మళ్ళీ ఆప్‌దే హవానా.. పీకే స్ట్రాటజీ వర్కవుట్ అయ్యేనా?
08-01-202008-01-2020 08:27:53 IST
Updated On 08-01-2020 13:03:56 ISTUpdated On 08-01-20202020-01-08T02:57:53.997Z08-01-2020 2020-01-08T02:57:31.759Z - 2020-01-08T07:33:56.023Z - 08-01-2020

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం కావడంతో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరోమారు అధికారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ శతవిధాలా వ్యూహాలతో ముందుకెళుతోంది. ఉచిత పథకాలపైనే ఆప్ ఫోకస్ పెట్టింది. పరువు కోసం కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ తెగ ఆరాటపడుతోంది. కాంగ్రెస్ మాత్రం ఎలాగైనా చెప్పుకోదగ్గ స్థానాల కోసం పోటీపడుతోంది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 8న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకే ప్రజలు మరోసారి పట్టం కట్టనున్నారని ఐఎఎన్ఎస్- సీ ఓటర్ ప్రీ పోల్ సర్వేలో తేలింది. కేజ్రీవాల్ క్రేజ్ ముందు కమలం వాడిపోతుందని ఈ సర్వే చెబుతోంది. క్లీన్ స్వీప్ చేసి ఢిల్లీ సీఎం పీఠంపై కేజ్రీవాల్ మరోసారి కూర్చోబోతున్నారని ఈ సర్వే వెల్లడిస్తోంది. ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైందని సంస్థ తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 70 స్థానాల్లో ఆప్‌కు 59 సీట్లు రావచ్చని సర్వే వెల్లడించింది. పోల్ అయిన ఓట్లలో 2015లో పోలైన ఎక్కువశాతం అరవింద్ కేజ్రీవాల్ కే పడతాయని, మళ్ళీ హిస్టరీ రిపీట్ చేయబోతున్నారని ఈ సర్వే చెబుతోంది. ఆప్ కు 53.3శాతం, బీజేపీకి 25.9శాతం ఓటింగ్ వచ్చే అవకాశముందని తెలిపింది. 25.9శాతం ఓటింగ్ తో బీజేపీకి కేవలం 8నుంచి 10 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని సర్వేలో తేలింది. ఎంతోకాలం ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ అయితే కేవలం 3-4 సీట్లు మాత్రమే గెల్చుకునే అవకాశముంది. జనవరి మొదటివారంలో నిర్వహించిన ఈ ప్రీ పోల్ సర్వే వివరాలు విడుదలయ్యాయి. ఈ సర్వే శాంపిల్ సైజ్ 13వేలుగా వుంది. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 67సీట్లతో క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి కూడా 2015 రిపీట్ చేసేందుకు కేజ్రీవాల్ ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ తో కలిసి వ్యూహ రచన చేస్తున్నారు. ఏపీలో వైసీపీ ఘన విజయంలో ప్రధాన భూమిక ప్రశాంత్ కిషోర్ దే కావడంతో పీకే గ్రూప్‌తో ఆప్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు బీజేపీ కూడా ఢిల్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ అయితే ఈ రేస్ లో వెనుకబడినట్లే చెప్పవచ్చు. కాంగ్రెస్ ను నడిపించే నాయకుడే లేకుండా పోయాడు. గత ఎన్నికల్లో అన్నీ తానై తిరిగిన మాజీ సీఎం షీలా దీక్షిత్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
6 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
2 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
4 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
9 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
12 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
13 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
a day ago

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా