newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి.. కంగనా

18-09-202018-09-2020 18:48:52 IST
2020-09-18T13:18:52.894Z18-09-2020 2020-09-18T13:18:47.690Z - - 12-04-2021

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి.. కంగనా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సుశాంత్ మరణం తర్వాత సుశాంత్ మద్దతుగా కంగనా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. సుశాంత్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ డ్రగ్స్ కేసుగా మారింది. కంగనా కూడా సమయానుకూలంగా అందరిపై సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. బాలీవుడ్ మాఫియాపై, బాలీవుడ్ ప్రముఖులపై ఆరోపణలు చేసింది. మహారాష్ట్ర పోలీసులపై, మహారాష్ట్ర ప్రభుత్వంపై కూడా సుశాంత్ మరణం విషయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తుంది.

కొద్ది రోజులుగా శివసేన పార్టీ, మహారాష్ట్ర ప్రభుత్వంకి కంగనాకి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం దీన్ని పర్సనల్ గా తీసుకొని కంగనా ఇంటిని కూడా తప్పుడు ఆరోపణలతో కూల్చి వేయించింది. తాజాగా కంగనా మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసింది.                

ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఓ ఫాసిస్టు ప్రభుత్వంగా ఆరోపిస్తూ ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలంటూ డిమాండ్ చేసింది కంగనా. గతంలో ముంబైను పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పోల్చడాన్ని శివసేన నేతలు తప్పుపట్టారు. దీంతో ఆమెపై పర్సనల్ గా రివెంజ్ తీసుకోడానికి ప్లాన్ చేసి ముంబైలోని ఆమె సినీ కార్యాలయాన్ని అక్రమ మరమ్మతుల పేరుతో పాక్షికంగా కూల్చివేశారు. ఈ చర్య దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.

ఆ తర్వాత కంగనా హైకోర్టును ఆశ్రయించగా, కూల్చివేతపై స్టే విధించింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.  తర్వాత కంగనా ముంబైను వీడి తన స్వరాష్ట్రానికి వెళ్లిపోయింది. ఇక అప్పడి నుంచి ట్వీట్ల రూపంలో మహారాష్ట్రపై యుద్ధం కొనసాగిస్తోంది. తాజాగా ఈ కరోనా మహమ్మారి వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రం మహారాష్ట్ర అని, రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంటే ఈ ఫాసిస్ట్ ప్రభుత్వం కట్టడి చర్యలు తీసుకోవడం మానేసి వారికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని వేధించడమే పనిగా పెట్టుకుందని కంగనా ట్వీట్ చేసింది. ఈ ఫాసిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేసి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేసింది.

అంతే కాకుండా ఫెమినిస్టులపై కూడా కంగనా మండిపడింది. ఫెమినిస్టులంతా ఎలాంటి ఆధారాలు లేకుండా తన ఇంటిని అక్రమ కట్టడమని అంటున్నారని, తాను ఈ కేసులో బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌పై గెలుస్తానని, బీఎంసీ నష్టపరిహారం చెల్లించక తప్పదని కంగనా వ్యాఖ్యలు చేసింది. అప్పుడు ఈ ఫెమినిస్టులంతా తనకు క్షమాపణ చెబుతారా అని కంగనా ప్రశ్నించింది. కంగనా, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య ఘర్షణలు ఇప్పట్లో తగ్గేలా లేవు అని అనుకుంటున్నారు. మరో పక్క కంగనాని ఒక్క దాన్ని చేసి బాలీవుడ్ మాఫియా, మహారాష్ట్ర ప్రభుత్వం వేధిస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.   

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle