newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మళ్లీ మోడీ మంత్ర... కనిపించని రాహుల్ ప్రభ

23-05-201923-05-2019 11:49:55 IST
Updated On 27-06-2019 11:24:26 ISTUpdated On 27-06-20192019-05-23T06:19:55.569Z23-05-2019 2019-05-23T06:19:50.135Z - 2019-06-27T05:54:26.686Z - 27-06-2019

మళ్లీ మోడీ మంత్ర... కనిపించని రాహుల్ ప్రభ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తీవ్ర ఉత్కంఠ రేపుతున్న లోక్ సభ ఎన్నికల ఫలితాల ప్రారంభ ట్రెండ్స్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. మళ్ళీ నమోమంత్రం ఫలించింది. జనం మరోసారి నరేంద్రమోడీకి పట్టం కట్టినట్టు కౌంటింగ్‌ ట్రెండ్స్‌ స్పష్టం చేస్తున్నాయి. తిరుగులేని మెజారిటీతో సొంతంగా ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశముందని ఇప్పటివరకు అందుతున్న కౌంటింగ్‌ ఫలితాల సరళి చాటుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు అందుతున్న కౌంటింగ్‌ ట్రెండ్స్‌ను బట్టి ఎన్డీయే 332 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కేవలం బీజేపీ 285 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 

ఈ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ విఫలం చెందింది. రాహుల్ నేతృత్వంలోని యూపీఏ కూటమి 110 స్థానాలతో సరిపెట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇతర పార్టీలు 111 స్థానాలతో రెండో స్థానంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా మరోసారి నమో మేనియా పనిచేసినట్టు కనిపిస్తుండగా.. ఈసారి ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ ప్రచారం, ప్రభావం, ఆయన సోదరి ప్రియాంక గాంధీ ప్రచారమూ పెద్దగా పనిచేయనట్టు స్పష్టమవుతోంది. యూపీలో ఎస్పీ, బీఎస్పీ కూటమికి అంతగా ప్రజాదరణ లభించలేదని చెప్పాలి.

ఇటు ఒడిషాలో మళ్ళీ బీజేడీ ప్రభంజనం కనిపించింది. నవీన్ పట్నాయక్ మరోమారు సీఎం పీఠం అధిరోహించనున్నారు. మహారాష్ట్రలో బీజేపీ - శివసేన కూటమి దూసుకుపోతుంది. ఇప్పటి వరకూ జరిగిన కౌంటింగ్‌లో బీజేపీ - సేన 40కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. కాంగ్రెస్‌- ఎన్‌సీపీ కూటమి కేవలం ఆరు స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా గాంధీ నగర్‌లో దాదాపు 1,25,000 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి భారీ షాక్‌ తగిలింది. మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ 23 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఢిల్లీ ఏడు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ ప్రభావం కనిపించలేదు. కేంద్ర మంత్రి మేనకా గాంధీ సుల్తాన్‌పూర్‌లో వెనకంజలో ఉండగా.. వరుణ్‌ గాంధీ మాత్రం ఫిలిబిత్‌లో దూసుకుపోతున్నారు. మరోవైపు సోనియా గాంధీ రాయ్‌బరేలీలో ముందంజలో ఉన్నారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle