newssting
BITING NEWS :
*అవినీతి నిర్మూలనకు ఐఐఎంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం *నా వల్ల.. వంశీ వల్ల జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారంటూ టీడీపీ అడ్డగోలు కామెంట్లు - మంత్రి కొడాలి నాని *సీఎం జగన్ను డిక్లరేషన్ అడిగే హక్కు చంద్రబాబుకు ఎక్కడిది..?-మంత్రి నాని *ఆర్టీసీ, రవాణాశాఖాదికారులతో సీఎం కేసీఆర్ భేటీ*శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి ప్రమాదం లేదంటున్న డ్యామ్ సేఫ్టీ అధికారులు *తూ.గో: ముమ్మడివరం మండలం కొమనాపల్లిలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్*విజయవాడ: స్టెల్లా కాలేజీలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత*2021 అసెంబ్లీ ఎన్నికలు అద్భుతాలు ఖాయం-రజనీకాంత్

మహాభారత, రామాయణ పాత్రల పేరుతో కామెంట్లు

10-05-201910-05-2019 12:17:55 IST
Updated On 29-06-2019 12:21:51 ISTUpdated On 29-06-20192019-05-10T06:47:55.047Z10-05-2019 2019-05-10T06:47:53.395Z - 2019-06-29T06:51:51.416Z - 29-06-2019

మహాభారత, రామాయణ పాత్రల పేరుతో కామెంట్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సార్వత్రిక ఎన్నిక‌లు అంటేనే రాజ‌కీయ కురుక్షేత్రం. ఓట్ల మ‌హా సంగ్రామం. అందుకేనేమో ఈ ఎన్నిక‌ల్లో ప‌లు పార్టీల నేత‌లు త‌మ ప్రత్యర్ధుల‌ను భార‌త‌, రామాయ‌ణాల్లోని పేర్లతో ప్రచారం చేశారు. హ‌ర్యానాలోని అంబాలో ప్రచార స‌భ‌లో మోడీని దుర్యోధ‌నుడిగా వ‌ర్ణించారు ప్రియాంక వాద్రా. దుర్యోధ‌నుడి అహంకారాన్ని శ్రీకృష్ణుడు అణచి వేసినట్లు, మోడీ అహంకారాన్ని జ‌నం అణచి వేస్తార‌ని ప్రాస‌తో కూడిన ప్రసంగం చేశారు ప్రియాంకా గాంధీ.  

ఇక ప‌శ్చిమ బెంగాల్ ప్రచారంలో మోడీని ఆకాశానికి ఎత్తేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఈ ఎన్నిక‌ల ధ‌ర్మయుద్దంలో మోడీ అర్జునిడిగా ధ‌ర్మ పోరాటం చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. విప‌క్ష పార్టీల‌ను కౌర‌వ సైన్యంతో పోల్చారు అమిత్ షా. ఇక లాలూ ప్రసాద్ యాద‌వ్ కుమార్తె మిసా భార‌తీని శూర్పణ‌ఖ‌తో పోల్చారు జన‌తాద‌ళ్ యునైటెడ్ నేత సంజ‌య్ సింగ్. రావ‌ణాసురుడు, విభీష‌ణుడి మ‌ధ్య త‌గ‌వు పెట్టిన శూర్పణ‌ఖ లాగానే, లూలూ యాద‌వ్ కుమారులు తేజ్ ప్రతాప్ యాద‌వ్, తేజ‌శ్వి యాద‌వ్ మ‌ధ్య ఆమె త‌గ‌వు పెట్టార‌ని పాట్నాలో కామెంట్ చేశారు. 

ఇక యూపీలోని రోహ‌నియా ఎంఎల్ఏ, బీజేపీ నేత సురేంద్ర సింగ్ రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాల‌పై విరుచుకు ప‌డ్డారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని ప్రచార‌స‌భ‌లో రాహుల్ గాంధీ, ప్రియాంక‌ల‌ను రావ‌ణాసురుడు, శూర్పణ‌ఖ‌లుగా వ‌ర్ఙించారు. ఇదే త‌ర‌హాలో ప్రధాని న‌రేంద్ర మోడీ, అమిత్ షాల‌ను కామెంట్ చేశారు బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ అధినేత్రి మాయావ‌తి. మోడీ, అమిత్ షాలు దుర్యోధ‌న, దుశ్శాస‌నులుగా వ‌ర్ణించారు ఆమె. కూచ్ బెహార్ స‌భ‌తో మొద‌లు పెట్టిన ఈ ఆరోప‌ణ‌ల ప‌ర్వం, దాదాపుగా ప్రతి బ‌హిరంగ స‌భ‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. 

వీట‌న్నింటికంటే ముందు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ర‌ణ‌దీప్ సింగ్ సూర్జేవాలా గ‌తేడాది మోడీని ధృత‌రాష్ట్రుడిగా కామెంట్ చేసి, కొత్త వివాదానికి తెర‌తీశారు. మొత్తానికి ఈ ఎన్నిక‌ల వేళ రామాయ‌ణ‌, మహాభార‌తాల్లోని వ్యక్తుల‌ను ఇలా వాడేసుకోవ‌డం మ‌న పార్టీల‌కే చెల్లింద‌ని జ‌నం న‌వ్వుకుంటున్నార‌ట‌. ఈ కామెంట్లు శృతిమించడంపై ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle