newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ థాక్రే.. ముహూర్తం సాయంత్రం

28-11-201928-11-2019 10:43:12 IST
2019-11-28T05:13:12.405Z28-11-2019 2019-11-28T05:13:05.305Z - - 17-04-2021

మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ థాక్రే.. ముహూర్తం సాయంత్రం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహారాష్ట్ర రాజకీయాలు దేశాన్ని కుదిపేశాయి.  మహారాష్ట్ర గవర్నర్ నిర్ఱయం, ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం వ్యవహారం రాజకీయాలను కుదుపు కుదిపాయి. తరవాత జరిగని పరిణామాలతో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి.

ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేనల కూటమి ఎట్టకేలకు తమ పంతం నెగ్గించుకున్నాయి. శరద్ పవార్ చాణక్యంతో బీజేపీ వైపు వెళ్ళిన అజిత్ పవార్ ని తిరిగి తన గూటికి తెచ్చుకున్నారు. కాస్త ఆలస్యం అయినా బీజేపీ పాచికలు పారలేదు. 

ఉద్దవ్ థాక్రే తన చిరకాల వాంఛ నెరవేర్చుకునే తరుణం వచ్చింది. మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్‌థాక్రే ప్రమాణస్వీకారం చేసే రోజు రానేవచ్చింది. గురువారం సా. 6:40కి  ఉద్దవ్ థాక్రే ప్రమాణస్వీకారం చేయనున్నారు. శివాజీ పార్క్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. భాగస్వామ్య  పార్టీల నుంచి ఇద్దరేసి మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

సీఎం ఉద్ధవ్‌ థాక్రేతో పాటు ప్రమాణస్వీకారం చేసేవారిలో శివసేన నుంచి సుభాష్‌ దేశాయ్‌, ఏక్‌నాథ్‌ షిండే, ఎన్సీపీ నుంచి జయంత్‌ పాటిల్‌, ఛగన్‌ భుజ్‌బల్‌, కాంగ్రెస్‌ నుంచి అశోక్‌చవాన్, బాలా సాహెబ్‌ థోరట్‌ ప్రమాణం చేస్తారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం పంపారు. డీఎంకె అధినేత స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను శివసేన ఆహ్వానించింది. ప్రధాని నరేంద్రమోడీకి కూడా ఉద్దవ్ ఆహ్వానలేఖ రాశారు.

Image

ప్రస్తుతం ఉద్దవ్ థాక్రే ఏ సభలోనూ సభ్యుడిగా లేరు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఆరు నెలల్లో ఆయన శాసనమండలి లేదా, శాసనసభకు ఎన్నికవ్వాలి. ఈ ఎన్నిక తర్వాత రాష్ట్ర శాసనసభలో అరుదైన రికార్డు నమోదవుతుంది. ఒకే సభలో తండ్రి ముఖ్యమంత్రిగా, కొడుకు ఎమ్మెల్యేగా తొలిసారి కనిపించనున్నారు. మహారాష్ట్ర రాజకీయ చరిత్రకు సంబంధించినంతవరకు ఇలాంటి రికార్డు నమోదుకావడం ఇదే తొలిసారి అంటున్నారు.

థాక్రేల కుటుంబం ఎప్పుడూ ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో నిలవలేదు. తొలిసారి ఉద్దవ్ తనయుడు ఆదిత్య థాక్రే ఎన్నికల్లో గెలిచారు.  ఠాక్రేల కుటుంబం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన తొలి వ్యక్తి ఆదిత్య కాగా.. ఠాక్రేల కుటుంబం నుంచి తొలిసారి ఉద్ధవ్‌ సీఎం అవుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ మహారాష్ట్రకు ఎక్కువమంది సీఎంలను అందించింది.

తండ్రీకొడుకులైన కాంగ్రెస్‌ నేతలు శంకర్‌రావు చవాన్‌, అశోక్‌ చవాన్‌ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. మొత్తం మీద మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేన పార్టీలు కొత్త చరిత్ర లిఖించబోతున్నాయి. ఈ సంకీర్ణం ఎంతకాలం ఉంటుందో చూద్దామని ఇప్పటికే బీజేపీనేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   an hour ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   an hour ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   3 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   4 hours ago


hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

   26 minutes ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   7 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle