాలు, విజయాలు కేంద్రంగా ప్రచారం సాగి ఉంటే విపక్షాలకు ఒకింత అవకాశం ఉండేది. అలాగే ఆర్థిక మాంద్యం కారణంగా జనం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రచారంలో ప్రస్తావనకు వచ్చి ఉంటే విపక్షాలకు ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు ఆస్కారం ఉండేది. కానీ వ్యూహాత్మకంగా కమల నాథులు తమకు కలిసి వస్తుందని భావిస్తున్న ఆర్టికల్ 370నే ఎన్నికల ప్రచారాంశంగా మార్చేశారు. దీంతో విపక్షాలు కూడా అనివార్యంగా ఆ అంశంపై తమ వైఖరి ఏమిటో చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడింది. విధానపరంగా ఆర్టికల్ 370ని వ్యతిరేకించే పార్టీలలోని ముఖ్యులు కూడా వ్యక్తిగతంగా కేంద్రం నిర్ణయాన్ని సమర్ధిస్తున్న పరిస్థితి విపక్షాలను ఇరకాటంలోకి నెట్టేసింది. కాంగ్రెస్ నే తీసుకుంటే ముఖ్య నేతలు కొందరు పార్టీ విధానంతో విభేదించి ఆర్టికల్ 370 రద్దును బాహాటంగానే సమర్థించారు. ఈ పరిస్థితి అధిష్టానానికి పార్టీపై నియంత్రణ లేదన్న విషయాన్ని చాటుతోంది. ఇటువంటి సమస్యలతో సతమతమౌతున్న విపక్ష పార్టీలు మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలలో అక్కడి ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేకత అన్న అంశాలపైనే ఆధారపడి ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై ఎవరికీ ఆసక్తి లేని వాతావరణం ఏర్పడింది.

ఏపీలో స్కూల్స్ బంద్
13 hours ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
12 hours ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
17 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
18 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
14 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
21 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
21 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
13 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
15 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
21 hours ago
ఇంకా