newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మళ్లీ పార్టీ బాధ్యతలా.. చాన్సే లేదన్న రాహుల్ గాంధీ

05-03-202005-03-2020 08:35:51 IST
2020-03-05T03:05:51.084Z05-03-2020 2020-03-05T03:05:48.757Z - - 22-04-2021

మళ్లీ పార్టీ బాధ్యతలా.. చాన్సే లేదన్న రాహుల్ గాంధీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ పగ్గాలను మరోసారి చేపట్టడంపై ఎంపీ రాహుల్‌ గాంధీ స్పందించారు. తాను పార్టీ చీఫ్‌ పదవికి రాజీనామా చేశానని, మళ్లీ ఆ బాధ్యతలు చేపట్టే ఉద్దేశం లేదని రాహుల్‌ స్పష్టం చేశారు. గతంలోనే తన రాజీనామాను పార్టీకి సమర్పించానని, ఇక దానిపై ప్రశ్నలు అనవసవరమని రాహుల్ అన్నారు. ‘‘పార్టీ నాయకత్వం విషయమై నేను ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నాను. నా రాజీనామాకు సంబంధించిన లేఖను పార్టీకి ఎప్పుడో అందించాను. ఇది బహిరంగ విషయమే. ఇక మళ్లీ నేను పార్టీ బాధ్యతలు తీసుకోవడం అనే అంశంపై ప్రశ్నలు అనవవసరం’’ అని రాహుల్ అన్నారు. పార్టీ నాయకత్వ బాధ్యతలను తిరిగి రాహుల్‌ స్వీకరిస్తారన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. 

పార్టీ చీఫ్‌ బాధ్యతలను తిరిగి స్వీకరించాలని పార్టీ ఒత్తిడి తెస్తే ఏమిటన్న ప్రశ్నకు రాహుల్‌ బదులిస్తే కాంగ్రెస్‌ అధినేత్రి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలని అన్నారు. కాగా గత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్‌ తాత్కాలిక చీఫ్‌గా సోనియా గాంధీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. సోనియా ఆరోగ్య పరిస్ధితుల దృష్ట్యా చురుకైన పార్టీ చీఫ్‌ ఉండాలని ఏఐసీసీ యోచిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఆవశ్యకతను సుస్పష్టంగా చాటాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నాయకత్వ బాధ్యతను రాహుల్‌ స్వీకరించే పరిస్దితి లేకపోవడంతో ఈ అంశంపై ఏప్రిల్‌లో జరిగే కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో తుది నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.

2017లో సోనియా గాంధీ అనంతరం పార్టీ బాధ్యతలు తీసుకున్న రాహుల్ గాంధీ.. కేవలం రెండేళ్లకే రాజీనామా చేశారు. ఒక్క సాధారణ ఎన్నికలు మినహా మిగతా ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించదగ్గ విజయాలే సాధించింది. బీజేపీ పాతుకుపోయిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారాన్ని కైవసం చేసుకుంది. మరికొన్ని రాష్ట్రాల్లో తగిన స్థానాలే సాధించింది. అయితే 2019 సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయమైంది. 2014తో పోల్చుకుంటే ఐదేళ్లలో కాంగ్రెస్ ఒకటి రెండు ఎక్కువ స్థానాలను మాత్రమే సాధించింది.

మరోవైపు కాంగ్రెస్‌ పాలిత మధ్యప్రదేశ్‌లో కమల్‌ నాథ్‌ ప్రభుత్వం సైతం కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ శిబిరానికి దగ్గరవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో చురుకైన నేత పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టాలని ఏఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి. గాంధీ కుటుంబం నుంచే పార్టీ అధినేత ఉండాలన్నది ఆ పార్టీ శ్రేణుల అభిప్రాయంగా ముందుకొస్తోంది. 

భారత వృద్ధ పార్టీ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా పని చేసిన రాహుల్ గాంధీ.. 2019 సాధారణ ఎన్నికల అనంతరం రాజీనామా చేశారు. ఎన్నికల సమయంలో పార్టీ నేతలు గెలుపు కోసం తమ వారసులకు టికెట్ల కోసం మాత్రమే పని చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కూడా. రాహుల్ రాజీనామాతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల రాజీనామాల పరంపర కొనసాగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో పడింది. అయితే మళ్లీ ఇన్నాళ్లకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రాహుల్ చేపట్టబోతున్నారా అనే ప్రశ్నలు మళ్లీ రేకెత్తుతున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి ఇప్పటి నుంచే సన్నద్ధం కావడం కోసం, రాహుల్ ఇప్పుడే పార్టీ బాధ్యతలు తీసుకుంటే మంచిదని ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన కొందరు సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు. అయితే ఇదే విషయమై రాహుల్ గాంధీని ప్రశ్నించగా ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. 

134 సంవత్సరాల తన చరిత్రలో కాంగ్రెస్ పార్టీ గాంధీల నేతృత్వంలోనే నడిచింది. మాజీ రాజీవ్ గాంధీ హత్యానంతరం 90లలో కొన్ని సంవత్సరాలు మాత్రమే దీనికి భిన్నంగా నడిచింది. అయితే సీతారాం కేసరి నేతృత్వంలో పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోవడంతో పలువురు సీనియర్ నేతల అభ్యర్థన మేరకు సోనియాగాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు.

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   8 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   11 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   14 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   14 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   15 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   12 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   21-04-2021


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle