newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

22-02-202022-02-2020 11:02:27 IST
2020-02-22T05:32:27.605Z22-02-2020 2020-02-22T05:32:24.888Z - - 11-04-2021

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చిన్నారులు, మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం అద్భుతమైన ‘దిశ’ బిల్లును ప్రవేశపెట్టిందని, ఇది దేశానికే ఆదర్శమని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ప్రశంసించారు. అతి స్వల్ప కాలంలో ఇంత చక్కటి చట్టాన్ని రూపొందించి, అమలు పర్చినందుకు గాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, హోంమంత్రి మేకతోటి సుచరిత, అధికారులను ఆయన అభినందించారు. ఏపీ సచివాలయం సీఎస్‌ సమావేశం మందిరంలో గురువారం దిశ బిల్లుపై జరిగిన సమావేశంలో అనిల్‌ దేశ్‌ముఖ్‌ మాట్లాడుతూ.. దిశ లాంటి బిల్లును మహారాష్ట్రలో కూడా తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ’దిశ’  బిల్లు తెచ్చిన రెండు మాసాల్లోనే ప్రత్యేకంగా ‘దిశ’ పోలీస్‌స్టేషన్‌ను కూడా ప్రారంభించడం అభినందనీయమన్నారు. దిశ చట్టంపై సమగ్ర అధ్యయనం చేయడంతో పాటు అనుభవాలను పరిగణనలోకి తీసుకుని మహారాష్ట్రలో కూడా ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. 

రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలోనే మొదటిసారిగా చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాల అదుపునకు ‘దిశ బిల్లు’ను తీసుకువచ్చామని దిశ బిల్లు అమలుకు ప్రభుత్వం రూ. 87 కోట్లు ఇప్పటికే కేటాయించిందని వెల్లడించారు. 13 ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఏర్పాటు చేస్తున్నామని ఆమె ప్రకటించారు. ప్రత్యేక కంట్రోల్ రూం, వన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. దిశ పోలీస్ స్టేషన్లకు దిశ క్రైమ్ డిటెక్షన్ కిట్లను పంపిణీ చేశామని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్‌ను స్నేహపూర్వక మహిళా పోలీస్ స్టేషన్‌గా తీర్చిదిద్దుతామని సుచరిత పేర్కొన్నారు.

బాలికలు, మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన ‘దిశ బిల్లు’ను చారిత్రాత్మకమైన బిల్లుగా మహిళా శిశు,సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అభివర్ణించారు. 2020 ఏడాదిని మహిళా రక్షణ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని  మంత్రి వనిత తెలిపారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసిన తర్వాతే ‘దిశ బిల్లు’ను ప్రవేశపెట్టిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వివరించారు. ఈ బిల్లు అమలులో భాగంగా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ‘దిశ చట్టం’ అమలుకు ప్రత్యేకంగా ఇద్దరు మహిళా అధికారులను నియమించామని ఆమె చెప్పారు.

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'దిశ’చట్టం గురించి అధ్యయనం చేయడానికి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన మహారాష్ట్ర ప్రత్యేక అధికారుల బృందం గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమయింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన అధికారుల బృందం సీఎం జగన్‌ను కలిసి దిశా చట్టం గురించి అడిగి తెలుసుకుంది. 

ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఆ బృందానికి దిశ చట్టం గురించి వివరించారు. సీఎం జగన్‌ను కలిసిన బృందంలో మహారాష్ట్ర హోమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌, డీజీపీ సుబోత్‌ కుమార్‌, అదనపు సీఎస్‌తో పాటు మరో ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు ఉన్నారు. ఈ సమావేశంలో ఏపీ మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహాని, దిశ స్పెషల్‌ ఆఫీసర్‌ దీపిక, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   16 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   12 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   15 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   19 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle