మళ్ళీ మోడీ వస్తే రికార్డే..ఎందుకంటే..?
23-05-201923-05-2019 08:37:42 IST
Updated On 27-06-2019 11:49:17 ISTUpdated On 27-06-20192019-05-23T03:07:42.190Z23-05-2019 2019-05-23T03:07:40.764Z - 2019-06-27T06:19:17.233Z - 27-06-2019

ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి పూర్తిస్తాయి మెజార్టీ వచ్చి, నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని అయితే, 48 ఏళ్ల రికార్డ్ ఆయన తిరగరాసినట్లే. ఎందుకంటే 48 సంవత్సరాల తర్వాత ఒకే పార్టీ, ఒకే వ్యక్తి వరుస ఎన్నికల్లో గెలిచి ప్రధాని అవ్వడం జరగనుంది. ఎందుకంటే, 1967లో జరిగిన ఎన్నికల్లో కూడా ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి మెజార్టీతో గెలిచి అధికారం దక్కించుకుంది. ఆ తర్వాత అంటే, 1971 ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజార్టీతో ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇలా వరుసగా రెండు ఎన్నికల్లో గెలిచిన ఘనత అప్పట్లో ఇందిరా గాంధీ సొంతమైంది. ఎందుకంటే, 1952, 1957, 1962 ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజార్టీతో ప్రధాని అయ్యిన జవహర్ లాల్ నెహ్రూ తర్వాత, ఇందిరా గాంధీనే వరుసగా రెండుసార్లు ప్రధాని అయ్యారు. ఇప్పటి దాకా దేశంలో 16 సార్లు జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో నెహ్రూ మినహా ఇందిరాగాంధీనే రికార్డ్ నెలకొల్పారు. మొదటిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 398 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత రెండోసారి పార్లమెంటరీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 395 సీట్లు, మూడోసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 394 సీట్లు వచ్చాయి. ఈ మూడు సార్లు నెహ్రూ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక 1967లో 303 సీట్లు, 1971లో 372 సీట్లతో ఇందిరాగాంధీ వరుసగా రెండుసార్లు ప్రధాని అయ్యారు. ఇక 1980 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఇందిరాగాంధీ మూడోసారి ప్రధాని అయినా, ఆ తర్వాత ఆమె మరణంతో, 1984లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పుడు ప్రధానిగా రాజీవ్ గాంధీ బాధ్యతలు నెరవేర్చారు. ఇక 1999 నుంచీ 2004 దాకా రెండుసార్లు ప్రధానిగా అటల్ బిహారీ వాజ్ పాయ్ ప్రధాన మంత్రిగా ఉన్నా, బీజేపీకి పూర్తిస్తాయి మెజార్టీ లేదు. ఇతర పార్టీల భాగస్వామ్యంతో అటల్ బిహారీ వాజ్ పాయ్ ప్రధానిగా పనిచేశారు. ఇక 2004 నుంచి 2014 దాకా మన్మోహన్ వరుసగా రెండుసార్లు ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించినా, కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ లేదు. యూపీఏ భాగస్వామ్య పార్టీలతో ఆయన ప్రధానిగా పనిచేశారు. కానీ 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ ఉంది. ఈ ఎన్నికల్లో కూడా బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ వచ్చి, నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి అయితే, 48 సంవత్సరాల చరిత్ర రిపీట్ అయినట్లే.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
8 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
11 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
14 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
4 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
14 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
12 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
14 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
15 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
9 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
18 hours ago
ఇంకా