మహారాష్ట్ర సింహాసనం ఇక శివసేనదే..
16-11-201916-11-2019 11:28:27 IST
Updated On 16-11-2019 16:14:11 ISTUpdated On 16-11-20192019-11-16T05:58:27.653Z16-11-2019 2019-11-16T05:58:18.562Z - 2019-11-16T10:44:11.514Z - 16-11-2019

ఎట్టకేలకు మహారాష్ట్ర పీట ముడి పరిష్కారమైనట్లే. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి శివసేన నుంచే ఉంటారని ఎన్సీపీ సీనియర్ నాయకుడు నవాబ్ మాలిక్ వెల్లడించారు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్నామని ఆ పార్టీ తేల్చి చెప్పిందన్నారు. శివసేనకు చెందిన నేత సీఎం పదవిని చేపట్టనుండగా.. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. శివసేన, ఎన్సీపీ చెరో 14 మంత్రి పదవులు, కాంగ్రెస్‌కు 12 మంత్రి పదవులు పంచుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. దశాబ్దాలుగా బద్ధ శత్రువులైన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఏకతాటిపైకి వస్తుండటంతో శివసేన ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. కనీస ఉమ్మడి ప్రణాళిక(సీఎంపీ)కు మూడు ప్రధాన పక్షాలూ ఆమోదం తెలిపాయి. 40 అంశాలతో కూడిన సీఎంపీపై ఇవి అంగీకారానికి వచ్చాయి. శని, ఆదివారాల్లో మరోసారి చర్చలు జరిపి, ఈనెల 17కి తుది బ్లూప్రింట్‌ను రూపొందించనున్నాయి. అన్నీ కొలిక్కి వస్తే ఆదివారంలోపే గవర్నర్‌ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు పిలుపినివ్వాల్సిందని కోరనున్నట్లు సమాచారం. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్లూ పూర్తిస్థాయిలో ఉండనుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెల్లడించారు. మధ్యంతరం వచ్చే అవకాశమే లేదన్నారు. కాగా శివసేన ఆధ్వర్యంలో మహారాష్ట్రలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ చెప్పారు. కేవలం ఐదేళ్లు కాదని, రాబోయే 25 ఏళ్లపాటు శివసేన అధికారం చెలాయించనుందని జోస్యం చెప్పారు. అయితే రాజకీయాలు, క్రికెట్లో ఏమైనా జరగొచ్చని, ఓడిపోతున్నట్లు కనిపించిన జట్టు చివరికి గెలవవచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్య చేశారు. అధికారం దరిదాపుల్లోకి వచ్చి అనూహ్యంగా అధికారానికి దూరమైన బీజేపీ కొత్త పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది.

మూడ్రోజులు మీ సేవ కేంద్రాలు బంద్
3 hours ago

నిధుల సంగతేంటి? కేంద్రంపై టీఆర్ఎస్ వత్తిడి
3 hours ago

పౌరసత్వ బిల్లుకి రాష్ట్రపతి ఓకె.. అసోం, మేఘాలయ, త్రిపురలో ఉద్రిక్తత
4 hours ago

తెలుగుదేశంలో రాయలసీమ కరువు..!
4 hours ago

అన్నయ్య అలా.. తమ్ముడు ఇలా..!
4 hours ago

మద్యంపై ఉన్న మమకారం రైతులపై ఎక్కడ?
17 hours ago

రివ్యూ పిటిషన్ల డిస్మిస్.. అయోధ్యపై సుప్రీం కీలక నిర్ణయం
17 hours ago

కామారెడ్డి జెడ్పీ ఛైర్ పర్సన్ వ్యాఖ్యలపై రభస
18 hours ago

దిశ హత్యాచారం కేసులో మరో బిగ్ ట్విస్ట్..!
18 hours ago

వైఎస్ వివేకా కేసు: సిట్ ముందు హాజరైన ఆది
21 hours ago
ఇంకా