newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మహారాష్ట్ర సీఎం పీఠంపై ఉద్దవ్ థాకరే.. రేపే పట్టాభిషేకం

27-11-201927-11-2019 08:34:58 IST
Updated On 27-11-2019 16:07:38 ISTUpdated On 27-11-20192019-11-27T03:04:58.071Z27-11-2019 2019-11-27T03:01:30.038Z - 2019-11-27T10:37:38.257Z - 27-11-2019

మహారాష్ట్ర సీఎం పీఠంపై ఉద్దవ్ థాకరే.. రేపే పట్టాభిషేకం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కీలక పరిణామాల మధ్య మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయడంతో రాజకీయాలు మారిపోయాయి. మహారాష్ట్ర సీఎం అభ్యర్థిగా శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ థాకరే పేరు ఖరారైంది.

సీఎం అభ్యర్థిగా, మహావికాస్‌ అఘాడీ నేతగా ఉద్ధవ్‌ థాకరేను ఎన్నుకున్నారు. సీఎం అభ్యర్థిగా ఉద్ధవ్‌ థాకరే పేరును ఎన్సీపీ నేత జయంత్‌ పాటిల్‌ ప్రతిపాదించగా ఆ ప్రతిపాదనలకు కాంగ్రెస్‌ నేత బాలాసాహెబ్‌ ధోరట్‌ మద్దతు తెలిపారు.

మహావికాస్‌ అఘాడీ కూటమి ఏర్పాటుకు మూడు పార్టీల సంయుక్త సమావేశంలో ఆమోదం లభించింది. దీంతో మహా వికాస్‌ అఘాడీ కూటమి నేతలు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారీని కలిశారు. నవంబర్ 28న ఉద్ధవ్‌ థాకరే సీఎం గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మరోవైపు బీజేపీ పతనం ప్రారంభమైందని ఎన్సీపీ-శివసేన కూటమి అయిదేళ్లు అధికారంలో ఉంటుందని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నారు.

రాజ్ భవన్ లో మంగళవారమే బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కాళిదాస్ కొలంబకర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు. బుధవారం ఉదయం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ఆయన ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 

గురువారం సాయంత్రం 6.40 గంటలకు దాదర్ లోని శివాజీ పార్క్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందు డిసెంబర్ 1న ప్రమాణ స్వీకారం ఉంటుందని శరద్ పవార్ ప్రకటించారు, కానీ మూడ్రోజుల ముందుకి జరిగింది.

శరద్ పవార్ భార్య ప్రతిభ, కూతురు సుప్రియా సూలె దౌత్యంతో అజిత్ పవార్ మళ్లీ కూటమి వైపునకు వచ్చారు. తిరుగుబాటు చేసి బీజేపీ క్యాంప్‌తో చేతులు కలిపిన ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.

శరద్‌ పవార్‌ ఇంటికి అజిత్‌ మంగళవారం రాత్రి వచ్చారు. ఆ తరువాత ఛగన్‌ భుజ్‌బల్, ప్రఫుల్‌ పటేల్‌ కూడా శరద్‌ పవార్‌ నివాసానికి వచ్చారు.ఎన్సీపీ నేత జయంత్‌ పాటిల్, కాంగ్రెస్‌ నాయకుడు బాలాసాహెబ్‌ తోరట్‌ ఉప ముఖ్యమంత్రులుగా నియమితులయ్యే అవకాశముంది.

ఉద్ధవ్‌ ఠాక్రే సీఎం కానుండటంతో రాష్ట్రవ్యాప్తంగా శివసేన కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ముంబైలోని బీజేపీ ప్రధాన కార్యాలయం ముందు కూడా సేన శ్రేణులు బాణాసంచా కాల్చి, ఠాక్రే అనుకూల నినాదాలతో హోరెత్తించారు. 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   14 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   13 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   17 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   18 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   19 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle