మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. రామ్ నాథ్ కోవింద్ ఆమోదం
12-11-201912-11-2019 17:56:41 IST
2019-11-12T12:26:41.978Z12-11-2019 2019-11-12T12:26:40.501Z - - 15-04-2021

మహారాష్ట్ర రాజకీయం కథ ఢిల్లీకి చేరింది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రహోంశాఖకు గవర్నర్ సిఫార్సు మధ్యాహ్నం అందింది. దీనికి అనుగుణంగా మధ్యాహ్నం జరిగిన కేంద్ర క్యాబినెట్ భేటీ లో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు ఆమోద ముద్ర లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మహారాష్ట్రలో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమై సంఖ్యా బలం లేకపోవడంతో గవర్నర్ సిఫార్సును పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ రాష్ట్రపతి పాలనకు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించారు. దీంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన వెంటనే అమలులోకి వచ్చింది. మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 145 స్ధానాల మేజిక్ ఫిగర్‌కు చాలా దూరంలో నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో తాము ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని గవర్నర్ కు వివరించారు. బీజేపీ తరవాత అసెంబ్లీలో రెండవ పెద్ద పార్టీ అయిన శివసేనను గవర్నర్ ఆహ్వానించినా బలనిరూపణకు డెడ్‌లైన్ పొడిగించాలేదు. అనంతరం మూడో అతిపెద్ద పార్టీ ఎన్సీపీని మంగళవారం రాత్రి 8.30 గంటల్లోగా బలనిరూపణ చేసుకోవాలని గడువు విధించారు. ఈ దిశగా మూడుపార్టీలు ముందుకు సాగుతుండగా గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడం వివాదాస్పదం అవుతోంది. దీనిపై మూడు పార్టీలు మండిపడుతున్నాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తలుపు తట్టాలని శివసేన నిర్ణయించింది. ఈమేరకు శివసేన చీఫ్ ఉధ్ధవ్ థాక్రే వెంటనే ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ ను సంప్రదించారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నారు.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
13 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
14 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
13 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
17 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
18 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
17 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
19 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
20 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
15 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
21 hours ago
ఇంకా