newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మళ్లీ మోడీయే ... ఉత్తమ ప్రధానమంత్రి ఆయనేనా?

09-08-202009-08-2020 18:11:19 IST
Updated On 10-08-2020 08:45:03 ISTUpdated On 10-08-20202020-08-09T12:41:19.946Z09-08-2020 2020-08-09T12:41:16.590Z - 2020-08-10T03:15:03.211Z - 10-08-2020

మళ్లీ మోడీయే ... ఉత్తమ ప్రధానమంత్రి ఆయనేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో ఒక వైపు కరోనా కేసులు తీవ్రత కొనసాగుతూనే వుంది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 64,399 కొత్త కరోనా కేసులు.  దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,53,011.  యాక్టివ్ కేసులు 6,28,747.  డిశ్చార్జ్ 14,80,885. గడిచిన 24 గంటల్లో 861 మంది మృతి.  దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 43,379గా వుంది. మరోవైపు మోదీయే బెస్ట్ ప్రధానమంత్రి అని సర్వేలో తేలింది.

ఏడాది కాలం తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన మోదీ అప్పటి హవాను కొనసాగిస్తున్నారు. ఇండియా టుడే సర్వేలో తిరుగులేని పీఎంగా పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తేల్చారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్నికలు పెట్టినా పూర్తిస్థాయి మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయమంటున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తిరుగులేని ప్రజాదరణ ఉందని మరోసారి తేలింది.

ఇప్పటికే దేశంలో సీఎంల పనితీరుపై సర్వే వెల్లడైంది. దేశంలో యూపీ సీఎం యోగి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఏపీ సీఎం జగన్ పాపులర్ సీఎంలలో టాప్ ప్లేస్‌లో వున్నారు.  ప్రధానిగా మోదీనే అత్యుత్తమం అని 'ఇండియా టుడే – కార్వీ ఇన్‌సైట్స్‌ మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌' సర్వే తాజాగా తేల్చిన సంగతి తెలిసిందే. ప్రధానిగా మోదీ పనితీరుపై జనం తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

మొత్తం 70 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. 5 శాతం మంది మాత్రమే అసహనం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, అందుకే మోడీ పనితీరుకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. దేశ ఆర్థిక రంగంలో స్తబ్ధత, చైనా, నేపాల్ సంబంధాల్లో మార్పులు, సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న క్లిష్ట సమయంలో జరిగిన ఈ సర్వేలో.. దేశ ప్రజలు మోదీపై సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేయడం విశేషం. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   12 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle