newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మహారాష్ట్ర ప్రోటెం స్పీకర్ గా కాళిదాస్ కొలంబకర్ ప్రమాణం

26-11-201926-11-2019 18:18:38 IST
Updated On 26-11-2019 18:18:35 ISTUpdated On 26-11-20192019-11-26T12:48:38.272Z26-11-2019 2019-11-26T12:40:40.544Z - 2019-11-26T12:48:35.873Z - 26-11-2019

మహారాష్ట్ర ప్రోటెం స్పీకర్ గా కాళిదాస్ కొలంబకర్ ప్రమాణం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహారాష్ట్రలో ఉదయం నుంచి బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తూనే వున్నాయి. ఉదయం సుప్రీంకోర్టు తీర్పు, తర్వాత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ రాజీనామా, తర్వాత సీఎం ఫడ్నవీస్ రాజీనామా.. ఇలా అన్నిటికి మించి మహారాష్ట్ర ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయింది. రాజ్ భవన్ లో బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కాళిదాస్ కొలంబకర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు.

కాళిదాస్ కొలంబకర్ బుధవారం ఉదయం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఫడ్నవీస్ రాజీనామాతో మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖరారైంది. రేపు ఉదయం 8 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగుతుందని గవర్నర్ ఆదేశాలు జారీచేశారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. 

అజిత్ పవార్ ని బుజ్జగించడంలో శరద్ పవార్ సతీమణి, అజిత్ పవార్ చిన్నమ్మ ప్రతిభ పవార్, చెల్లెలు సుప్రియా సూలె విజయవంతం అయ్యారు. మళ్లీ శివసేన కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి అజిత్ పవార్ కు లభిస్తుందని, మరోసారి ఆలోచించాలని అజిత్ ని  ఒప్పించారు. దీంతో చల్లబడిన అజిత్ రాజీనామాకు అంగీకరించారు. అజిత్ వెనక్కి తగ్గడంతో ఫడ్నవీస్ కూడా రాజీనామా చేయకతప్పలేదు.  దీంతో ఉద్దవ్ థాక్రే సీఎం కావడం లాంఛనమే అవుతోంది. నవంబర్ 27 వతేదీన ఉద్దవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే అవకాశాలున్నాయి. ఇటు సంకీర్ణంలో డిప్యూటీ సీఎంల పంపకాలు కూడా పూర్తయ్యాయని సమాచారం. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle