newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మహారాష్ట్రలో క్యాంప్ పాలిటిక్స్ షురూ.. రిసార్ట్స్ బిజీబిజీ

25-11-201925-11-2019 09:06:36 IST
2019-11-25T03:36:36.386Z25-11-2019 2019-11-25T03:36:30.389Z - - 12-04-2021

మహారాష్ట్రలో క్యాంప్ పాలిటిక్స్ షురూ.. రిసార్ట్స్ బిజీబిజీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటుకు తగిన బలం లేకపోతే ఇక అంతే సంగతులు. ప్రత్యర్ధి పార్టీల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం ఆయా పార్టీలు క్యాంప్ రాజకీయాలకు తెర తీస్తాయి. రహస్య భేటీలతో ఎమ్మెల్యేలను ఇతర రాష్ట్రాలకు కూడా తరలిస్తాయి. కర్నాటకలో జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముంబై తరలించిన సంగతి తెలిసిందే. రెబల్స్ ఎమ్మెల్యేల కారణంగా కుమారస్వామి నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. 

బీజేపీకి చెందిన యడియూరప్ప ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. మహారాష్ట్ర రాజకీయం క్షణానికో విధంగా మారుతోంది. ఇప్పుడు సీన్ మహారాష్ట్రకు మారింది. మహారాష్ట్రలో సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ సీఎంగా ప్రమాణం చేశారు, డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 30వ తేదీన బలనిరూపణకు సమయం దగ్గరపడుతుండడంతో పార్టీలు తమ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

రిసార్ట్ లకు తమ ఎమ్మెల్యేలను తరలిస్తున్నాయి.ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో  ఆదివారం రాత్రి ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ సమావేశం కావడంతో ఈ వార్తలు మరింత పెరిగాయి. ఇద్దరు నేతలు రహస్య చర్చలు జరిపారని తెలుస్తోంది. వీరిద్దరూ బల నిరూపణకు తీసుకోవలసిన చర్యలతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. అయితే సీఎంవో మాత్రం రైతుల సమస్యల గురించి  చర్చించామని చెబుతోంది. 

మహారాష్ట్రలో జాగ్రత్త పడుతున్నాయి ప్రధాన పార్టీలు. హోటల్ నుండి ఎమ్మెల్యేలను వేరేచోటికి తరలిస్తున్నారు. ప్రస్తుతం రహస్య ప్రాంతంలో ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎటు వెళ్ళినా శివసేనకు సమాచారం అందేలా ఏర్పాట్టు చేశారు.

శివసేన నెట్ వర్క్ మీద నమ్మకంతో తమ ఎమ్మెల్యేలను కూడా ముంబైలోనే ఉంచాయి కాంగ్రెస్-ఎన్సీపీలు. .మారియట్ హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక.లలిత హోటల్లో శివసేన ఎమ్మెల్యేలు...రేనిసోన్ హోటల్లో ఎన్సీపీ ఎమ్మెల్యేలకు బస కల్పించారు. వారికి సకల ఏర్పాట్లు చేశాయి ఆయా పార్టీలు. హోటల్లో పని చేసే వర్కర్స్ తో శివసేన నిఘా ఏర్పాటుచేసినట్టు సమాచారం. 

ఇదిలా ఉండగా మహారాష్ట్రలో తాజా పరిణామాలపై కాంగ్రెస్ ఆచితూచి స్పందిస్తోంది. బలనిరూపణ బీజేపీని భయపెడుతోందని.. ఆపార్టీ నేతలు పారిపోతున్నారని కాంగ్రెస్‌ పార్టీ వ్యాఖ్యానించింది. తగినంత సంఖ్యా బలం లేకపోవడం వల్లే బీజేపీ వెనకడుగు వేస్తోందని మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పృథ్వీరాజ్‌ చౌహాన్‌ విమర్శించారు.

అర్థరాత్రి చర్చలు, ఉదయం ప్రమాణస్వీకారాలతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం అక్రమమని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా అన్నారు. గవర్నర్‌ కార్యాలయాన్ని ఉపయోగించుకొని బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కాంగ్రెస్ నేతలు ఘాటు విమర్శలు చేస్తోంది. బలనిరూపణకు సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ నాయకత్వంలోని ధర్మాసనం ఏం తీర్పునిస్తుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle