newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

మహారాష్ట్రలో కరోనా కట్టడి సాధ్యం కావడం లేదా?

15-06-202015-06-2020 08:11:03 IST
Updated On 15-06-2020 11:12:01 ISTUpdated On 15-06-20202020-06-15T02:41:03.640Z15-06-2020 2020-06-15T02:40:50.010Z - 2020-06-15T05:42:01.846Z - 15-06-2020

మహారాష్ట్రలో కరోనా కట్టడి సాధ్యం కావడం లేదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఆదివారం11,458 కేసులు నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో 11,929 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,20,922కు చేరింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.  భారత్‌లో గడిచిన 24 గంటల్లో 311 మంది, ఇప్పటివరకు 9195 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,49,348గా ఉంది.

దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత పెరిగిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. మరో 15 నగరాల్లో కరోనా ఉధృతి.. మొత్తం కేసుల్లో సగం సిటీల్లోనే వున్నాయి. కరోనా వైరస్ కేసులకు కేరాఫ్ అడ్రస్ అయిన ముంబయ్ లో ఐసీయూల కొరత, కేసుల పెరుగుదల వైద్యులను తీవ్ర వత్తిడికి గురిచేస్తోంది. దీంతో వైద్యం అందించలేక ఆస్పత్రులు చేతులెత్తేస్తున్నాయి. మహారాష్ట్రలో.. ముఖ్యంగా ముంబయ్ ని  కరోనా వైరస్ వణికిస్తోంది. 

ఆసుపత్రులన్నీ వ్యాధిగ్రస్తులతో నిండిపోతున్నాయి. కొత్త కేసులు వస్తే తామేమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగులకు సరిపడా పడకలు. వెంటిలేటర్లు అందుబాటులో ఉంచడం కష్టం అవుతోందని చెబుతున్నారు. దీంతో కరోనా రోగులను ఒకేచోట ఉంచాల్సిన దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. 

ముంబయిలో 99 శాతం ఐసీయూ బెడ్లు, 94 శాతం వెంటిలేటర్లను కరోనా రోగుల చికిత్స కోసం వాడుతున్నామని ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ తెలిపింది. ఈ నెల 11 నాటికి నగరంలోని మొత్తం 1,181 ఐసీయూ పడకల్లో 1, 167 పడకలను కరోనా తీవ్రమైన వారి కోసం వినియోగిస్తున్నామని అధికారులు వెల్లడించారు. అందుబాటులో ఉన్న 530 వెంటిలేటర్లలలో 497 రోగులకు అమర్చామని, 5,260 ఆక్సిజన్ పడకలలో 3,986  వాడుకలో ఉన్నాయని అధికారులు తెలిపారు. కరోనా సోకిన సాధారణ రోగుల కోసం 10,450 పడకలు అందుబాటులో ఉండగా, 9,098 పడకలు నిండిపోయాయని అధికారులు వెల్లడించారు. బెడ్లు, వెంటిలేటర్ల సంఖ్యను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కరోనాను ఎదుర్కొనేందుకు రైల్వే శాఖ సిద్ధమయింది. దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో 204 ఐసోలేషన్‌ కోచ్‌లను ఏర్పాటుచేసింది. అందులో 54 కోచ్‌ లను ఢిల్లీలోని షకుర్బస్తి రైల్వే స్టేషన్‌ లో ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో ఢిల్లీలో 500 కోచ్‌లను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌లో 70 కోచ్‌లు, తెలంగాణలో 60 కోచ్‌లు (సికింద్రాబాద్, కాచిగూడ, ఆదిలాబాద్‌లలో 20 చొప్పున), ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో 20 కోచ్‌లను ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్‌ 240 కోచ్‌లు కావాలని, తెలంగాణ 60 కోచ్‌లు కావాలని గతంలో రైల్వే శాఖను కోరిన సంగతి తెలిసిందే. 

మరోవైపు దేశంలో కరోనా సంక్షోభం ఇంకా ఎంతోకాలం కొనసాగదని, త్వరలో టీకా అందుబాటులో రానుందని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గుజరాత్‌ జన్‌ సంవాద్‌ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. త్వరలో కరోనా సంక్షోభాన్ని అధిగమిస్తామని, దేశంలోని శాస్త్రవేత్తలు టీకాను అభివృద్ధి చేసేందుకు పగలూరేయి శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. టీకా త్వరలోనే అందుబాటులోకి రానుందని తనకు నమ్మకం ఉందన్నారు మంత్రి గడ్కరీ. ఉదయం 11 గంటలకు అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీలో కరోనా తీవ్రతపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చర్చ జరగనుంది.       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle