మహారాష్ట్ర మంత్రికి కరోనా పాజిటివ్.. కేరళలో చిన్నారి బలి
24-04-202024-04-2020 10:51:49 IST
Updated On 24-04-2020 12:18:59 ISTUpdated On 24-04-20202020-04-24T05:21:49.694Z24-04-2020 2020-04-24T05:21:22.197Z - 2020-04-24T06:48:59.186Z - 24-04-2020

కరోనా వైరస్ ఎవరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా మహారాష్ట్రలో ఓ మంత్రి కరోనా వైరస్ బారినపడ్డారు. పది రోజుల క్రితం జరిపిన పరీక్షల్లో ఓ మంత్రికి నెగిటివ్ రాగా.. ఇప్పుడు పాజిటివ్ వచ్చింది. మహారాష్ట్ర హౌసింగ్ మినిస్టర్ జితేంద్ర అవహద్‌కు కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆయనను థానేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. అయితే ఓ పోలీస్ ఆఫీసర్ వలన మంత్రికి కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు.

ఏప్రిల్ ఆరంభంలో లాక్డౌన్, లా అండ్ ఆర్డర్ గురించి చర్చించడానికి ముంబ్రా పోలీస్ స్టేషన్లో ఓ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ను జితేంద్ర కలిశారు. నాసిక్ వెళ్లొచ్చిన ఆ పోలీస్ ఆఫీసర్‌కు గురువారం కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. దీంతో ఆ ఆఫీసర్ కాంటాక్ట్ అయిన మంత్రి సహా 100 మందికి థానే మున్సిపల్ అధికారులు కరోనా పరీక్షలు చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 13న మంత్రికి నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ రాగా.. తాజాగా పాజిటివ్ వచ్చింది. కాగా దీనికంటే ముందు తన సెక్యూరిటీ సిబ్బందిలో కొంతమందికి కరోనా సోకడంతో.. జితేంద్రతో పాటు 15 మంది కుటుంబసభ్యులు వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉన్న విషయం తెలిసిందే.
మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. శుక్కవారం ఉదయానికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23, 039కి పెరిగింది. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 721కి చేరుకుంది. దేశంలో మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య ఆరువేలకు చేరువయ్యాయి. ఢిల్లీ, తమిళనాడులలో కూడా కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ కరోనా సంక్షోభం వేళ మూడురాష్ట్రాలు ఆ మహమ్మారి బారినుంచి బయటపడ్డాయి. గోవా, మణిపూర్, త్రిపుర కరోనా ఫ్రీ రాష్ట్రాలుగా అవతరించాయి.
కేరళలో ఓ చిన్నారిని కరోనా మహమ్మారి బలితీసుకుంది. మలప్పురం జిల్లాలోని మంజేరికి చెందిన నాలుగు నెలల చిన్నారికి అధిక జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడటంతో తల్లిదండ్రులు ఈ నెల 21న కోజికోడ్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షల అనంతరం బుధవారం పాపకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా చికిత్స పొందుతున్న చిన్నారి దురదృష్టవశాత్తు శుక్రవారం ఉదయం మరణించింది.
అయితే గత 3 నెలలుగా చిన్నారి గుండె సంబంధిత సమస్యలకు పోరాడుతోందని వైద్యులు తెలిపారు. ఇక మలప్పురం జిల్లాలో ఇప్పటి వరకు 20 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కేరళ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.రాష్ట్రంలో గురువారం 10 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 447 ఉండగా ఆక్టివ్ కేసుల సంఖ్య 129 గా ఉంది. అంతేగాక 23 వేల మంది క్వారంటైన్లో ఉన్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.
ఇదిలా ఉంటే అధిక ఉష్ణోగ్రతలో కరోనా వైరస్ బలహీనపడుతుందని అమెరికా పరిశోధన పేర్కొంది. అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలలో కరోనా వైరస్ త్వరగా బలహీనపడుతుందని తాజా పరిశోధనలో వెల్లడైనట్లు పేర్కొంది. ఉష్ణోగ్రత అధికమౌతుంటే వైరస్ వేగంగా నిర్జీవం అవుతుందని వెల్లడౌందని అమెరికా సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతినిధి చెప్పారు.

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
an hour ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
2 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
4 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
5 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
6 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
6 hours ago

వన్ ప్లస్ వన్ ఆఫర్
4 hours ago

నా రూటే సెపరేటు
8 hours ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
21 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
a day ago
ఇంకా